![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes 2024:ఏప్రిల్ 23 హనుమాన్ విజయోత్సవం..ఉత్తరాది సహా తెలంగాణలోనూ హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులుకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా...
![Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి! Hanuman Jayanti 2024 Wishes In Telugu powerful Slokas in Praise of Lord Anjaneya and wishes greetings quotes facebook whatsapp messages Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/22/54fa63c817d6327aecc8eb2eeb4fd3311713801136317217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hanuman Jayanti Wishes In Telugu 2024 : భోళాశంకరుడి అంశగా అవతరించిన హనుమంతుడికి చైత్రమాసం , వైశాఖ మాసం అత్యంత ప్రత్యేకం. రావణ సంహారం పూర్తై తిరిగి అయోధ్యకు చేరుకున్న రాముడు పట్టాభిషేకం పూర్తైన తర్వాత చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయుడిని ప్రేమగా హత్తుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు. అందుకే చైత్రమాస పౌర్ణమి ఆంజనేయుడికి అత్యంత ప్రత్యేకం..హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. వైశాఖ బహుళ దశమి ఆంజనేయుడు ఉద్భవించిన రోజు...ఆ రోజు హనుమాన్ జయంతి. అయితే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ధైర్యం, బలం, సమయస్ఫూర్తి, జ్ఞానాన్నిచ్చే హనుమాన్ శ్లోకాలు నిత్యం పఠిస్తే సకల శుభాలు జరుగుతాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి...
Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!
ఆంజనేయాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి
తన్నో హనుమత్ ప్రచోదయాత్
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |
వాతాత్మజం వానరయూథ ముఖ్యం
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే||
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం|
భాస్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||
హనుమాన్ విజయోత్సవం శుభాకాంక్షలు
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం|
రామాయణం మహామాలారత్నం వందే అనిలాత్మజం||
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
Also Read: ఏప్రిల్ 23 నుంచి జూన్ 01 వరకూ ఈ పారాయణం చేయండి - ఫలితం మీరు ఊహించలేరు!
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం
దనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం|
సకలగుణ నిధానం వానరాణాం అధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి||
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
అంజనానందం వీరం జానకీ శోక నాశనం|
కపీషమక్ష హంతారం వందే లంకాభయంకరం||
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
Also Read: పిల్లలకు అందుకే హనుమాన్ సూపర్ హీరో!
ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి త్వం ప్రాంజలీరాంజనేయం
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం|
పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం||
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
ఆమూషీకృత మార్తాండం గోష్పతీ కృత సాగరం|
తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం||
హనుమాన్ విజయోత్సవం శుభాకాంక్షలు
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కింవధ|
రామదూత కృప సింధో మత్కార్యం సాధ్యప్రభో||
హనుమాన్ విజయోత్సవం శుభాకాంక్షలు
Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!
సర్వ కల్యాణ తథాతరం సర్వాపద్గణ వారకం
అపర కరుణా మూర్తిం ఆంజనేయం నమామ్యహం
హనుమాన్ విజయోత్సవం శుభాకాంక్షలు
లంకలో శత్రుమూకని ఎదిరించే ముందు ఆంజనేయుడు పఠించిన జయమంత్రం ఇది... ఇది శుభాకాంక్షలు చెప్పేందుకు మాత్రమే కాదు నిత్యం పఠిస్తే తలపెట్టిన కార్యాల్లో విజయం వరిస్తుందని భక్తుల విశ్వాసం..
హనుమాన్ జయమంత్రం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||
భావం: రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. అలాంటి రామచంద్రుడికి దాసానుదాసుడిని నేను...నా పేరు హనుమంతుడు. యుద్ధంలో ప్రత్యేక ఆయుధాలు వినియోగించను కానీ లంకాధిపతి సైన్యాన్ని కాళ్ల కింద పెట్టి తొక్కేస్తాను, నా పిడి గుద్దులతో రాక్షస మూకని మట్టుపెడతాను, పెద్ద పెద్ద చెట్లను పెకిలించి విసిరేస్తాను. రాళ్లతో యుద్ధం చేస్తాను. వెయ్యిమంది రావణాసురులు వచ్చినా నా దగ్గర కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు...ఇదంతా అయ్యాక సీతాదేవికి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్లిపోతాను. అంటూ...ఈ జయ మంత్రం పఠించిన తర్వాత లంకలో రాక్షసులపై తన ప్రతాపం చూపించాడు ఆంజనేయుడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)