Tamil OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ నేటివిటీ డ్రామా... రజనీ, విక్రమ్ సినిమాల్లో అమ్మాయే మెయిన్ హీరోయిన్
Deepavali Bonus OTT Streaming: విక్రాంత్, రిత్విక జంటగా నటించిన తమిళ డ్రామా 'దీపావళి బోసన్'. ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీన్ని ఏ ఓటీటీలో చూడాలి? ఏ భాషలో ఉంది? అంటే...
Deepavali Bonus OTT Release Date: ఓటీటీలో ఇవాళ కొత్త సినిమా 'దీపావళి బోనస్' వచ్చింది. అదీ తమిళ సినిమా. అయితే... ఆడియన్స్ చూపు దీని మీద పడటానికి కారణం ఈ మూవీలో హీరోయిన్. ఆ అమ్మాయి ఇంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్, చియాన్ విక్రమ్ సినిమాల్లో నటించింది. ఆ అమ్మాయి ఎవరు? ఆమె సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అంటే...
ఆహా ఓటీటీలో 'దీపావళి బోనస్' స్ట్రీమింగ్
Deepavali Bonus OTT Platform: తెలుగు ఓటీటీ వేదికగా మొదలైన ఆహా వీడియో (Aha Video), ఆ తర్వాత తమిళంలోనూ అడుగు పెట్టింది. కొత్త కొత్త తమిళ ఫిల్మ్స్ కూడా స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టింది. అందులో ఈ రోజు (నవంబర్ 26 - మంగళవారం) నుంచి 'దీపావళి బోనస్' స్ట్రీమింగ్ అవుతోంది.
'దీపావళి బోనస్' సినిమాలో విక్రాంత్ హీరో. రిత్వికా పన్నీర్ సెల్వం హీరోయిన్. ఆ అమ్మాయి దీని అంటే ముందు రజనీకాంత్ 'కబాలి', విక్రమ్ 'ఇరు ముగన్', కార్తీ 'మద్రాస్' సినిమాల్లో నటించింది. విక్రమ్ సినిమాలో కిడ్నాప్ అయ్యేది ఈ అమ్మాయే. ఇప్పుడీ 'దీపావళి బోనస్' సినిమాలో ఓ చిన్నారిగా అమ్మగా నటించింది.
Also Read: టీలో బిస్కెట్లు ముంచడం మంచిదేనా? బాడీలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఏం చేయాలి?
View this post on Instagram
'దీపావళి బోనస్' కథ ఏమిటి? అందులో ఏముంది?
తమిళనాడులోని మదురై నేపథ్యంలో 'దీపావళి బోనస్' తెరకెక్కించారు. ఈ సినిమాలో విక్రాంత్, రిత్విక భార్యాభర్తలుగా నటించారు. వాళ్లకు ఓ అబ్బాయి. వీళ్లది పేద కుటుంబం. ఒకటి ఇంట్లో రిత్విక పని మనిషిగా చేస్తుంది. వంట పని, ఇంటి పని చేయడమే కాదు... బాత్ రూమ్ కూడా కడుగుతుంది. విక్రాంత్ కూడా హార్డ్ వర్క్ చేస్తాడు. ప్రభుత్వ పాఠశాలలో వాళ్లబ్బాయి చదువుతాడు. దీపావళి పండగ వస్తుంది. అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకునేట్టు... తమ ఫ్యామిలీ కూడా చేసుకోవాలని కోరుకుంటారు. అందుకు తగ్గ డబ్బులు వచ్చాయా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
థియేటర్లలో విడుదలైన నెలకు ఓటీటీలోకి వచ్చేసింది!
అక్టోబర్ 25న తమిళనాడు థియేటర్లలో 'దీపావళి బోనస్' విడుదల అయ్యింది. ఓ మోస్తరుగా ఆడింది. క్రిటిక్స్ కొందరు సోసోగా ఉందని పేర్కొనగా... డ్రామా, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు. 'దీపావళి బోనస్' విడుదలైన తర్వాత వారం 'అమరన్' రావడం, బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాను చూసే జనాలు లేకుండా పోయారు. కట్ చేస్తే... సరిగ్గా నెల రోజులకు ఆహా వీడియోలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీలో చెప్పుకోదగ్గ రెస్పాన్స్ అందుకోవడం గ్యారంటీగా కనబడుతోంది.