By: RAMA | Updated at : 04 Jul 2022 06:25 AM (IST)
Edited By: RamaLakshmibai
Weekly Rasi Phalalu july 4th to 10th
వారఫలాలు జులై 4 సోమవారం నుంచి 10 ఆదివారం వరకు( Weekly Rasi Phalalu)
మేషం
ఈ వారం ఈ రాశివారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు శుభసమయం అనే చెప్పాలి..ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. పఓ శుభవార్త వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, వ్యాపారులకు ఈ వారం బాగానే కలిసొస్తుంది.వివాదాలకు దూరంగా ఉండండి..ఎవ్వరి వ్యవహారాల్లోనూ తలదూర్చవద్దు. కోపం తగ్గించుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం
ఈ వారం వృషభరాశివారికి బాగానే ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. నిరుద్యోగులకు, అవివాహితులకు శుభసమయం. బంధువులను కలుస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సూచనలున్నాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. రియల్ ఎస్టేట్ వారికి బాగా కలిసొచ్చే సమయం. తగాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి..ఒత్తిడికి గురయ్యే వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది.
మిథునం
ఈ రాశివారికి ఈ వారమంతా మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. అనవసర విషయాలతో టైమ్ వేస్ట్ చేయకండి. ముఖ్యమైన వ్యవహారాలు మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడండి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు లాభాలు సాధిస్తారు.విద్యార్థులు శ్రమపడాల్సిందే. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. కన్నవారి ఆశీశ్సులు మీపై ఉంటాయి. . స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి.
కర్కాటకం
ఈ వారం మీ ఆదాయం పెరుగుతుంది. ఆలోచనా విధానం మీప్రవర్తన వల్ల ఇంటా-బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అష్టమ శని కారణంగా అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ పూర్తవుతాయి. ఆరోగ్యం బావుంటుంది. సంతానానికి సంబంధించి ఓ శుభవార్త వింటారు. కుటుంబంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగులుకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయనాయకులకు శుభసమయం. అనవసర ప్రసంగాలు చేయకండి, అప్పులకు దూరంగా ఉండడం చాలా మంచిది.
Also Read: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి
సింహం
ఈ వారం మీకు అదృష్టం కలిసొస్తుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హూదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు ఒత్తిడి పెుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించండి. ఆత్మీయుల సలహాలు మీకు మంచిచేస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వేయండి.
కన్య
అనవసర విషయాలకు, ప్రసంగాలకు దూరంగా ఉండాలి. స్థిరాస్తి వృద్ధి చేయాలనే మీ ప్రయత్నం విజయంవంతం అవుతుంది. ఉద్యోగులకు బాగానే ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికందుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బావుంటుంది. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి.
తుల
ఈ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. పని మొదలెట్టడంపై ఉన్న శ్రద్ధ పూర్తిచేయడంపై ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించి ముందడుగు వేస్తే సక్సెస్ అవుతారు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం వింటారు. ఆదాయం బావుంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉండరు. విద్యార్థులు చదువుపై మరింత దృష్టిపెట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది.
వృశ్చికం
ఈ వారం మీకు అన్ని విధాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు వస్తాయి. ఓ శుభవార్త అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి జాగ్రత్త. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారులకు, రైతులకు కలిసి వచ్చే కాలం ఇది. సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
Also Read: జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి
ధనుస్సు
ఈ వారం ధనస్సు రాశివారికి అంత అనుకూలంగా లేదు. చికాకులు, వివాదాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారికి ఇది మంచి సమయం కాదు. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారే ఇప్పుడు ముఖం చాటేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం అనుకూల సమయం ఇది. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారులు కష్టపడితేనే మంచి ఫలితాలు అందుకుంటారు. రాజకీయాలు, సమాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధైర్యంగా ముందుకు సాగండి.
మకరం
ఈ వారం ఉద్యోగ జీవితం సాఫీగా గడిచిపోతుంది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వివాహ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టేవారున్నారు జాగ్రత్త పడండి.
కుంభం
మీ బాధ్యతను మీరు శక్తివంచన లేకుండా కృషిచేస్తారు. మీకు దైవబలం ఉంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ట తగినంత శ్రద్ద అవసరం. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిపెరుగుతుంది. ప్రేమవ్యవహారాలు మీకు కలసిరావు. ఫ్యూచర్ కోసం ప్రణాళికలు వేసుకునేందుకు మంచి టైమ్ ఇది.
మీనం
ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఈ వారం మొత్తం బాగానే ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం, ఆదాయం రెండూ బావుంటాయి. నిన్నటి వరకూ వెంటాడీన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. వ్యసనాలకు దూరంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఓర్పుగా వ్యవహరించాలి.
Raksha Bandan 2022: రాఖీ కడితే డబ్బు, బంగారం ఇవ్వకండి! ఇలా ప్రేమను చాటుకోండి!
Raksha Bandhan 2022: రక్షాబంధన్ రోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఇది
Nara Dishti Dosha: దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!
Horoscope 11th August 2022 Rashifal :ఈ రాశివారిని ఆర్థిక ఇబ్బందులు కుంగదీస్తాయి, ఆగస్టు 11 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Hayagriva Jayanti 2022: ఆగస్టు 12 హయగ్రీయ జయంతి, విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన రోజు
Motorola X30 Pro: ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్ - 200 + 50 + 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో మోటొరోలా మొబైల్!
SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్లోగా రండి: CJI
Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !
Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !