Spirituality: యమలోకంలో ఎంట్రీ ఉండకూడదంటే ఈ దానాలు చేయమన్న గరుడపురాణం
సనాతన సంప్రదాయంలో అష్ట మహాదానాలకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. గరుడ పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి వివరించారు. అవి ఏంటి...అష్ట మహాదానాలు ఎందుకు చేయాలో చూడండి.
సనాతన సంప్రదాయంలో అష్ట మహాదానాలకు ఒక విశిష్టమైన ప్రాధాన్యత వుంది. అవేంటంటే
1. నువ్వులు
2. ఇనుము
3. బంగారం
4. పత్తి
5. ఉప్పు
6. భూమి
7. ఆవులు
8. ఎనిమిదవ దానంగా ఏడు ధాన్యాలు కలపి (గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు) చేయాలి
- నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుంచి ఉద్భవించాయి. నువ్వుల్లో మూడు రకాలు ఉంటాయి. వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలు ఉంటాయి.ముఖ్యంగా శనివారం నువ్వులు దానం చేయడం ద్వారా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. శనివారం శనీశ్వరుని ముందు ఆవు నూనె లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభప్రదం. ఈ రోజున నల్లని వస్త్రాలను దానం చేసి నల్లటి శునకానికి ఆహారం అందించడం వల్ల శని బాధలు తొలగిపోతాయి.
- ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా తప్పించుకోవచ్చుననేది శాస్త్రం చెప్తోన్న మాట. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటాడు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరని చెప్తారు.
- భూమిని దానం చేయడం ద్వారా సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి.
- సువర్ణ దానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు
- పత్తిని దానం చేయడం ద్వారా యమ భటుల భయం ఉండదు.
- ఉప్పు దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు.
- గోదానంతో వైతరిణి నదిని దాటిపోవచ్చు. అంటే సకల దేవతలు కొలువైన ఆవుని దానం చేయడం ద్వారా స్వర్గలోకం ఎంట్రీ ఖాయం అన్నమాట
- ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను కలపి దానం చేయడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోవడమే కాదు, యమ బాధలుండవని పండితులు చెబుతారు.
దారిద్ర్యదుఖః దహన స్తోత్రం
1. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ |
కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఖః దహనాయ నమః శివాయ ||2||
2. గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ |
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్ర్య దుఖః దహనాయ నమః శివాయ ||2||
3. భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఖః భవసాగర తారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్య దుఖః దహనాయ నమః శివాయ ||2||
4. చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ |
మంజీరపాద యుగళాయ జటాధరాయ
దారిద్ర్య దుఖః దహనాయ నమః శివాయ ||2||
5. పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపయాయ
దారిద్ర్యదుఖః దహనాయ నమః శివాయ ||2||
6. భాను ప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ |
నేత్ర త్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఖః దహనాయ నమః శివాయ ||2||
7. రామప్రియాయ రఘునాధ వరప్రదాయ
నామప్రియాయ నరకార్ణవ తారణాయ |
పుణ్యేశు పుణ్యభరితాయ సురర్చితాయ
దారిద్ర్యదుఖః దహనాయ నమః శివాయ ||2||
8. ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఖః దహనాయ నమః శివాయ ||2||