Horoscope Today 20 June 2022 :ఈ రాశివారు అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope 20th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
2022 జూన్ 20 సోమవారం రాశిఫలాలు
మేషం
ఈ రాశి ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో వివాదాలు వచ్చ అవకాశం ఉంది. అతిగా తినొద్దు. స్నేహితులు, అపరిచితుల నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
ఎరుపు, తెలుపు రంగులు మంచివి.
వృషభం
అనుకోని ధనం చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. స్నేహితులతో ఉత్సాహంగా స్పెండ్ చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారానికి మీ మనస్సు చెప్పిందే వినండి. నారింజ రంగు మీకు శుభప్రదం.
మిథునం
వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి మంచి సమయం కాదు. మీ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. ఆదాయం-ఖర్చులు రెండూ పెరుగుతాయి. పాత పరిచయాలు మీకు కొన్ని సమస్యలు తెచ్చిపెడతాయి. అభిప్రాయ భేదాల వల్ల వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తిపరమైన సంబంధాలకు భంగం కలిగించవచ్చు. ఆకుపచ్చ రంగు మీకు శుభప్రదం.
కర్కాటకం
మీరు తీసుకున్న నిర్ణయాలపై ఆత్మపరిశీలన చేసుకుంటారు. స్వీయ లోపాలు సరిదిద్దుకునేందుకు ఇదే సరైన సమయం. ఒత్తిడికి లోనుకావొద్దు. జాయింట్ వెంచర్లో పెట్టుబడి ప్లాన్ ఉన్నట్టైతే ఇతరులను నమ్మొద్దు. సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు అనుకూల సమయం. జీవిత భాగస్వామితో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. డబ్బు చేతికందుతుంది. ఎరుపు, పసుపు మీకు మంచి రంగులు.
Also Read: ఒకే రాశిలో బుధుడు-శుక్రుడు, ఈ 4 రాశులవారికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది
సింహం
ఈ రోజంతా బిజీగా ఉంటారు. గొడవపడే ధోరణి పక్కనపెట్టండి...మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు.వ్యాపారంలో కొత్త ఒప్పందం వల్ల ప్రయోజనం పొందుతారు. ఈ రోజు ఏ మతపరమైన ప్రణాళికను వాయిదా వేయడం సరికాదు. ఎరుపు, నారింజ రంగులు శుభప్రదమైనవి.
కన్యా
మీ ప్రవర్తనలో ఏదో తెలియని మార్పును మీరు గుర్తిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్తగా ఏదైనా పని చేపట్టాలి అనుకుంటే నిపుణులతో మాట్లాడండి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. విద్యార్థులకు శుభసమయం. నీలం, ఊదా మీకు కలిసొచ్చే రంగులు.
తుల
రోజంతా చాలా బిజీగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.పెద్దల ఆశీర్వచనం తీసుకోండి. ప్రియమైన వారి కారణంగా బాధపడతారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. మీ పనితీరుపై బాస్ సంతృప్తి చెందుతారు. ఈ రాశి వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. హాస్య చర్చలు వివాదానికి తీసే అవకాశం ఉంది. నీలం, ఆకుపచ్చ మీకు కలిసొచ్చే రంగులు.
వృశ్చికం
ఈ రోజంతా మీరు చాలా చురుకుగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కొత్త ఆదాయవనరులు ఏర్పడతాయి. స్నేహితుల సమస్యలు పరిష్కరించడంలో మీ సలహాలు పనిచేస్తాయి. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు మంచి రోజు. ఎరుపు, నారింజ రంగులు మంచివి.
Also Read: వృషభ రాశిలోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారికి అస్సలు బాలేదు
ధనుస్సు
మీ ప్రవర్తనతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. ఇతరులను సులువుగా ఒప్పించే మీ సామర్థ్యం ..ఫ్యూచర్లో మీ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది. ప్రేమను పెళ్లివరకూ తీసుకెళ్లాలి అనుకుంటే బయటపడేందుకు ఇదే మంచిసమయం. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేయడంలో రోజంతా బిజీగా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి శుభవార్త వింటారు. నీలం, ఆకాశ రంగులు శుభప్రదమైనవి.
మకరం
బందువులతో సంతోష సంభాషణ మీ అలసటని తగ్గిస్తుంది. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. మీరు చేసే పనిలో మీ నైపుణ్యం పూర్తిస్థాయిలో ప్రదర్శిస్తారు. వ్యక్తిగత సంబంధాలకు సమయాన్ని కేటాయించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. విద్యలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆకుపచ్, ఊదా రంగులు మంచివి.
కుంభం
మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో కలహాలకు కారణం అవుతాయి. మీ స్వంత ప్రయోజనాల కోసం వ్యక్తిగత సంబంధాలను దుర్వినియోగం చేయడం మీ జీవితభాగస్వామికి నచ్చకపోవచ్చు. వ్యాపారులకు మంచి రోజు. కొత్తగా ఉద్యోగం ప్రారంభించాలనుకుంటే మంచి రోజు. ఆకుపచ్చ, నీలం మీకు మంచి రంగులు.
మీనం
మీన రాశివారికి ఈ రోజు బావుంది. కొత్త ఆర్థిక ఒప్పందం మీకు కలిసొస్తుంది. కుటుంబ పనులతో బిజీగా ఉంటారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. తెలుగు, ఎరుపు మీకు కలిసొచ్చే రంగులు.
Also Read: ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుదట