International Women's Day 2024: మీ జీవితంలో ఉన్న స్త్రీ గురించి ఏం తెలుసు మీకు - ఇలా తెలుసుకోండి!
ఆడవారంతా ఒక్కటే అనేస్తారు కానీ ఈ మాట అన్నవారికి తెలియదేమో ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. వాళ్లలో ఉండే ప్రత్యేకత తెలుసుకున్నప్పుడే కదా వాళ్లు మీకు అర్థమయ్యేది
![International Women's Day 2024: మీ జీవితంలో ఉన్న స్త్రీ గురించి ఏం తెలుసు మీకు - ఇలా తెలుసుకోండి! International Women's Day 2024 Know Personality Traits Women in your life as Per Their Zodiac Sign International Women's Day 2024: మీ జీవితంలో ఉన్న స్త్రీ గురించి ఏం తెలుసు మీకు - ఇలా తెలుసుకోండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/6a3eb2e896c21a2803f5dda49549da431709791069286217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
International Women's Day 2024: బంధం, ప్రేమ, స్నేహం..ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో స్త్రీమూర్తి ఉంటుంది. కానీ వారిని మీరు ఎంతవరకూ అర్థం చేసుకున్నారు? అయితే ఇప్పటికైనా తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఇంతకీ వారి రాశి ఏంటో తెలుసా...తెలిస్తే వాళ్ల స్వభావం ఇలా ఉంటుంది.
మేష రాశి
మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులు. ఎదుటివారి మనసులో స్థానం సంపాదించేందుకు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు. మెరుగైన జీవనశైలి నడిపేందుకు ఇష్టపడతారు. స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు. అదే సమయంలో కుటుంబం, స్నేహితుల విషయంలో విశ్వసనీయంగా ఉంటారు. ఈ రాశి స్త్రీలతో సహజంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువ. హఠాత్తుగా కోపాన్ని వ్యక్తం చేస్తారు..అంతలోనే క్షమించేస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి స్త్రీల జీవితం కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. కుటుంబమే వారి ప్రాధాన్యత. ఎలాంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలా చూసుకుంటారు. కష్టపడి పనిచేస్తారు. ఈ రాశి స్త్రీలు తమ సొంత నిబంధనలతో జీవితాన్ని గడుపుతారు. మొండితనం ప్రదర్శించినప్పటికీ అందులో ప్రేమ, ఆప్యాయత నిండి ఉంటుంది.
Also Read: మహాశివరాత్రి జాగరణ అంటే మేల్కొని ఉండడం అనుకుంటున్నారా!
మిథున రాశి
మిథునరాశి స్త్రీలు మనసు చదవగలిగే తెలివైనవారు. బహుముఖ ప్రజ్ఞ వీరిసొంతం. ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కోనేందుకు, సాహసాలు చేయడానికి, కొత్త విషయాలను కనుగొనడానికి అస్సలు వెనుకడుగు వేయరు. జీవితం పట్ల వారి ఆసక్తి వారిని ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ రాశి స్త్రీలు చాలా ఎమోషనల్ గా ఉంటారు...తమప్రియమైనవారి పట్ల భావోద్వేగంతో ఉంటారు. నిర్ణయం తీసుకోవడంలో కొంత అస్థిరంగా ఉంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి స్త్రీలకు ..తమ ప్రియమైన వారిని చూసుకోవడం కన్నా ముఖ్యమైనది ఏమీ ఉండదు. ఈ రాశి స్త్రీలలో సున్నితత్వం, భావోద్వేగాలు ఎక్కువే అయినప్పటికీ ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా చాలా చాకచక్యంగా ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వారి ప్రశాంతమైన ప్రవర్తన దయగల స్వభావం ఇతరులను వారి వైపు ఆకర్షిస్తాయి. ఇతరుల అవసరాలను తమ సొంత అవసరాల కన్నా ఎక్కువగా భావిస్తారు. ఉన్నట్టుండి మూడీగా అయిపోతారు.
Also Read: మహా శివరాత్రి రోజు మీ రాశిప్రకారం పఠించాల్సిన మంత్రం ఇదే!
సింహ రాశి
సింహ రాశి స్త్రీలు చాలా శక్తివంతులు. ప్రేమించే వ్యక్తికి వీరిచ్చే ప్రయార్టీనే వేరు. ఈ రాశి స్త్రీలలో ఉండే స్వతంత్ర స్వభావం ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా నిలబెడుతుంది. వీరు సవాళ్లను సంతోషంగా స్వీకరిస్తారు. జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.
కన్యా రాశి
కన్యారాశి స్త్రీలు చాలా నిజాయితీపరులు. అది వారి సహజసిద్ధమైన సామర్ధ్యం కూడా. వారి సరళత , విశాల దృక్పథం జీవితంలో అత్యంత సమస్యాత్మకమైన పరిస్థితిని కూడా సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ రాశి స్త్రీలు తాముచేసే పనిని న్యాయంగా చేయాలి అనుకుంటారు. ఆచరణలో వీరు సిద్ధహస్తులు. కష్టపడి పనిచేస్తారు. అన్ని విషయాల్లో పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు.
తులా రాశి
తులా రాశి స్త్రీలు వాదనలు, భావోద్వేగ ప్రదర్శనలకు దూరంగా ఉంటారు. జీవితాన్ని పునరుద్ధరించుకునేందుకు వీరి ప్లానింగే వేరుగా ఉంటుంది. తమచుట్టూ ఉన్నవారంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అన్నీ వ్యవహారాలు సరిగ్గా జరగాలని కోరుకుంటారు. బంధాల్లో సమతుల్యతను పాటిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి స్త్రీలకు పనిపట్ల చాలా శ్రద్ధ. ఏ విషయంలో అయినా దృఢ సంకల్పం, దృఢమైన మనస్సు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి స్త్రీలు తాము చూపించే ప్రేమకు పదిరెట్లు తిరిగి రావాలని ఆశిస్తారు. శృంగార సంబంధంలో అత్యంత నిజాయితీపరులు. గెలుపు కోసం తీవ్ర స్థాయికి వెళ్లేందుకు కూడా వెనకాడరు. ఒక్కమాటలో చెప్పాలంటే వృశ్చికరాశి స్త్రీలలో ఉండే ప్రత్యేక వ్యక్తిత్వం..జీవితంలో ఎదురైన సవాళ్లను స్వీకరించి వాటిని అధిగమించేందుకు సహకరిస్తుంది. వీరిని అభిమానించేవారిని రక్షించేందుకు ఎంతవరకైనా పోరాడతారు.
Also Read: 'ఏకబిల్వం శివార్పణం' - మారేడు దళాలు శివ పూజకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
ధనుస్సు రాశి
ధనస్సు రాశి స్త్రీలు ప్రేమ, వ్యక్తిగతం జీవితంలో తొందరగా మునిగిపోతారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు చాలా ఆసక్తి ప్రదర్శిస్తారు. ఈ రాశి స్త్రీలు నిర్భయంగా మాట్లాడతారు. తమకు ఉన్నదాంట్లో సంతృప్తి కలిగి ఉంటారు. సహాసాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. తమ జీవితాన్ని సంతోషంగా మలుచుకోవడంలో సిద్ధహస్తులు. వీరిలో ఆశావాదమే వీరిని ఆనందంగా ఉంచుతుంది.
మకర రాశి
మకర రాశి స్త్రీలు రహస్య స్వభావాన్ని ప్రదర్శిస్తారు..వీరి మనసులో ఏముందో ఇతరులు అస్సలు గ్రహించలేనంతగా వ్యవహరిస్తారు. కష్టపడిపనిచేస్తారు, తమ కలలను నెరవేర్చుకునేందుకు ఎంతదూరమైనా వెళతారు. తమ జీవితంలో ఎదురైన వ్యక్తులు ఎవర్ని ఎక్కడ ఉంచాలో వీరికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు స్వీయ నియంత్రణ చాలా ఎక్కువ. తాము తీసుకున్న నిర్ణయంపై స్ట్రాంగ్ గా నిలబడి ఉంటారు.
కుంభ రాశి
కుంభ రాశి స్త్రీలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టాలు పడతారు. ఇతరులను ఒప్పించడం కన్నా తమ స్వేచ్ఛా ప్రపంచంలో తాము ఉండాలి అనుకుంటారు. ఈ రాశి స్త్రీలు సృజనాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉంటారు. వీరు సమాజానికి భయపడతూ బతకాలని అస్సలు అనుకోరు. అలాగే స్వతంత్ర్య భావాలున్న భాగస్వామిని కోరుకుంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు.
Also Read: అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!
మీన రాశి
మీన రాశి స్త్రీలు చాలా సృజనాత్మకంగా, సున్నితంగా ఉంటారు. ఇతరుల పట్ల దయగల స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ జీవితంలో ఏం చేస్తున్నారో దానివల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో ఫుల్ క్లారిటీతో ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)