News
News
X

July 2022 Monthly Horoscope : జులై నెలలో ఈ రాశులవారికి అవమానం, ధనవ్యయం- మీ రాశిఫలితం తెలుసుకోండి

Monthly Horoscope July 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు…

FOLLOW US: 

జులై నెల రాశిఫలాలు (Monthly Horoscope July 2022)

మేషం 
ఈ నెలలో జన్మంలో కుజుడు, రాహువు ప్రభావం వల్ల అందరితోనూ విరోధాలుంటాయి. మంచికి వెళితే చెడు ఎదురవుతుంది. వాహన ప్రమాదం ఉంటుంది జాగ్రత్తపడండి. సోదరులతో గొడవలు జరుగుతాయి. ఏ పని చేపట్టినా పూర్తిచేయలేరు. భూ సంబంధ వ్యవహారాల్లో నష్టాలుంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టొద్దు. ప్రతి విషయంలోనూ ఆచి తూచి అడుగేయకుంటే ఇబ్బందులు తప్పవు. వేరేవారి మాటల్లో జోక్యం చేసుకోవద్దు. 

వృషభం 
వృషభ రాశివారికి ఈ నెలలో గ్రహసంచారం అన్నివిధాలుగా బావుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పన్నెండో స్థానంలో ఉన్న రాహువు, కుజుడు వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కొంత ఆందోళన ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. 

Also Read: ఈ రాశివారికి గౌరవ మర్యాదలు, ఆ రాశివారికి ధననష్టం - జులై నెలలో మీ రాశిఫలితం తెలుసుకోండి

మిథునం
మిథున రాశివారికి ఈనెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. జన్మంలో 12 వ ఇంట గ్రహసంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. చేపట్టిన కొన్ని పనుల్లో సక్సెస్ అయితే మరికొన్ని పనుల్లో అపజయం ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తప్ప మరే ఇతర ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా కొన్ని సమస్యలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తప్పనిసరి

కర్కాటకం
కర్కాటక రాశివారికి కూడా ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగాలు, వ్యాపారులు, మీ వృత్తుల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ మీకు మనశ్శాంతి ఉండదు. అనారోగ్య సమస్యలుంటాయి. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి.మనసులో ఏదో అనుమానం వెంటాడుతుంది. అశాంతిగా ఉంటారు, గొడవలు పెట్టుకునే పరిస్థితులు ఎదురవుతాయి.  అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసికంగా ధైర్యంగా ఉండాల్సిందే. కుటుంబంలోనూ పెద్దగా సంతోషం ఉండదు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సూచనలున్నాయి.

Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

సింహం
సింహరాశివారికి ఈ నెలలో మొదటి పదిహేను రోజులు అన్ని విధాలుగా బాగుంటుంది. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. అనుకున్న పనులు, పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు, విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు, వ్యాపారులకు లాభాలొస్తాయి. నెలలో ద్వితీయార్థం మాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉండవు. విపరీతంగా డబ్బు ఖర్చవుతుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ప్రతివిషయంలోనూ వ్యతిరేకత ఎదురవుతుంది. ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి.

కన్య
ఈ నెలలో అష్టమ కుజుడు ప్రభావం మీపై చాలా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త పడండి. ఉద్యోగులకు స్థానమార్పులు ఉండొచ్చు. ఇల్లు మారే అవకాశాలున్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో నష్టపోతారు. తోడబుట్టిన వారికారణంగా కొన్ని ఇబ్బందులుంటాయి. నమ్మినవారే మోసం చేస్తారు. చేసే వృత్తి వ్యాపారాలు మాత్రం బాగానే సాగుతాయి.

Also Read: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Published at : 01 Jul 2022 06:42 AM (IST) Tags: astrology in telugu horoscope today in telugu Aaries Gemini Libra And Other Zodiac Signs aaj ka rashifal 01 july 2022 horoscope astrological prediction for 1st june 2022 Monthly Horoscope July 2022

సంబంధిత కథనాలు

Spirituality: దానం-ధర్మం ఈ రెండిటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది!

Spirituality: దానం-ధర్మం ఈ రెండిటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది!

Zodiac Signs: మీది ఏ రాశి, మీరు ఆఫీసులో సహోద్యోగులతో ఎలా ఉంటారో తెలుసా!

Zodiac Signs:  మీది ఏ రాశి, మీరు ఆఫీసులో సహోద్యోగులతో ఎలా ఉంటారో తెలుసా!

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే -  ప్రభుత్వ జీవో రిలీజ్ !

Spirituality:పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు, ఇంత అర్థం ఉందా!

Spirituality:పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు, ఇంత అర్థం ఉందా!

Tirumala: శ్రీవారి ఆలయంలో ప్రతి మంగళవారం నాడు నిర్వహించే సేవ, పూజలు ఇవే

Tirumala: శ్రీవారి ఆలయంలో ప్రతి మంగళవారం నాడు నిర్వహించే సేవ, పూజలు ఇవే

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?