Hanuman Jayanti 2024: ఎక్కడ తగ్గాలో శనికి తెలియజేసిన హనుమాన్ - ఇద్దరి మధ్యా ఏం జరిగింది!
Hanuman Jayanti 2024: శని ప్రభావం నుంచి తప్పించుకోవడం అంటే తేలికేం కాదు.. ఈ విషయంలో శివుడు, శ్రీ మహావిష్ణువు కూడా అతీతులు కాదు. కానీ ముగ్గురు మాత్రం శని దృష్టి తమపై పడనీయలేదు..వారిలో ఒకరు హనుమంతుడు..
![Hanuman Jayanti 2024: ఎక్కడ తగ్గాలో శనికి తెలియజేసిన హనుమాన్ - ఇద్దరి మధ్యా ఏం జరిగింది! Hanuman Jayanti 2024 Story Of Hanuman And Shani Dev and very powerful hanuman mantras Hanuman Jayanti 2024: ఎక్కడ తగ్గాలో శనికి తెలియజేసిన హనుమాన్ - ఇద్దరి మధ్యా ఏం జరిగింది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/23/32b40e752058c754cde89943c62228f91713849973514217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Story Of Hanuman And Shani Dev: ఆంజనేయుడిని పూజిస్తే శని ప్రభావం తగ్గుతుందని చెబుతారు. మంగళవారం హనుమాన్ కి ప్రత్యేకం అనుకుంటారు కానీ అంతకు మించి పవర్ ఫుల్ శనివారం. శనివారం-శని-హనుమాన్ కి ఏంటి సంబంధం? దీనిపై పురాణాల్లో ప్రచారంలో ఉన్న కథేంటి...
శని వక్ర దృష్టి నుంచి తప్పించుకున్న హనుమాన్
రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని తీసుకొచ్చేందుకు వారధి నిర్మిస్తుంటారు వానరులు. ఆంజనేయుడి సారధ్యంలో రాళ్లపై శ్రీరామ అని రాస్తూ నీటిలో వేస్తుంటారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన శనిదేవుడిని చూసి తను కూడా వారధి నిర్మాణంలో సహాయం చేసేందుకు వచ్చాడని అనుకుంటారంతా కానీ..హనుమపై వక్రదృష్టి ప్రసరించేందుకు వచ్చానని చెబుతాడు. వెంటనే హనుమాన్ తలపై కూర్చుంటాడు శని. అయితే వారధి నిర్మాణంలో అడ్డుగా ఉన్నావంటూ స్వామికార్యం పూర్తయ్యేవరకూ తల వదిలి కాళ్లు పట్టుకోమని చెబుతాడు. సరే అన్న శని కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించగా...ఆ కాళ్ల కింద తొక్కిపెట్టేస్తాడు. పైగా అష్టసిద్ధులున్న హనుమాన్ ని నెగ్గడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆ కాళ్ల కింద పడిన శని..ఇంకెప్పుడూ నీ వరకూ రాను వదిలిపెట్టమని వేడుకున్నాడు. అలా శని వక్రదృష్టి నుంచి ఆంజనేయుడు తప్పుకోవడంతో పాటూ తన భక్తులను కూడా తప్పించాడు. అందుకే శనివారం రోజు పవనసుతుడిని పూజిస్తే శని ప్రభావం తగ్గుతుందంటారు.
Also Read: హనుమాన్ సినిమాలో పాట రూపంలో వచ్చే 'రామదూత స్తోత్రం' ఇదే - చాలా పవర్ ఫుల్!
చెంగల్పట్టులో ఆలయం
తమిళనాడు చెంగల్పట్టు కోదండరామాలయంలో ఆంజనేయుడు-శని కథ మొత్తం చిత్రాల రూపంలో కనిపిస్తుంది. ఏల్నాటి శని, అష్టమ శని, అర్థాష్టమ శనితో బాధపడేవారు ఈ ఆలయానికి వెళ్లొస్తే ఆ ప్రభావం తగ్గుతుందని భక్తుల విశ్వాసం.
Also Read: పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
హనుమాన్ ని పూజిస్తే కేవలం శని ప్రభావం మాత్రమే కాదు..చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది
@ సప్త చిరంజీవులలో హనుమంతుడు ఒకడు. ఇప్పటికీ భూమిపై తిరుగుతున్నాడని, ఎక్కడ శ్రీరామ కీర్తనలు వినిపించినా అక్కడ ఏదో ఒక మూలన ఆంజనేయుడు కూర్చుని భజన చేస్తాడని అంటారు. అలాంటి చిరంజీవి అయిన ఆంజేనేయుడిని పూజిస్తే ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, విజయం, అభయం సిద్ధిస్తాయి
@ 'జై హనుమాన జ్ఞాన గుణసాగర' అంటూ తులసీదాస్ నోటివెంట అప్రయత్నంగా వెలువడిన హనుమాన్ చాలీసా పఠిస్తే సకల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
@ శ్రీ ఆంజనేయడం, ప్రశన్నాంజనేయం అంటూ సాగే హనుమాన్ దండకం పఠిస్తే దుష్ట శక్తుల ప్రభావం మీపై ఉండదు. పీడలు హరించుకుపోతాయి.
@ మంగళవారం ఆంజనేయుడికి చాలా ప్రత్యేకం...అయితే గ్రహ దోషాల నుంచి విముక్తి లభించాలంటే హనుమాన్ ని శనివారం పూజించాలంటారు పండితులు. ముఖ్యంగా ఎల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉండేవారికి శనిభాదల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: ఈ రోజే చైత్ర పౌర్ణమి - ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం!
హనుమాన్ మూల మంత్రం:
“ఓం హనుమతే నమః”
హనుమాన్ బీజా మంత్రం:
“ఓం ఆం బ్రిం హనుమతే శ్రీ రామ దూతాయ నమః”
హనుమాన్ గాయత్రి
ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాత్
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా సమామి !!
హనుమంతం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్
త్రిమూరత్యాత్మక మాత్మస్థం జపాకుసుమ సన్నిభమ్
నానాభూషణ సంయుక్తం ఆంజనేయం నమామ్యహమ్
పంచాక్షర స్థితం దేవం నీల నీరద సన్నిభమ్..!!
Also Read: ఏప్రిల్ 23 నుంచి జూన్ 01 వరకూ ఈ పారాయణం చేయండి - ఫలితం మీరు ఊహించలేరు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)