Happy New Year 2025 Wishes in Shlokas: నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025.. ఈ శ్లోకాలతో చెప్పేయండి..
New Year 2025 Wishes: ఆంగ్ల సంవత్సరం కదా అని హ్యాపీ న్యూ ఇయర్ మాత్రమే చెప్పాల్సిన అసరం లేదు.. కాస్త కొత్తగా ట్రై చేయండి. పద్ధతిగా దేవుడి శ్లోకాలతో మీ స్నేహితులు,సన్నిహితులకు శుభాకాంక్షలు చెప్పండి..
Happy New Year 2025 Wishes in Telugu: నూతన సంవత్సర ఆరంభం బావుంటే ఏడాదంతా సంతోషంగా గడిచిపోతుందని భావిస్తారు చాలామంది. అందుకే న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెప్పే సమయాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే సంతోషంగా హ్యాపీ న్యూ ఇయర్ అని మాత్రమే చెప్పేయకుండా ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి. విద్యం, ఆరోగ్యం, ఉద్యోగం, ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం ఇవన్నీ కలిసొచ్చేలా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పేయండి.
వీటిలో మీకు నచ్చిన శ్లోకంతో మీ స్నేహితులు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలియజేయొచ్చు...
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా...
ఈ ఏడాది మీరు తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తికావాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
గాయత్రీ అనుగ్రహం మీపై ఉండాలి- నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఓం ప్రణోదేవీ సరస్వతీ వాజేభి ర్వాజినీవతీ ధీనామ విత్య్రవతు
సరస్వతీ దేవి కరుణాకటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు
Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!
ఓం గం గణపతియే నమ:
వృత్తి, ఉద్యోగాల్లో మీకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని ఆకాంక్షిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఓంఐంవాగ్దేవాయై విద్మహే కమరాజ్యాయధీమహే తన్నో దేవి ప్రచోదయాత్
చదువులతల్లి కటాక్షం అనుగ్రహం మీ పై ఉండాలి..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
శ్రీం హ్రీం సర్వస్వత్యాయ స్వాహ
ఐం హ్రీం, ఐంగ్ హ్రీం సరస్వత్యాయ నమ:
ఈ ఏడాది మీరు దినదినాభివృద్ధి చెందాలి
హ్యాపీ న్యూ ఇయర్ 2025
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
రామచంద్రుడి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో వెలుగునింపాలి
Also Read: నూతన సంవత్సరం 2025 ఆరంభం ఈ రాశులవారికి బంగారంలా ఉంటుంది!
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యోధ ముఖ్యం
శ్రీ రామదూతం శరణం ప్రపద్యే
హనుమాన్ కరుణాకటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025
కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనమ్
కలిబాధల నుంచి విముక్తి లభించాలి
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
ఆపదలు తొలగి జయం మీ సొంతం కావాలి
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
నవగ్రహ బాధలు తొలగిపోవాలి
నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025
ఈ ఏడాది మీ ప్రతి అడుగులోనూ మిమ్మల్ని విజయం వరించాలి.. కుటుంబంలో ఆనందంగా వెల్లివిరియాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. విద్యార్థులు చదువులో వృద్ధి చెందాలి.. ఉద్యోగులు ఇంక్రిమెంట్స్ తో కూడిన ప్రమోషన్లు అందుకోవాలి..వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించాలి.. గతేడాది వెంటాడిన వివాదాల నుంచి ఉపశమనం లభించాలి..శత్రువులు మిత్రులు కావాలి.. abp దేశం ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Also Read: 2025 జనవరి మొదటి వారం మేష రాశి to కన్యా రాశి 6 రాశుల వారఫలాలు!