అన్వేషించండి

మంగళవారం ఏ పని చేసినా కలసిరాదా? నష్టపోతామా? నిజంగా ఈ రోజు అంత బ్యాడా?

Tuesday beliefs : వారంలో ప్రతి రోజూ ప్రత్యేకమే. ఒక్కో రోజుపై ఒక్కో గ్రహం ప్రభావం ఉంటుంది. మరి మంగళవారంపై ఏ గ్రహం ప్రభావం? ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మంగళవారం కుజ ప్రభావంతో కొన్ని పనులు చేయకూడదంటారు.
  • ఆంజనేయుడి, సుబ్రహ్మణ్య స్వామి పూజ మంగళవారం శ్రేయస్కరమంటారు.
  • మంగళవారం అశుభమని శాస్త్రపరంగా ఆధారాలు లేవు, కేవలం నమ్మకం.

Spirituality: మంగళవారం కుజుడికి సంకేతం. కుజుడు భూమి పుత్రుడు. అందుకే భూమిపై నివసించే వారిపై కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరత్రీ పుత్రుడు, భూమిపై నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ప్రమాదాలకు, తగాదాలకు, నష్టాలకు కారకుడు. అందుకే సాధారణంగా కుజుగ్రహ ప్రభావం ఉండే మంగళవారం కొత్తగా ఏ శుభకార్యాలు తలపెట్టరు. 

మంగళవారం ఈ పనులు చేయకూడదు
 
గోళ్లు కట్ చేసుకోవడం, క్షవరం చేయించుకోవడం చేయకూడదు

మంగళవారం తలకు స్నానం చేయకూడదు

మంగళవారం కొత్త దుస్తులు ధరించరు.. పుట్టినరోజు, పెళ్లిరోజు, పండుగలు ఏమైనా వస్తే పర్వాలేదు
 
అత్యవసరం అయితే కానీ మంగళవారం ప్రయాణం చేయాలనుకోరు
 
ఈ రోజు ఉపవాసం ఉండేవారు ఉప్పు వేసిన పదార్థాలు తినకూడదు

మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగిరావడం చాలా కష్టం అని చాలామంది నమ్మకం
 
అప్పు తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేకపోగా..అనవసరంగా ఖర్చు అయిపోయి, ఆ అప్పు తీరకపోయే ప్రమాదం ఉందట

అయోధ్య ఆలయంలో 40 రోజుల్లో 70 సార్లు చోరీ - ప్రాచీన భారతంలో ఆలయ చోరులకు ఎలాంటి శిక్షలు విధించేవారు?

మంగళవారం చేయాల్సిన పనులు 

మంగళవారం భగవంతుడికి సంబంధించి ఏదైనా చేయొచ్చు, విద్య - వైద్యానికి సంబంధించిన సహాయం చేయొచ్చు

ఈ రోజు ఆంజనేయుడి ధ్యానం వల్ల ధైర్యం చేకూరి అన్ని పనులు పూర్తవుతాయి,సింధూరంతో పూజిస్తే మంచి జరుగుతుంది
 
మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల కుజగ్రహ ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలు నివారించవచ్చు,  సుబ్రహ్మణ్యస్వామికి 11  ప్రదక్షిణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది
 
ఈ రోజు కాళికా దేవిని ధ్యానిస్తే శత్రువులపై విజయం సాధిస్తారు
 
మంగళవారం ఎరుపు రంగు దుస్తులు ధరించాలి..ఎర్రటి పూలతో మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం

మంగళవారం అప్పు తీసుకోకూడదు కానీ తీర్చవచ్చు..ఈ రోజు బ్యాంక్ అకౌంట్లో మనీ వేస్తే అది వృద్ధి చెందుతుంది

మధురై మీనాక్షి అమ్మవారు ఆకుపచ్చ రంగులో ఎందుకు దర్శనమిస్తారు?

సైన్స్ పరంగా చూస్తే...

మంగళవారం మంచిది కాదని సైన్స్ పరంగా ఎలాంటి ఆధారాలు లేవు. మంగళవారం జరిగిన మంచి మర్చిపోతాం...ఏదైనా జరిగితే మాత్రం అదొక్కటే గుర్తుపెట్టుకుని..ఈ రోజు మంగళవారం అందుకే ఇలా జరిగిందని నమ్ముతారు. ప్రపంచంలో వివిధ సంస్కృతుల్లో వేర్వేరు రోజులు అశుభం. గ్రీకులు మంగళవారం, 13వ తేదీ...పాశ్చాత్యులు శుక్రవారం, 13వ తేదీ..ఇలా అక్కడి వారి నమ్మకాలు మాత్రమే.. వాస్తవికతతో సంబంధం లేదు. 

మీ ప్రయత్నం , ప్రణాళిక మీ విజయాన్ని నిర్ణయిస్తాయి.. రోజు పేరు కాదు. ధైర్యంగా అడుగువేయండి..ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీ ప్రయత్నానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అంతేకానీ...మంగళవారం కలసిరాదు అనుకోవడం ఓ అపోహ మాత్రమే..ఇందుకు ఆధారాలు లేవు.  

మహిళలు చేతులకు గాజులు ధరించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? భారతీయ సంస్కృతిలో వాటి లోతైన చరిత్ర!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

Frequently Asked Questions

మంగళవారానికి ఏ గ్రహం సంకేతం మరియు దాని ప్రభావం ఎలా ఉంటుంది?

మంగళవారం కుజుడికి సంకేతం. కుజుడు భూమి పుత్రుడు కావున, భూమిపై నివసించే వారిపై అతని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ప్రమాదాలకు, తగాదాలకు కారకుడు.

మంగళవారం ఎలాంటి పనులు చేయకూడదని అంటారు?

మంగళవారం గోళ్లు కట్ చేసుకోవడం, క్షవరం, తలకు స్నానం చేయడం, కొత్త దుస్తులు ధరించడం వంటివి చేయకూడదు. అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా మంచిది కాదని నమ్మకం.

మంగళవారం చేయదగిన శుభకార్యాలు ఏవి?

మంగళవారం భగవంతుడికి సంబంధించిన పనులు, విద్య-వైద్య సహాయం చేయొచ్చు. ఆంజనేయుడిని లేదా సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది. ఈ రోజు అప్పులు తీర్చవచ్చు.

మంగళవారం అశుభదినం అని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?

మంగళవారం అశుభమని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది కేవలం సాంస్కృతిక నమ్మకం మాత్రమే. మీ ప్రయత్నం మరియు ప్రణాళిక విజయాన్ని నిర్ణయిస్తాయి, రోజు పేరు కాదు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
తేనెటీగల వాగిల్ డాన్స్: ప్రకృతి నేర్పే అద్భుత ఆధ్యాత్మిక పాఠం!
తేనెటీగల వాగిల్ డాన్స్: ప్రకృతి నేర్పే అద్భుత ఆధ్యాత్మిక పాఠం!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget