By: ABP Desam | Updated at : 26 Feb 2022 01:53 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 ఫిబ్రవరి 26 శనివారం రాశిఫలాలు
2022 ఫిబ్రవరి 26 శనివారం రాశిఫలాలు
మేషం
ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదో విషయంలో నిరాశగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో స్నేహితుల నుంచి సహాయం అందుతుంది.
వృషభం
విద్యార్థులకు మంచి రోజు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయనాయకులకు కలిసొచ్చే సమయం. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. మీపై ప్రతికూలత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావొచ్చు.
మిథునం
మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. స్నేహితుడి ఆరోగ్యం క్షీణించవచ్చు. కష్టాలు దూరమవుతాయి. విద్యార్థులకు ఈరోజు సమస్యాత్మకంగా ఉంటుంది.వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది.
కర్కాటకం
అధిక పని అలసటకు దారి తీస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఆచరణలో చికాకు ఉంటుంది. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయగలరు. మీ ప్రతిపనిలోనూ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది.
Also Read: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది
సింహం
ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. ప్రమోషన్ పొందవచ్చు. విద్యార్థులకు అనుకూల సమయం.
కన్య
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. తండ్రి నుంచి సహకారం అందుతుంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు బదిలీకావొచ్చు. శుభవార్తలు వింటారు. ప్రభుత్వ పనుల్లో పురోగతి ఉంటుంది.
తుల
ఈ రోజంతా ప్రశాంతంగా ఉంటారు. కార్యాలయంలో చిన్న చిన్న మార్పులు జరగొచ్చు. ఆర్థికంగా కలిసొచ్చే సమయం. కష్టపడి మీ సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాదానికి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి.
వృశ్చికం
కార్యాలయంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి స్నేహితుల నుంచి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీపై ప్రతికూలత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: యమలోకంలో ఎంట్రీ ఉండకూడదంటే ఈ దానాలు చేయమన్న గరుడపురాణం
ధనుస్సు
మీ మాటలతో చాలామందిని ఆకట్టుకుంటారు. వ్యాపార పనులుపై విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులతో వ్యవహారాలు వద్దు. వ్యాపార విస్తరణ ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒత్తిడి పెరగొచ్చు.
మకరం
ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ ప్రవర్తన అదుపుచేయండి. విద్యార్థులకు మంచి సమయం.
కుంభం
వ్యాపార, కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలున్నాయి. తలపెట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయం తీసుకుంటారు. నిలుపుదల చేసిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.
మీనం
వ్యాపారంలో కొత్త ఒప్పందాలు జరగవచ్చు. ప్రయాణాల్లో సంతోషకరమైన ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పురోగతితో ఆనందం ఉంటుంది. ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Today Panchang 28 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శనిని ప్రశన్నం చేసుకునే శాంతిమంత్రం
Shani Trayodashi: ఈ ఆలయానికి వెళ్లినవారు దర్శనానంతరం వెనక్కు తిరిగి చూడకూడదు!
Shri Nimishamba Devi Temple: పెళ్లి కాని ప్రసాద్లకు గుడ్న్యూస్, ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఓ ఇంటివారైపోతారట
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!