అన్వేషించండి

Karthika Purnima Pooja: కార్తీక పౌర్ణమి శుభముహూర్తం, పూజా సామగ్రి, పూజావిధానం!

Karthika Pournami 2025: కార్తీకమాసంలో అత్యంత విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లోనే పూజ చేసుకోవాలి అనుకుంటే సులభమైన విధానం ఇదిగో

Karthika Pournami: 2025 లో కార్తీక పౌర్ణమి నవంబర్ 05 బుధవారం వచ్చింది. ఈ రోజు శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి, తులసీదేవిని, కార్తికేయుడిని పూజిస్తారు. ఈ రోజున త్రిపురారి పూర్ణిమ, దేవ దీపావళి లేదా కార్తీక దీపోత్సవంగా జరుపుకుంటారు. ఈ పూజ ద్వారా ఐశ్వర్యం, ఆరోగ్యం, పాప విమోచనం లభిస్తాయని భక్తుల విశ్వాసం.

వేకువజామునే స్నానమాచరించండి
ఇంటిని శుభ్రంచేసి దేవుడి మందిరంలో, తులసి కోట ముందు ముగ్గువేసి దీపాలు వెలిగించండి
దేవాలయంలో లేదంటే ఇంట్లో తులసి కోట దగ్గర 365 వత్తులు వెలిగించవచ్చు..రెండు ప్రదేశాల్లోనూ వెలిగిస్తే ఇంకా మంచిది

కార్తీక పౌర్ణమి పూజా సామగ్రి

నూనె, వత్తులు, దీపారాధన కోసం ప్రమిదలు, తులసి ఆకులు, పూలు , నైవేద్యం, పంచామృతాలు, శివలింగం లేదంటే విష్ణువు ఫొటో, తులసి మాల, పసుపు, కుంకుమ, అగరుబత్తి, కర్పూరం  

పూజ చేసేందుకు కూర్చున్నాక మొదటగా ఇది చెప్పండి
 
మమ కార్తీక పౌర్ణమ్యాం శ్రీ శివ విష్ణు లక్ష్మీ తులసీ ప్రీత్యర్థం దీపదాన పూజా కర్మాహం కరిష్యే।

  ఓం గం గణపతయే నమః

ముందుగా వినాయకుడికి షోడసోపచార పూజచేయాలి.. 

గణపతి పూజ పూర్తైన తర్వాత గౌరీదేవి, తులసి, విష్ణువుకి కి షోడసోపచార పూజ చేయాలి. గౌరీ అష్టోత్తరం, చంద్రుడి అష్టోత్తరం చదువుకోవాలి. మంగళహారతి ఇచ్చాక ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయాలి. దేవుడి దగ్గర, తులసికోట దగ్గర, ఇంటి ముందు దీపాలు వెలిగించండి.. బురుజు మీద దీపం పెట్టి ఆకాశంలోకి చూపించండి.
 
తులసీ దేవి నమోస్తుతే నమః పాపవిమోచని |
యా దృష్టా పూజితా ధ్యాతా ముక్తిదా హరివల్లభే ||

బిల్వ పత్రాలతో శివుడిని పూజించండి
తులసి దళాలతో విష్ణువును పూజించండి
పసుపు, కుంకుమతో గౌరీదేవిని పూజించండి
చందనం, గంధంతో చంద్రుడి పూజ చేయండి

శివ మంత్రం: ఓం నమః శివాయ

విష్ణు మంత్రం: ఓం నమో నారాయణాయ

లక్ష్మీ మంత్రం: ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః

చంద్రుడి మంత్రం: ఓం చంద్ర దేవాయ నమః 

కార్తీక పౌర్ణమి ఉపవాసం ఆచరించేవారు పూజ పూర్తైన తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదం, పండ్లు తీసుకోవచ్చు. ఇతర ఆహార పదార్థాలు తీసుకోకూడదు. పౌర్ణమి తర్వాత రోజు వచ్చే కార్తీక బహుళ పాడ్యమి రోజు కార్తీకదామోదరుడికి పూజ చేసి నివేదించి.. అప్పుడు ఉపవాసం విరమించాలి. 

 శ్రీ గౌరీ అష్టోత్తర శతనామావళి 

ఓం గౌర్యై నమః  ఓం గణేశజనన్యై నమః  ఓం గుహాంబికాయై నమః ఓం జగన్నేత్రే నమః  ఓం గిరితనూభవాయై నమః ఓం వీరభధ్రప్రసవే నమః  ఓం విశ్వవ్యాపిణ్యై నమః  ఓం విశ్వరూపిణ్యై నమః ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః ఓం అష్టదారిద్ర్యశమన్యై నమః  ఓం శివాయై నమః ఓం శాంభవ్యై నమః  ఓం శాంకర్యై నమః ఓం బాలాయై నమః  ఓం భవాన్యై నమః  ఓం హెమవత్యై నమః ఓం పార్వత్యై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం మాంగల్యధాయిన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం మంజుభాషిణ్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహామాయాయై నమః  ఓం మంత్రారాధ్యాయై నమః ఓం మహాబలాయై నమః  ఓం సత్యై నమః  ఓం సర్వమయై నమః ఓం సౌభాగ్యదాయై నమః  ఓం కామకలనాయై నమః ఓం కాంక్షితార్ధప్రదాయై నమః  ఓం చంద్రార్కయుత తాటంకాయై నమః ఓం చిదంబరశరీరిణ్యై నమః ఓం శ్రీ చక్రవాసిన్యై నమః  ఓం దేవ్యై నమః ఓం కామేశ్వరపత్న్యై నమః ఓం పాపనాశిన్యై నమః ఓం నరాయణాంశజాయై నమః ఓం నిత్యాయై నమః ఓం నిర్మలాయై నమః  ఓం అంబికాయై నమః  ఓం హిమాద్రిజాయై నమః  ఓం వేదాంతలక్షణాయై నమః ఓం కర్మబ్రహ్మామయై నమః  ఓం గంగాధరకుటుంబిన్యై నమః ఓం మృడాయై నమః ఓం మునిసంసేవ్యాయై నమః ఓం మాలిన్యై నమః  ఓం మేనకాత్మజాయై నమః ఓం కుమార్యై నమః ఓం కన్యకాయై నమః  ఓం దుర్గాయై నమః ఓం కలిదోషవిఘ్నాతిన్యై నమః  ఓం కమలాయై నమః ఓం మురారిప్రియార్ధాంగ్యై నమః ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః  ఓం పుణ్యాయై నమః  ఓం కృపాపూర్ణాయై నమః ఓం కల్యాణ్యై నమః  ఓం కమలాయై  నమః ఓం అచింత్యాయై నమః ఓం త్రిపురాయై నమః ఓం త్రిగుణాంబికాయై నమః  ఓం పురుషార్ధప్రదాయై నమః ఓం సత్యధర్మరతాయై నమః ఓం సర్వరక్షిణ్యై నమః ఓం శశాంకరూపిణ్యై నమః  ఓం సరస్వత్యై నమః ఓం విరజాయై నమః  ఓం స్వాహాయ్యై నమః  ఓం స్వధాయై నమః  ఓం ప్రత్యంగిరాంబికాయైనమః  ఓం ఆర్యాయై నమః ఓం దాక్షాయిణ్యై నమః ఓం దీక్షాయై నమః ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః ఓం శివాభినామధేయాయై నమః ఓం శ్రీవిద్యాయై నమః ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః ఓం హ్రీంకార్త్యె నమః ఓం నాదరూపాయై నమః ఓం సుందర్యై నమః  ఓం షోడాశాక్షరదీపికాయై నమః ఓం మహాగౌర్యై నమః  ఓం శ్యామలాయై నమః ఓం చండ్యై నమః  ఓం భగమాళిన్యై నమః ఓం భగళాయై నమః ఓం మాతృకాయై నమః  ఓం శూలిన్యై నమః ఓం అమలాయై నమః  ఓం అన్నపూర్ణాయై నమః ఓం అఖిలాగమసంస్తుతాయై నమః ఓం అంబాయై నమః  ఓం భానుకోటిసముద్యతాయై నమః ఓం వరాయై నమః  ఓం శీతాంశుకృతశేఖరాయై నమః ఓం సర్వకాలసుమంగళ్యై నమః  ఓం సోమశేఖర్యై నమః ఓం సుఖసచ్చిత్పుధారసాయై నమః ఓం బాలారాధిత భూతిదాయై నమః  ఓం హిరణ్యాయై నమః ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః  ఓం సర్వభోగప్రదాయై నమః  ఓం మార్కండేయవర ప్రదాయై నమః  ఓం అమరసంసేవ్యాయై నమః ఓం అమరైశ్వర్యై నమః ఓం సూక్ష్మాయై నమః  ఓం భద్రదాయిన్యై నమః  

 చంద్ర అష్టోత్తర శతనామావళి 

ఓం శ్రీమతే నమః ఓం శశధరాయ నమః ఓం చంద్రాయ నమః ఓంతారాధీశాయ నమః ఓంనిశాకరాయ నమః ఓం సుధానిధయే నమః ఓంసదారాధ్యాయ నమఃఓం సత్పతయే నమః ఓం సాధుపూజితాయ నమః  ఓంజితేంద్రియాయ నమః ఓం జగద్యోనయే నమః ఓం జ్యోతిశ్చక్రప్రవర్తకాయ నమః ఓం వికర్తనానుజాయ నమః ఓం వీరాయ నమః ఓం విశ్వేశాయ నమః ఓం విదుషాం పతయే నమః ఓం దోషాకరాయ నమః ఓం దుష్టదూరాయ నమః  ఓం పుష్టిమతే నమః ఓం శిష్టపాలకాయ నమః ఓం అష్టమూర్తిప్రియాయ నమః ఓం అనంతకష్టదారుకుఠారకాయ నమఃఓం స్వప్రకాశాయ నమః ఓం ప్రకాశాత్మనే నమఃఓం ద్యుచరాయ నమః ఓం దేవభోజనాయ నమః ఓం కళాధరాయ నమః  ఓం కాలహేతవే నమః ఓం కామకృతే నమః ఓం కామదాయకాయ నమః ఓం మృత్యుసంహారకాయ నమః ఓం అమర్త్యాయ నమః ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః  ఓం క్షపాకరాయ నమః ఓం క్షీణపాపాయ నమః ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః ఓం జైవాతృకాయ నమః ఓం శుచయే నమః ఓం శుభ్రాయ నమః ఓం జయినే నమః ఓం జయఫలప్రదాయ నమః ఓం సుధామయాయ నమః ఓం సురస్వామినే నమః ఓం భక్తానామిష్టదాయకాయ నమః ఓం భుక్తిదాయ నమః ఓం ముక్తిదాయ నమఃఓం భద్రాయ నమః ఓం భక్తదారిద్ర్యభంజకాయ నమః ఓం సామగానప్రియాయ నమః ఓం సర్వరక్షకాయ నమః ఓం సాగరోద్భవాయ నమః ఓం భయాంతకృతే నమః ఓం భక్తిగమ్యాయ నమః ఓం భవబంధవిమోచకాయ నమః ఓం జగత్ప్రకాశకిరణాయ నమః ఓం జగదానందకారణాయ నమః ఓం నిస్సపత్నాయ నమః ఓం నిరాహారాయ నమః ఓం నిర్వికారాయ నమః ఓం నిరామయాయ నమః ఓం భూచ్ఛాయాఽఽచ్ఛాదితాయ నమః ఓం భవ్యాయ నమః ఓం భువనప్రతిపాలకాయ నమః ఓం సకలార్తిహరాయ నమః ఓం సౌమ్యజనకాయ నమః ఓం సాధువందితాయ నమః ఓం సర్వాగమజ్ఞాయ నమః  ఓం సర్వజ్ఞాయ నమః ఓం సనకాదిమునిస్తుతాయ నమః ఓం సితచ్ఛత్రధ్వజోపేతాయ నమః ఓం సితాంగాయ నమః ఓం సితభూషణాయ నమః  ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః ఓం శ్వేతగంధానులేపనాయ నమః ఓం దశాశ్వరథసంరూఢాయ నమః ఓం దండపాణయే నమః ఓం ధనుర్ధరాయ నమః ఓం కుందపుష్పోజ్జ్వలాకారాయ నమః ఓం నయనాబ్జసముద్భవాయ నమః ఓం ఆత్రేయగోత్రజాయ నమః ఓం అత్యంతవినయాయ నమః ఓం ప్రియదాయకాయ నమః ఓం కరుణారససంపూర్ణాయ నమః ఓం కర్కటప్రభవే నమః ఓం అవ్యయాయ నమః ఓం చతురశ్రాసనారూఢాయ నమః ఓం చతురాయ నమః ఓందివ్యవాహనాయ నమః ఓం వివస్వన్మండలాగ్నేయవాససే నమః ఓం వసుసమృద్ధిదాయ నమః ఓం మహేశ్వరప్రియాయ నమః ఓం దాంతాయ నమః ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః ఓం గ్రసితార్కాయ నమః ఓం గ్రహాధిపాయ నమఃఓం ద్విజరాజాయ నమః ఓం ద్యుతిలకాయ నమః ఓం ద్విభుజాయ నమః ఓం ద్విజపూజితాయ నమః ఓం ఔదుంబరనగావాసాయ నమః ఓం ఉదారాయ నమః ఓం రోహిణీపతయే నమః ఓం నిత్యోదయాయ నమః ఓం మునిస్తుత్యాయ నమః ఓంనిత్యానందఫలప్రదాయ నమః ఓం సకలాహ్లాదనకరాయ నమః  ఓం పలాశసమిధప్రియాయ నమః

వీటితో పాటూ...విష్ణు, తులసి అష్టోత్తర శతనామావళి, త్రిపురాసుర సంహార కథ కూడా చదువుకోవాలి...

గమనిక:  పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 5: 200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
Advertisement

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 5: 200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
Indian Navy:ప్రపంచంలోనే నాల్గో శక్తివంతమైదిగా భారత్‌నేవీ! బ్రిటన్, ఫ్రాన్స్ వెనక్కి! టాప్‌లో అమెరికా, చైనా
ప్రపంచంలోనే నాల్గో శక్తివంతమైదిగా భారత్‌నేవీ! బ్రిటన్, ఫ్రాన్స్ వెనక్కి! టాప్‌లో అమెరికా, చైనా
Bluetooth Earphones Cancer Risk: బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌తో క్యాన్సర్ వస్తుందా? రిస్క్ ఎంతో తెలుసుకోండి?
బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌తో క్యాన్సర్ వస్తుందా? రిస్క్ ఎంతో తెలుసుకోండి?
Govinda Wife Sunita Ahuja: అమ్మాయితో ఎఫైర్... హీరో అక్రమ సంబంధంపై భార్య సంచలన వ్యాఖ్యలు
అమ్మాయితో ఎఫైర్... హీరో అక్రమ సంబంధంపై భార్య సంచలన వ్యాఖ్యలు
Phone Expiry Date: ఫోన్‌కి కూడా ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుంది! తెలుసుకోవడం ఎలా? వాడితో జరిగే నష్టమేంటీ?
ఫోన్‌కి కూడా ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుంది! తెలుసుకోవడం ఎలా? వాడితో జరిగే నష్టమేంటీ?
Embed widget