అన్వేషించండి

International Women's Day 2024: అవమానించి ఆనందించారు కానీ ఆ తర్వాత ఆమె ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఊహించలేకపోయారు!

International Women's Day 2024 : మహాభారతాన్ని పంచమ వేదంగా చెబుతారు. ఇందులో పాండవులకు ఎంత ప్రాధాన్యత ఉందో, ద్రౌపదికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మహాభారత యుద్ధానికి ఓ రకంగా మూలకారణం ఆమె చేసిన శపథమే.

International Women's Day 2024 : మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం

ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం , దూసుకెళుతున్న మహిళలు, అబల కాదు సబల, మహిళలు అత్యంత శక్తివంతులు అని ఈ దినోత్సవాల సందర్భంగా చెబుతుంటారు. అయితే మహిళలు పవర్ ఫుల్ అని ఇప్పుడు చెప్పడం ఏంటి...ఎప్పుడూ పవర్ ఫుల్లే. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం...ఇప్పుడు నడుస్తున్న కలియుగం... ఏ యుగంలో తీసుకున్నా మహిళల ప్రాధాన్యత తగ్గలేదు అని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే పురాణాల్లో పవర్ ఫుల్ మహిళ గురించి చెప్పుకోవాలంటే ముందుగా ద్రౌపది గురించి మాట్లాడుకోవాలి. ఐదుగురిని పెళ్లిచేసుకున్న ఆమె ఏం చేసింది అనే సందేహం వస్తుందేమో...మరి మహాభారత యుద్ధానికి కారణం ఆమె అని ఎందుకంటారు?  

Also Read: మహా శివరాత్రి పూజ , అభిషేకం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఉపవాస నియమాలు - మరెన్నో వివరాలు సమగ్రంగా

ద్రౌపదిని మించిన వ్యూహకర్త ఎవరు!
ద్రుపదుడి యఙ్ఞవాటికలో అగ్ని నుంచి జన్మించిన శక్తి స్వరూపిణి ద్రౌపది. అందమైన, బలమైన స్త్రీ మాత్రమే కాదు మంచి వ్యూహకర్త కూడా. పాండవులతో మెట్టినింట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ అడుగడుకునా అవమానాలు ఎదుర్కొంది. 

  • కురుసభలో దుశ్శాసనుడు
  • అరణ్యవాసంలో ఉన్నప్పుడు సైంధవుడు
  • అజ్ఞాతవాసంలో విరాటుని కొలువులో దాసిగా పనిచేస్తున్న సమయంలో కీచకుడు

ఇలా ఎంత మందితో అవమానాలు, వేధింపులు ఎదుర్కొని ఒక్కొక్కరికీ బుద్ధి చెప్పింది. 

Also Read: మీ జీవితంలో ఉన్న స్త్రీ గురించి ఏం తెలుసు మీకు - ఇలా తెలుసుకోండి!
 
పాండవుల్లో ప్రతీకార జ్వాల రగిలించిన ద్రౌపది
జూదంలో పాండవులు ఓడిపోవడంతో..ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణం చేసి అవమానిస్తారు. తనను నిండు సభలో అవమానించిన సంఘటనను పదేపదే గుర్తుచేసుకుంటూ పాండవులను కార్యోన్ముఖులను చేసి మహాభారత యుద్ధానికి పరోక్షంగా కారణమైంది ద్రౌపది. తనకు జరిగిన అవమానాన్ని గుర్తుంచుకోవడమే కాదు, పాండవుల్లో ప్రతీకార జ్వాలను రగిలించింది. ఓ దశలో సంధి చేసుకునేందుకు ధర్మరాజు ప్రయత్నించినా కూడా తనకు సంధి వద్దని స్పష్టంగా చెప్పేసింది. ద్రౌపది ఎంత పవర్ ఫుల్ అంటే...ఆమె మాట్లాడితే ఎదురు చెప్పడానికి  ఐదుగురు భర్తలు సాహసించేవారు కాదు. ఆమె అంటే భయం అని కాదు...తన ఆలోచన, అభిప్రాయం తిరిగి మాట్లాడలేనంత స్పష్టంగా ఉంటాయని అర్థం.

Also Read: మహా శివరాత్రి రోజు మీ రాశిప్రకారం పఠించాల్సిన మంత్రం ఇదే!

శపథం నెరవేర్చుకునే వరకూ జుట్టు ముడివేయలేదు
మాయాజూదంలో ధర్మరాజు తాను ఓడిపోవడమే కాదు సోదరులు, రాజ్యాన్ని, ద్రౌపదిని కూడా పోగొట్టుకుంటాడు. ఈ ఓటమి తర్వాత ద్రౌపది తమ బానిస కాబట్టి ఆమెను సభలోకి తీసుకురమ్మని దుర్యోధనుడు ఆఙ్ఞాపిస్తాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ద్రౌపదని నిండు సభలోకి ఈడ్చుకొస్తాడు. ప్రస్తుతం మాకు బానిసవు, ఎవరికీ దీనిపై ఫిర్యాదు చేసే హక్కు నీకు లేదంటూ ఆమె మేలి ముసుగు తొలగించి దుశ్శాసనుడు అవమానిస్తాడు. ఇంతటితో ఆగకుండా దుర్యోధనుడు తన తొడపై కూర్చోమంటాడు. రక్షించమని పాండవుల వంక దీనంగా చూసి అర్థించినా వారు నిస్సహాయులై ఏమీ చేయలేక చూస్తుండిపోతారు. సభలో ఉన్న పెద్దలు కూడా ఏమీ మాట్లాడలేక ఆగిపోతారు. ఆ సమయంలో కృష్ణుడు రక్షిస్తాడు. ఈ పరాభవానికి గుర్తుగా..తనను వెలయాలిలా ఈడ్చుకొచ్చిన దుశ్శాననుడి రక్తం కళ్లజూసిన వరకూ తన కురులను ముడివేయనని  కురు సభలోనే శపథం చేసింది. అందుకే 13 ఏళ్ల పాటు జుట్టు విరబోసుకునే ఉంది ద్రౌపది. ఎవరైతే తనను నిండు సభలో అవమానించారో వారి రక్తంతోనే తన శిరోజాలను తడిపినంతవరకు వాటిని ముడివేయనంది. దుశ్శాసనుడి రక్తం తాగి, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి తెస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు భీముడు. అందుకే కురుక్షేత్ర సంగ్రామం వరకూ ఆమె ఎదురుచూసింది. మహాభారత యుద్ధంలో భీముడు తన మాటని నెరవేర్చుకున్నాడు. దుశ్శాసనుడిని చంపి రక్తం తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చాడు. దుశ్శాసనుడి రక్తాన్ని తన జట్టుకు రాసిన తర్వాతే ఆమె వాటిని ముడివేసింది. అందుకే ద్రౌపది శపథం కూడా మహాభారత సంగ్రామానికి ఓ కారణం అని చెబుతారు.. 

 స్త్రీ శపథం చేసి ప్రతీకారం తీర్చుకోవాలంటే ఇలా ఉంటుందని చెప్పేందుకు పురాణాల్లో ఇంతకు మించి చెప్పుకోదగిన పాత్ర ఏముంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget