పెద్దలు, పూజ్యులు కనిపించగానే పాదాభివందనం చేయాలంటారు. ఈ మాట ఈనాటిది కాదు! వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతితో భాగంగా సాగుతున్న ఆచారం



ఎదుటి వ్యక్తి పాదాలను స్పృశించడం అంటే తాత్కాలికంగా అయినా మన అహంకారాన్ని అణచివేసుకోవడమే, అహంకారం అణిగిన మనసులోనే వినయం, వివేకాలకి ఆస్కారం ఉంటుంది.



పాదాభివందనం చేయడం వల్ల మనలోని అహంకారం ఎలాగైతే అణగిపోతుందో, ఎదుటి మనిషిలో మన పట్ల అవ్యాజమైన ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ మన మంచిని కోరుతుంది.



పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను తలవంచి గౌరవిస్తున్నాం అని అర్థం



కుడిచేతిని వారి ఎడమకాలిపై, ఎడమచేతిని కుడికాలిపై పెట్టి ఆశీర్వచనం తీసుకోవాలి



వంగినప్పుడు పెద్దల చేతులు తలపై ఉండడం వల్ల క్లోజ్డ్ సర్కూట్ ఆకారం వస్తుంది. ఆ సమయంలో వారి శక్తి, జ్ఞానం బదిలీ అవుతాయని విశ్వాసం



పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల వారి పాద ధూళిలో కూడా ఎంతో జ్ఞానం దాగి ఉంటుందంటారు



తల్లిదండ్రులను, గురువులను, పూజ్యులను, జ్ఞానులను కొలిచేంజదుకు పాదాభివందనాన్ని మించిన ఆచారం లేదంటారు.