News
News
X

Horoscope 6th July 2022: ఈ రాశులవారి దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది , జులై 6 బుధవారం రాశిఫలాలు

Horoscope 06-07-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

జులై 6 బుధవారం రాశిఫలాలు (Horoscope 06-07-2022)  

మేషం
వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు. బంధువులను కలుస్తారు. ప్రియమైన వారితో సరదాగా గడుపుతారు. ముఖ్యమైన విషయాలను చర్చించేటప్పుడు సీరియస్‌గా ఉండండి. ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. 

వృషభం
కెరీర్ ప్రశాంతంగా సాగుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. సీనియర్ అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కోపానికి దూరంగా ఉండాలి. వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. మీ సొంత తప్పులకు మీరే బాధ్యత వహించండి. ఇంట్లో ఉండే వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. 

మిథునం
గుర్తుతెలియని వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నత పదవులు పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి సలహా తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది. మీ పనితో మీరు సంతృప్తి చెందుతారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఖర్చులు తగ్గించుకోండి. పనికిరాని పనులకు సమయం వృధా చేయకండి 

Also Read: జులై 6 బుధవారం తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వివస్వత సప్తమి సందర్భంగా సూర్య ధ్యానం

కర్కాటకం
ఓ శుభవార్త వింటారు. మీ దృష్టి తప్పుడు కార్యకలాపాలపైకి మళ్లుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది.ఈ రోజంతా సరదాగా గడుపుతారు. ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది.  

సింహం
ఆస్తిలో మీకు వాటా లభిస్తుంది. పాత పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మిమ్మల్ని ఎగతాళి చేయొచ్చు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. 

కన్యా
కార్యాలయంలోని సహోద్యోగులతో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్త పథకాల్లో డబ్బు పెట్టుబడి పెట్టొచ్చు. అడపాదడపా, మీ పనులన్నీ పూర్తవుతాయి. దేవాలయాన్ని సందర్శిస్తారు.

తులా
స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. ఖర్చులు తగ్గించండి. స్నేహితులతో పార్టీలకు హాజరవుతారు. మీ సమర్థతపై నమ్మకం ఉంచండి. మారుతున్న వాతావరణం కారణంగా ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. 

Also Read: ఈ రాశివారు అప్పులకు, అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండడం మంచిది, ఈ వారం మీ రాశి ఫలాలు తెలుసుకోండి

వృశ్చికం
ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వారికి శుభవార్తలు అందుతాయి. ధనలాభం ఉంటుంది.వైద్య నిపుణులు లాభపడతారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. ఫ్యూచర్ కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. యువత ప్రేమ ప్రతిపాదనలను అందుకుంటారు, తెలివిగా ఖర్చు చేయండి.

ధనుస్సు
పాత మిత్రులతో ఆకస్మిక సమావేశం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది.  మతపరమైన ప్రయోజనాలు పొందుతారు. 

మకరం
ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. దంపతుల మధ్య మనస్పర్థలు రావొచ్చు. కోపంగా మాట్లాడొద్దు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి. మోసపూరిత వ్యక్తులపట్ల జాగ్రత్త వహించండి. 

Also Read: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి

కుంభం
ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేసేందుకు చాలా కష్టపడతారు. విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు. రహస్య విషయాలను జాగ్రత్తగా ఉంచండి. కొన్ని కారణాల వల్ల మీ మనస్సు సంతోషంగా ఉండకపోవచ్చు. అనవసర విషయాలపై సమయాన్ని వృథా చేయకండి. మీరు ఎలాంటి బాధల నుంచి అయినా ఉపశమనం పొందుతారు.

మీనం
మీ కుటుంబ బాధ్యతల పట్ల విధేయతతో ఉంటారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొన్ని వ్యాధులతో బాధపడేవారు కాస్త ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు సత్ఫలితాలు పొందుతారు. మంచి ఆలోచనలు మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాయి. ప్రేమికులు పెళ్లిచేసుకునే దిశగా ముందడుగు వేయొచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త.

Also Read: జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి

Published at : 05 Jul 2022 03:34 PM (IST) Tags: astrology in telugu horoscope today in telugu Aaries Gemini Libra And Other Zodiac Signs July 2022 Monthly Horoscope astrological prediction for 5th july 2022 aaj ka rashifal 06 july 2022 horoscope astrological prediction for 6th july 2022

సంబంధిత కథనాలు

Horoscope 9th August 2022: ఈ రాశివారు ప్రమాదంలో చిక్కుకోవచ్చు, జాగ్రత్త!

Horoscope 9th August 2022: ఈ రాశివారు ప్రమాదంలో చిక్కుకోవచ్చు, జాగ్రత్త!

Pavithrotsavam in Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్ - శ్రీవారి ఆలయంలో దర్శన సమయాలలో మార్పులు

Pavithrotsavam in Tirumala: భక్తులకు టీటీడీ అలర్ట్ - శ్రీవారి ఆలయంలో దర్శన సమయాలలో మార్పులు

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

టాప్ స్టోరీస్

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

హైదరాబాద్‌లో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!

హైదరాబాద్‌లో నెంబర్‌ ప్లేట్‌ లేకుండా బండిపై తిరుగుతున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్టే!

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Chinese Phone Ban: చైనాకు మోదీ భారీ షాక్! ఆ బడ్జెట్ ఫోన్లపై బ్యాన్!

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'

Anasuya Item Song : కేక పెట్టి గోల చేసే కోక - అనసూయ ఐటమ్ సాంగ్ 'కేక కేక'