Vontimitta Brahmotsavam 2024: ఈ రోజే చైత్ర పౌర్ణమి - ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం!
Sri Rama Navami 2024: రాముడు అయోధ్యలో జన్మించినా వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశాడు. అందుకే ఆ దారి పొడవునా రామాయణ ఘట్టాలకి సంబంధించిన క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి ఒంటిమిట్ట
Vontimitta Brahmotsavam 2024: ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామనవమి. దేశ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అయితే వీటన్నిటి కన్నా ఒంటిమిట్ట చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే నవమి రోజు మధ్యాహ్నం సమయంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది కానీ ఒంటిమిట్టలో మాత్రం చైత్ర పౌర్ణమి రోజు వెన్నెల్లో కళ్యాణం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఘనంగా నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). ఏప్రిల్ 12వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతో వేడుకలు మొదలయ్యాయి. ఏప్రిల్ 13వ తేదీ ఉదయం పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 17న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 25వ తేదీ వరకు జరుగుతాయి. ఏప్రిల్ 23 చైత్ర పౌర్ణమి రోజు రాత్రి వెన్నెల్లో కళ్యాణం జరిపిస్తారు....
Also Read: హనుమాన్ సినిమాలో పాట రూపంలో వచ్చే 'రామదూత స్తోత్రం' ఇదే - చాలా పవర్ ఫుల్!
చంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం
పగటిసమయంలో తాను కళ్యాణం చూడలేకపోతున్ననని బాధపడిన చంద్రుడికి శ్రీరామచంద్రుడు మాటిచ్చాడట. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో నిండు పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. మరో కథనం ప్రకారం...చంద్రవంశానికి చెందిన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా ... రాత్రివేళ కళ్యాణం జరిపించే ఆచారం ప్రారంభించారని ఇప్పటికీ అదే కొనసాగుతోంది అంటారు. కథనాలు, కారణాలు ఏమైనా కానీ ఇతర ఆలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో కళ్యాణం పున్నమి కాంతుల్లో జరగడం ప్రత్యేకం.
Also Read: రామయ్య ఆకాశం సీతమ్మ పుడమి - ఇద్దరి కళ్యాణం ప్రకృతికి పులకరింత!
జాంబవంతుడు ప్రతిష్టించిన విగ్రహాలు
సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళుతున్న దారిలో...ఇంకా అప్పటికి హనుమంతుడని కలవలేదు. మార్గమధ్యలో జాంబవంతుడు ఓ కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేస్తూ కనిపించాడు. ఆ ఎదురుగా ఉన్న మరో గుట్టపై దర్శనమిచ్చిన రాముడు వరాలు ప్రసాదించాడు. అప్పుడు రామభక్తితో జాంబవంతుడు సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలిచి ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం. సీత, రామ, లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలపై చెక్కడం వల్ల ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ఆ ఏకశిలకు దగ్గర్లోనే మృకండుడు అనే మహర్షి తపస్సు చేసుకునేవాడని చెబుతారు. అయితే ప్రతి రామాలయంలో ఉండే ఆంజనేయుడి విగ్రహం ఇక్కడ ఉండదు. అప్పటికి ఆంజేనేయుడు రామభక్తుడు కాదు...రాముడికి ఎదురుపడలేదు. అందుకే సీతారామలక్ష్మణ విగ్రహాలు మాత్రమే ఇక్కడుంటాయి. ఈ క్షేత్రంలోనే పోతన భాగవతాన్ని అనువదించాడని, అన్నమయ్య కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడని చెబుతారు.
Also Read: పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
మరో కథనం ప్రకారం
ఒంటిమిట్ట 1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. అక్కడికి వచ్చిన రాజా కంపరాయులుకు బోయ నాయకులైన ఒంటడు–మిట్టడు అక్కడున్న రామతీర్థంలో నీటిని ఇచ్చి దాహంతీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమైన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని వారు రాజును కోరడంతో గుడినిర్మాణంతో పాటూ చెరువు నిర్మాణం కూడా తలపెట్టారు. ఆ బాధ్యతను ఒంటడు, మిట్టడులకు అప్పగించారు. అలా ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరొచ్చిందని కూడా చెబుతారు.
Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!