అర్థనారీశ్వర తత్వం: సృష్టిలో ప్రతీది రెండు - ఏ రెండూ ఒకేసారి ఉండవు ఒకటి లేకుండా మరొకటి ఉండవు!

పదార్థం-చైతన్యం కలయికే సృష్టి. రెండింటినీ తీసుకుని దేవతా స్వరూపాలను కల్పన చేసుకుని ఆరాధిస్తాం.

ఫొటోల్లో రెండు దేహాలు కలిపినట్టు కనిపిస్తుంది కానీ అర్థనారీశ్వర తత్వం అంటే స్త్రీ-పరుషులు ఒక్కటే అని అర్థం.

సృష్టిలో ప్రతీది రెండు
పగలు-రాత్రి, చీకటి-వెలుగు ,సుఖం-దుంఖం, విచారం-సంతోషం

వీటిలో ఏ రెండూ ఒకేసారి ఉండవు. ఒకటి లేకుండా మరొకటి ఉండవు. రెండింటి సమ్మేళనమే ఒకటిగా మారుతుంది.

పగలు రాత్రి కలిస్తే రోజు, సుఖం-దుంఖం కలిస్తే జీవితం, బొమ్మ-బొరుసు ఉంటే ఓ నాణెం

స్త్రీ-పురుషుడు కలిస్తే సృష్టి అని చెబుతుంది అర్థనారీశ్వరతత్వం

తల ఆలోచనకి , పాదం ఆచరణకు సంకేతాలైతే , పార్వతీపరమేశ్వరులు ప్రతి చర్య-ఆలోచనలోనూ సమానంగా ఉంటారని అర్థం.

ఆచరణలోనూ ,ఆలోచనలోనూ, కర్మలలోను , కార్యాలలోను , నిర్ణయాలలోనూ , నిర్మాణాలలోనూ.....

ఒకటిగా ఉండాలని సూచించే హిందూ ధర్మమే అర్థనారీశ్వర తత్వం. Image Credit: Pixabay

Thanks for Reading. UP NEXT

శివుడి ఆహార్యంలో ఆంతర్యం ఇదే!

View next story