ఊపిరితిత్తులను కాపాడే సూపర్ ఫుడ్

వాయుకాలుష్యం వల్ల ఊపిరితిత్తులకు ఆరోగ్యసమస్యలు వస్తాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి శ్వాసకోశవ్యవస్థకు బలాన్నిచ్చే ఆహారాన్ని తినాలి. తినాల్సిన ఆహారపదార్థాల జాబితా ఇదిగో...

గుమ్మడికాయలో కెరటోనాయిడ్స్, బీటాకెరాటిన్, లుటిన్, జిక్సాంతిన్ వంటి సమ్మేళ్లనాలు ఇందులో పుష్కలం. ఇవి శ్వాసకోశవ్యవస్థను కాపాడతాయి.

అల్లంలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. ఊపిరితిత్తులకు రక్షణ కవచంలా ఉంటాయివి.

వెల్లుల్లి రోజూ తింటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఊపిరితిత్తులను ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడతాయి.

కొవ్వు పట్టిన చేపలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

పచ్చిమిర్చిలో కాప్సాసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ ను శుభ్రపరుస్తుంది.

విటమిన్ సి, కెరటోనాయిడ్స్, ఫోలేట్, ఫైటో కెమికల్స్ బ్రకోలీ ద్వారా లభిస్తాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ను ఇవి తొలగిస్తాయి.

బీట్రూట్ లో ఉండే నైట్రేట్ సమ్మేళనాలు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

ఆపిల్‌లో విటమిన్ సి, ఇ, బీటా కెరాటిన్ లభిస్తాయి.

వాల్ నట్స్ లోనూ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇది ఆస్తమాను తగ్గిస్తాయి.

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇది బ్యాక్టిరయాతో పోరాడే శక్తిని ఇస్తుంది.