Importance of Marriage in Hinduism: వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటరా అంటారా..అసలు పెళ్లెందుకు చేసుకోవాలో తెలుసా!
Hindu Marriage System:పెళ్లికుదిరిందని ఎవరైనా చెప్పగానే జోక్స్ పేలుతుంటాయ్. వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అని ఆటపట్టిస్తారు. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ధర్మశాస్త్రాల్లో ఏముందో తెలుసా?
Importance of Marriage in Hinduism : ఈ మధ్య కాలంలో పెళ్లిపై చాలామందికి ఆసక్తి తగ్గిపోతోంది. పెళ్లెందుకు లేనిపోని తలనొప్పులు, ఫ్రీడం ఉండదు..ఒంటిరిగా ఉండిపోతే బెటర్ అనుకుంటున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి డేటింగ్ బెటర్ కదా అని ఫిక్సవుతున్నారు. ధర్మశాస్త్రాల్లో పెళ్లి గురించి ఏముందో తెలిస్తే ఇలా మాట్లాడరు. ఎందుకంటే పెళ్లంటే ఓ సంబరం, ఉత్సవం కాదు.. ఓ మనిషి జీవితంలో పాటించాల్సిన షోడశ సంస్కారాలలో ప్రధానమైనది వివాహం. సానపెడితే వజ్రం ప్రకాశించినట్టే 16 సంస్కారాలు పూర్తిచేసినప్పుడే ఆత్మ ప్రకాశిస్తుంది. ఆ జీవితం సార్థకం అవుతుంది. ఇవన్నీ తెలుసుకోకుండా పెళ్లంటే జీలకర్రబెల్లం పెట్టడం, తాళి, తలంబ్రాలు పోయడాన్ని ఓ సంబరంలా చేసేసుకుంటున్నారు...ఓ తంతు పూర్తైందని భావిస్తున్నారు. ఫొటోషూట్స్, విందు, వీడియోలపై ఉన్నంత శ్రద్ధ.. ముఖ్యమైన వివాహ సంస్కారానికి ఇవ్వడం లేదు.
Also Read: ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా!
శ్లోకం
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తన|
వ్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||
రామాయణంలో జనక మహారాజు చెప్పిన శ్లోకం ఇది. అర్థం ఏంటంటే..ఓ రామచంద్రా ఈ సీత నా కుమార్తె. నీకు సహధర్మ చారిణిగా ఈమెను అందిస్తున్నాను..ఈమె చేయిపట్టుకుని భార్యగా స్వీకరించు..నీకు అన్నీ శుభాలే జరుగుగాక.. ఈశ్లోకాన్ని పెళ్లిలో చెప్పిస్తారు.. సీతలాంటి నా కుమార్తెను రామచంద్రుడులాంటి నీకు అప్పగిస్తున్నానని అర్థం...
ముఖ్యంగా మూడు రుణాలు తీర్చుకునేందుకు పెళ్లిచేసుకోవాలని చెబుతున్నాయి ధర్మశాస్త్రాలు...
1. ఋషిఋణం
2. దేవఋణం
3. పితౄణం
ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి ఒక్కరి విధి..వీటిని తీర్చకుంటే మరో జన్మ తప్పదు. వీటిని పూర్తిచేస్తేనే మనిషిగా పుట్టినందుకు సార్థకత. అందుకే రుణవిముక్తులు కావాలి అనుకున్నవారు ఈ విధులు ఆచరించాలి..
"బ్రహ్మచర్యేణ ఋషిభ్యః"
" యజ్ఞేన దేవేభ్యః"
"ప్రజయా పితృభ్యః"
Also Read: పెళ్లిలో వధూవరులకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా!
ఋషి ఋణం
బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాల్సి ఉంటుంది. ఋషి ఋణం అంటే బ్రహ్మచర్యంలో వేదాలు అధ్యయనం చేయాలి, దైవారాధనలో ఉండాలి. గురుపూజ చేయాలి. పురాణాలు అధ్యయనం చేసిన తర్వాత వాటిని తమ తర్వాత తరాలకు అందించడం ద్వారా ఋషి ఋణం తీరుతుంది.
దేవ ఋణం
దేవ ఋణం తీర్చుకోవడం అంటే..యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం. యజ్ఞం అంటే త్యాగం, యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెంది సకాలంలో వానలు కురిపిస్తారు. పాడిపంటలు వృద్ధి చెందుతాయి..కరువు కాటకాలు అనే మాటే వినిపించదు. మానవ మనుగడకు కారణం అయిన పంచభూతాలకు ఎంతో రుణపడిఉన్నాం..ఆ రణం తీర్చాల్సిందే...
పితౄణం
మంచి సంతానాన్ని కనడం ద్వారా పితృూణం తీర్చుకోవాలని చెబుతోంది ధర్మశాస్త్రం. వంశాన్ని కొనసాగించడం ద్వారా ఈ రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పితృకార్యాలు సక్రమంగా నిర్వర్తించే కుటుంబంలో యోగ్యులైన సంతానం కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అసలు పితృూణం తీర్చుకోవాలంటే వివాహం చేసుకోవాలి కదా..మరి వివాహమే వద్దంటే ఈ రుణం తీర్చేదెలా?
"ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః"
వంశపరంపరను తెంచేయవద్దని దీని అర్థం. అందుకే పెళ్లంటే సరదా, సంబరం, వ్యంగ్యం కాదు... పెళ్లంటే ఓ యజ్ఞం, దైవకార్యంతో సమానం...
Also Read: తాళి,మెట్టెలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో - ఈ విషయాలు తెలుసా మరి!