Monthly Horoscope July 2022: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి
Monthly Horoscope July 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు…
జులై నెల రాశిఫలాలు (Monthly Horoscope July 2022)
తుల
తులా రాశివారికి జులై నెల అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో అన్నీ శుభఫలితాలే ఉంటాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసేవారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సూచనుంది. ఆరోగ్యం బావుంటుంది, రాని బాకీలు వసూలవుతాయి. ధైర్యంగా ముందుకు అడుగేయండి. కుజుడి సంచారం కారణంగా కోపం అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉంటారు.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. ప్రధమార్థంలో అష్టమంలో గ్రహసంచారం కారణంగా అనుకూలత తక్కువగా ఉంటుంది. తొందరగా అలసిపోతారు. అకాల భోజనాలు చేస్తారు.గడిచిన నెలలతో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో స్వల్పంగా విభేదాలు తలెత్తుతాయి.స్నేహితుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు బాగానే ఉంటుంది.
Also Read: జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి
ధనస్సు
ధనస్సు రాశివారికి జులై నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు , వ్యాపారాలు బాగా సాగుతాయి. గడిచిన నెలలతో పోలిస్తే ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కొత్త ప్రణాళికలు రచిస్తారు. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. దూరప్రయాణాలు చేస్తారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా పరిష్కారమవుతాయి. కోపం తగ్గించుకోండి.
మకరం
మకర రాశికి చెందిన ఉద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగులకు అనుకూల సమయమే. అయితే నాలుగో స్థానంలో ఉన్న కుజుడు, రాహువు కారణంగా ఎలాంటి కారణం లేకుండా విరోధాలు జరుగుతాయి. ఎవ్వరి మాటల్లోనూ జోక్యం చేసుకోకుండా ఉండడం, వాదన పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది. కొన్ని అవమానాలు ఎదుర్కొంటారు. నిందలు పడతారు. కుటుంబంలో భార్య-భర్త మధ్య అవగాహన ఉండదు. చిన్న చిన్న విషయాలతో గొడవలు పడతారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండడమే మంచిది లేదంటే నష్టం తప్పదు.
Also Read: ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు
కుంభం
ఈ నెలంతా మీకు చాలా బావుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి అనుకూల సమయం. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. మీ మాటతీరుతో ఎలాంటి వారినైనా కట్టిపడేస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమయం. బంధువులను కలుస్తారు
మీనం
మీన రాశివారికి గడిచిన నెలలతో పోలిస్తే జులై నెల అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. చాలా సమస్యలు ఓ కొలిక్కి రావడంతో ఉత్సాహంగా ఉంటారు. ప్రతివిషయంలోనూ ముందుంటారు. బంధువులు, స్నేహితుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. శత్రువులపై మీదే పై చేయి. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అన్ని విధాలుగా బావుంటుంది.
Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!