అన్వేషించండి

Vastu Tips:ఫెంగ్ షుయ్‌ ప్రకారం ఈ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుదట

దేశం ఏదైనా వాస్తు అనగానే ఆ ఇంట మంచి జరగాలనే కదా ఫాలో అవుతారు. ఎందుకంటే ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ వస్తువులు చైనీస్ మాత్రమే కాదు ఎవరు ఇంట్లో పెట్టుకున్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందంటున్నారు వాస్తుపండితులు

చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్‌ ప్రకారం నెగిటివ్ ఎనర్జీని తరిమేసి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించే కొన్ని వస్తులున్నాయి. చైనీయులు తమ ఇళ్లలో తప్పనిసరిగా ఇవి ఉండేలా చూసుకుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇవే వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. అవేంటో చూద్దాం

మనీ ఫ్రాగ్
మూడు కాళ్ల టోడ్ లేదా ఫెంగ్ షుయ్ మనీ ఫ్రాగ్  అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతారు. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవాలి. డబ్బులు దాచే చోట కూడా పెట్టొచ్చు. వంటగది, వాష్ రూమ్స్ లో అస్సలు ఉంచకూడదు..తెలియకుండా ఇలాంటి ప్లేస్ లో పెడితే జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కప్పలు ఉంచాలనుకుంటే వాటి సంఖ్య  3, 6 లేదా 9 ఉండేలా చూడండి.కలిసొస్తుందనే ఉద్దేశంతో ఇంతకన్నా ఎక్కువ పెట్టకండి. దీన్ని నేలపై నుంచి కొంచెం ఎత్తులో ఉంచాలి.

లాఫింగ్ బుద్ధ
చైనా వినాయకుడుగా పిలిచే లాఫింగ్ బుద్ధను కూడా ఇంటి ఎంట్రన్స్ లోనే ఉంచాలి. లాఫింగ్ బుద్ధ ముఖంలో ఉంటే పెద్ద చిరునవ్వు నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి ..శుభాన్ని ఆహ్వానిస్తుందంటారు. లాఫింగ్ బుద్ద ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం, ఆనందం రెండూ ఉంటాయని చెబుతారు. ఇంట్లో, కార్యాలయంలో, వ్యాపార సంస్థల్లో ఎక్కడైనా లాఫింగ్  బుద్ధని  పెడితే అంతా శుభమే అని విశ్వసిస్తారు. అయితే ఈ బొమ్మను ఎవరికి వారు కొనుక్కోకూడదు.. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. 

Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి

గోల్డెన్ ఫిష్
ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం ఇంట్లో గోల్డెన్ ఫిష్ ఉంటే అది ఆనందానికి, సమరస్యానికి ప్రతీకగా నమ్ముతారు. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతంగా అభివృద్ధి చెందుతారంటారు. ఈ చేపను డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవాలి. దీన్ని ఇంట్లో పెట్టుకున్న రోజునుంచీ మీ సక్సెస్ ని మీరే గమనిస్తారు.

మూడు చైనీస్ నాణేలు
చైనీస్ నాణేలు సంపదకు మూలంగా పరిగణిస్తారు. వృత్తాకార నాణేలు దాని రెండు వైపులా యిన్ , యాంగ్‌లను సూచిస్తాయి. యాంగ్ యొక్క నాలుగు వైపులా నాలుగు అక్షరాలు చెక్కి ఉంటాయి. యిన్‌లో రెండు అక్షరాలు ఉండొచ్చు లేదంటే ఖాళీగా కూడా ఉండొచ్చు. నాణేల గుండ్రటి ఆకారం స్వర్గాన్ని, చతురస్రాకారపు ఆకారం భూమిని సూచిస్తుంది. సాధారణంగా మూడు, ఆరు లేదా తొమ్మిది ఫెంగ్ షుయ్ నాణేల బంచ్‌లు ఎరుపు లేదా పసుపు రంగు రిబ్బన్‌తో ముడేసి పెడతారు. ఫెంగ్ షుయ్ లో ఎరుపు శుభప్రదమైన రంగు, ప్రాణశక్తికి సూచన. ఎరుపు రిబ్బన్‌తో ముడేసిన చైనీస్ నాణేలను ఇంటి ప్రధాన ద్వారం వెనుక ఉంచాలి. 

చైనీస్ తాబేలు
ఫెంగ్ షుయ్ , వాస్తు శాస్త్రం ఈ రెండూ కూడా తాబేలును అదృష్టానికి కేరాఫ్ గా పరిగణిస్తాయి. తాబేలు బొమ్మను ఉత్తర దిశలో ఉంచడం వల్ల జీవితంలో వైఫల్యం అనే మాటే వినిపించదంటారు వాస్తు నిపుణులు.

ఫౌంటెన్
గదిలో ఫౌంటెన్ సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. ఇది వ్యక్తుల మధ్య ప్రేమ, సామరస్యాన్ని పెంచుతుందట. 

Also Read: చనిపోయిన వారి ఫొటోలు వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదు

వేలాడే అద్దాలు
ఇంట్లో వేలాడే అద్దాలు చాలా సానుకూలా వాతావరణం నింపుతాయి. వేలాడే అద్దాలు నెగిటివ్ వైబ్రేషన్స్ ని తరిమేస్తాయంటారు. అయితే అద్దాన్ని ఎప్పుడూ ప్రధాన ద్వారం ముందు ఉంచకూడదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లోపలకు వచ్చే సానుకూల వైబ్స్ ని అద్దం వెనుతిరిగి పంపించేస్తుందట.

నిజమైన మొక్కలు
ప్లాస్టిక్ హంగులు ఆర్భాటాలు కాకుండా ఇంట్లో నిజమైన మొక్కలు పెట్టుకుంటే ప్రశాంత వాతావరణం ఉన్నట్టే.  ఎల్లప్పుడూ  ఇంట్లో ఎప్పుడూ తాజా పూలను ఉంచేందుకు కూడా ప్రయత్నించండి. ఎందుకంటే జీవితంలో ఆనందం, ప్రేమకు చిహ్నం పూలు. పచ్చటి మొక్కలు, అందమైన పూలు ప్రతికూల శక్తిని దరిదాపుల్లో రానివ్వవు. 

Also Read:  ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

 నోట్: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget