Shukra Gochar 2022: వృషభ రాశిలోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారికి అస్సలు బాలేదు
Shukra Gochar 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
![Shukra Gochar 2022: వృషభ రాశిలోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారికి అస్సలు బాలేదు shukra gochar 2022 entered venus in taurus, bad luck for these zodiacs signs, know in details Shukra Gochar 2022: వృషభ రాశిలోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారికి అస్సలు బాలేదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/18/e4599db75438cd9fc583b7291f19d088_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఒకే రాశిలో రెండు గ్రహాలుంటే ఆ ప్రభావం అన్ని రాశులపైనా పడుతుంది. ఇప్పటికే బుధుడు వృషభరాశిలో సంచరిస్తుండగా ఇప్పుడు శుక్రుడు కూడా ఇదే రాశిలో వచ్చి చేరాడు. జూన్ 18న వృషభ రాశిలో అడుగుపెట్టిన శుక్రుడు జూలై 12 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. ఈ ఫలితంగా నాలుగు రాశుల వారికి మిశ్రమ ఫలితాలుండగా మరో నాలుగు రాశుల వారికి పూర్తి ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృషభం
మీ రాశిలోకే శుక్రుడు ప్రవేశించాడు. మీకు ప్రతికూల ఫలితాలు లేకపోయినా మొత్తం అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పలేం. అయితే స్థిరాస్థులు వృద్ధి చేస్తారు. తలపెట్టిన పనులు ఆంటంకం లేకుండా పూర్తైపోతాయి. పెట్టుబడులకు ఇది అనుకూల సమయం.
మిథునం
వృషభ రాశిలో శుక్రుడు ఆగమనం వల్ల మిథునరాశివారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబ అవసరాల కోసం మీ ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి రావొచ్చు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. జాగ్రత్తగా లేకుంటే బంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది.. అందుకే కఠినమైన మాటలు మాట్లాడొద్దు, కఠినంగా వ్యవహరించవద్దు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
కర్కాటకం
కర్కాటక రాశి వారికి శుక్ర సంచారం ప్రయోజనకరంగానే ఉంది. నిర్లక్ష్యం, బద్దకం వీడితే మీకు శుభఫలితాలు వస్తాయి. రెగ్యులర్ లైప్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితం మరింత బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అంతా శుభసమయమే.
సింహం
వృషభ రాశిలో శుక్రుడి సంచారం సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలనిస్తోంది. వారు పనిచేస్తున్న రంగంలో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకోని వివాదాలుంటాయి జాగ్రత్త.
తుల
తుల రాశివారికి ఈ సమయం అస్సలు శుభప్రదం కాదు. కుటుంబ కలహాలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే ఆలోచనలు విరమించుకోండి...లేదా..జాగ్రత్తగా చూసుకుని పెట్టండి. ఆర్ఠికంగా నష్టపోయే అవకాసం ఉంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. డ్రైవింగ్ లో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు
వృషభంలో శుక్రుడి సంచారం ధనుస్సు రాశి వారిలో టెన్షన్ పెంచుతుంది. ఈ సమయంలో శత్రువులు, ప్రత్యర్థులు మరింత యాక్టివ్ అవుతారు. మీరు తలపెట్టిన పనిని రహస్యంగా ఉంచండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. టైమ్ దాటి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కెరీర్ పరంగా సక్సెస్ అవుతారు. ప్రేమ జీవితంలోనూ సవాళ్లు తప్పవు.
మీనం
ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిపోతుంది. ఉద్యోగులకు సవాళ్లు తప్పవు. అదే సమయంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
Also Read: చనిపోయిన వారి ఫొటోలు వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)