అన్వేషించండి

Hindu wedding: తాళి,మెట్టెలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో - ఈ విషయాలు తెలుసా మరి!

పెళ్లైన స్త్రీ అంటే 5 అలంకారాలతో కనిపించేది. ఈ ఐదు అలంకారాలు ఉన్నవారినే ముత్తైదువ అంటారు. కానీ ఇప్పుడు వివాహితులు కూడా మెడలో తాళి, కాళ్లకు మెట్టెలు తీసేస్తున్నారు..ఇంతకీ అవెందుకు వేసుకోవాలో తెలుసా..

Significance of Mangalsutra

మెడలో తాళి ఫ్యాషన్ కి అడ్డం వస్తోందని పక్కన పెట్టేస్తున్నారు
కాళ్లకు మెట్టెలు అవసరమా అని తీసిపడేస్తున్నారు
వాస్తవానికి స్త్రీ అలంకారాలన్నీ అందం కోసం కాదు ఆరోగ్యం కోసం అని మీకు తెలుసా..
అలంకారాల్లో ఈ 5 చాలా ముఖ్యం...ఈ 5 అలంకారాలున్న స్త్రీని ముత్తైదువ అంటారు. 

నుదుట కుంకుమ

అప్పట్లో కుంకుమ రాయితో నూరుకుని మరీ పెట్టుకునేవారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాల్లో మొదటిదైన ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. అందుకే బొట్టుకి అంత ప్రాధాన్యత ఇస్తారు.

Also Read: పెళ్లిలో వధూవరులకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా!

మంగళసూత్రం

మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు బంగారం సూత్రం నుంచి గుండెపై పడే నీటివల్ల చర్మ వ్యాధులు రావు.  క్యాన్సర్ కి బంగారం ట్రీట్మెంట్ గా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది కూడా. 

గాజులు

ముత్తైదువ వేసుకునే గాజులంటే మట్టి లేదా బంగారంతో చేసినవి అయి ఉండాలి. అంతేకానీ ప్లాస్టిక్ గాజుల కాదు. చేతి మణికట్టు దగ్గర  ఉండే నరం నేరుగా గుండె నరాలతో  సంబంధాన్ని కలిగిఉంటుంది. వైద్యులు కూడా ఈ నాడి స్పందనే గమనిస్తారు. ఈ నరం దగ్గర గాజులుండడం వల్ల శరీరంలో రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అందుకే గాజులు వేసుకోవాలని చెబుతారు. పురుషులు సహజంగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు. వారిలో ఉండే కొవ్వు శాతం తక్కువకావడంతో రక్తపోటు సమస్యలు కూడా తక్కువ. కొందరిలో ఇలాంటి సమస్యలుంటే బంగారం లేదా రాగి కడియం ధరించమని అందుకే చెబుతారు.  లోహంతో చేసిన కడియం శరీరంలో వేడిని గ్రహిస్తాయి. 

Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!

కాళ్ళకు మెట్టెలు, పట్టీలు
 
పెళ్లైన స్త్రీ కాళ్లు బోడిగా ఉండకూడదని మెట్టెలు, పట్టీలు తప్పనిసరిగా ఉండాలంటారు. దీనివెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే...కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా అని పిలుస్తారు. ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత  బ్రాంచెస్ గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనుక మడమ వరకు వెళ్లి అక్కడ ఆగుతుంది. అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా  గర్భాశయ, మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టెలు  ఇవన్నీ టిబియా నాడిని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి. గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. పైగా మూత్రాశయ సమస్యలు కూడా రావు.

Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

తలలో పూలు

పూలు ప్రేమకు, అదృష్టానికి, సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నాలు. స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె, ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉందని, వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా రాగుతోందని అర్థం. పూల సువాసనలు మనసుని ప్రశాంతంగా  ఉంచడమే కాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి

ఈ ఐదు అలంకారాలే కాకుండా సైనస్ రాకుండా ముక్కుపుడక, చెవిపోట్లు దరిచేరకుండా చెవిపోగులు ధరిస్తారు. ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే. ఇది చాదస్తం కాదు... అయితే వీటిని ఎంతవరకూ విశ్వశించాలి, గౌరవించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Also Read:  చివరకు మిగిలేది బూడిదే - లయకారుడు చెప్పేది ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
సీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం  - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP DesamUppada Beach Road | ఉప్పాడకే ప్రత్యేకంగా సముద్రం పక్కనే పంట పొలాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Assembly: కేసీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
సీఆర్‌కూ అనర్హతా వేటు భయం - జగన్ ప్లాన్‌లోనే ఒక్క రోజు సభకు హాజరు?
Mana Mitra: వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు  - ఆ బిల్లులు  కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు - ఆ బిల్లులు కూడా కట్టేయవచ్చు - ఎలాగో తెలుసా ?
Telangana Latest News: తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం  - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
తెలంగాణలో బీజేపీ పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం - కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం !
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Telangana Latest News: తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలోని లగచర్ల, హకీంపేటలో భూసేకరణకు బ్రేక్- నోటిఫికేషన్ రద్దు చేసిన హైకోర్టు
Viral News: ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
ఆయ్..మా గోదారోళ్లకు మర్యాదలు బాగా ఎక్కువేనండి - అత్తకి కోటి బహుమతి ఇచ్చిన కోడలు -కట్నం కాదండోయ్ !
Shami controversy:  షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు -  క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
షమీ మంచి నీళ్లు తాగడం నేరం కాదు - క్రికెటర్‌కు బాసటగా ముస్లిం మత పెద్దలు
Viral News: డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితికి వెళ్లాక రేప్ చేస్తాడు - ఈ చైనీయుడు బ్రిటన్ చరిత్రలోనే వరస్ట్ రేపిస్ట్
డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితికి వెళ్లాక రేప్ చేస్తాడు - ఈ చైనీయుడు బ్రిటన్ చరిత్రలోనే వరస్ట్ రేపిస్ట్
Embed widget