అన్వేషించండి

Hanuman Jayanti 2024: పిల్లలకు అందుకే హనుమాన్ సూపర్ హీరో!

Hanuman Jayanti 2024:ఆకాశమంత ఎత్తులో కనిపిస్తాడు , చీమలా మారిపోతాడు, ఎవ్వరూ కదపలేనంత బలంగా నిలబడతాడు, గాల్లో ఎగురుతాడు.. పిల్లల దృష్టిలో ఇవన్నీ సూపర్ హీరో లక్షణాలే కదా.ఇవన్నీ ఆంజనేయుడికే ఎలా సాధ్యం

Hanuman Jayanti 2024: హనుమాన్ ని చూస్తే పిల్లలు ఎగరి గంతేస్తారు..భక్తి, దేవుడు అనే మాటలు వాళ్లకు పెద్దగా తెలియదు కాబట్టి ఆంజనేయుడంటే వాళ్లకి సూపర్ హీరో అంతే. మరి పవనసుతుడిని సూపర్ హీరో చేసి ఆ లక్షణాలేంటి? వాటి ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం...

హనుమాన్ చాలీశా లో 'అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా' అనే పదం ఉంటుంది. ఇవే హనుమాన్ ని సూపర్ హీరోగా నిలబెట్టాయి. తత్వ శాస్త్రంలో సిద్ధి అనే మాటకు చాలా ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు ఓ స్థాయిలో భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. అప్పుడు సిద్ధించే శక్తులే ‘సిద్ధులు’. యోగ సూత్రాల ప్రకారం ఈ సిద్ధులను యోగం ద్వారా సాధించవద్దు, ఒక్కోసారి పుట్టుకతోనే సిద్ధించవచ్చు...ఇంకా మంత్రబలంతోనూ , దివ్య పురుషుల నుంచి పొందొచ్చు. సాంఖ్యం, భాగవతం, బౌద్ధం ఈ సిద్ధులను వేర్వేరు రకాలుగా చెబుతోంది కానీ... ప్రచారంలో ఉన్న అష్టసిద్ధులు మాత్రం ఇవే...

Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!

అష్ట సిద్ధులు శ్లోకం

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః
 
ఇవే అష్ట సిద్ధులు

అణిమ
అణిమ సిద్ధి అంటే అతి చిన్న అణువులా మారిపోవడం. భూతద్దం పెట్టి వెతికినా కనిపించంత చిన్నగా మారిపోవడం. ఆ సమయంలో తన మాటలు వినిపిస్తాయి కానీ ఆ వ్యక్తి కంటికి కనిపించరు. ఆంజనేయుడికి ఉన్న అష్టసిద్ధుల్లో ఇది మొదటిది..

మహిమ
శరీరాన్ని ఎంత పెద్దగా అయినా మార్చేయగలగడం. అంటే బ్రహ్మాడంలో ఓ కోణం నుంచి మరో కోణం వరకూ విస్తరించేయవచ్చు. అయితే బ్రాహ్మాండం మొత్తానికి తన శక్తి విస్తరించిందంటే ఈ బ్రహ్మాండం మొత్తం శ్రీరామచంద్రుడిలో భాగమే కదా ఇదంతా ఆయన ప్రసాదించిన వరమే అంటాడు రామభక్తుడు.

గరిమ
అష్ట సిద్ధుల్లో మూడోది గరిమ సిద్ధి. దీని ద్వారా అత్యంత బరువుగా మారిపోవడం. కనీసం కాలి వేలు కూడా ఎవ్వరూ కదపలేనంత బలంగా మారిపోతారు. మహాభారతంలో అరణ్యవాసంలో ఉన్న సమయంలో భీముడిని తన తోక తీసి పక్కనపెట్టమని చెప్పి గర్వం అణించేందుకు ఆంజనేయుడు ఉపయోగించిన శక్తి ఇదే..

Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!

లఘిమ
గరిమ సిద్ధితో ఎంత భారంగా మారిపోతాడో...లఘిమ సిద్ధితో అంతే తేలిగ్గా పరివర్తనం చెందగలడు హనుమాన్. సముద్రం పైనుంచి లంకకు ఎగురుతూ వెళ్లాడంటే ఈ శక్తే కారేం...

ప్రాప్తి
ప్రాప్తి సిద్ధి ఉపయోగించుకుని ప్రపంచంలో అత్యంత కఠిన వస్తువునైనా సాధించవచ్చు...ఈ శక్తితో  ఏ వస్తువు కావాలనుకున్నా దాన్ని శూన్యం నుంచి సైతం సాధించవచ్చు. 

ఈశత్వం
రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు..ఈశత్వం అనే శక్తి ద్వారా అష్టదిక్పాలకును శాసించగలడు...అందుకే భూత ప్రేత పిశాచ భయం ఉన్నవారు ఆంజనేయుడిని ప్రార్థిస్తారు...

ప్రాకామ్యం
అష్టసిద్ధుల్లో ఏడోది అయిన ప్రాకామ్యం ద్వారా తాను ఏం కోరుకున్నా సాధించగల శక్తి ఉంటుంది...

వశిత్వ శక్తి
సకల జీవరాశులను వశం చేసుకునే శక్తి...ఈ సిద్ధి ద్వారా సాధ్యం అవుతుంది...

అష్ట సిద్ధులు శ్రీరామచంద్రుడు ప్రసాదిస్తే...ఆంజనేయుడికి నవనిధులు ఇచ్చింది సీతమ్మ...

Also Read: తమలపాకులంటే ఆంజనేయుడికి ఎందుకంత ప్రీతి!

ఇవే నవనిధులు
మహాపద్మ నిధి , పద్మ నిధి, ముకుంద నిధి, నీల నీధి, కశ్చప నిధి, శంఖ నిధి, మకర నిధి, కర్వ నిధి, వర నిధి...ఈ తొమ్మది నిధులు ఐశ్వర్యానికి ప్రతీక. ఈ నిధుల ద్వారా భూ, జల, లోహ సంపదలు లభిస్తాయి...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Bigg Boss Telugu Day 70 Promo : భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
Advertisement

వీడియోలు

Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
VARANASI Trailer Decoded | Mahesh Babu తో నీ ప్లానింగ్ అదిరింది జక్కన్నా SS Rajamouli | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Bigg Boss Telugu Day 70 Promo : భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
Viral Video: మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్
మేనేజర్‌ను బట్టలూడదీసి దారుణంగా కొట్టిన హోటల్ ఓనర్ అరెస్ట్.. కారణం తెలిస్తే షాక్
Indian Rupee vs World Currencies : ఇండియన్ రూపాయి బలంగా ఉన్న దేశాలు ఇవే.. అక్కడ లక్షరూపాయలు మూడు కోట్లంత విలువ
ఇండియన్ రూపాయి బలంగా ఉన్న దేశాలు ఇవే.. అక్కడ లక్షరూపాయలు మూడు కోట్లంత విలువ
Hyundai Venue లేక Kia Syros, ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ? కొనే ముందు ఇవి తెలుసుకోండి
Hyundai Venue లేక Kia Syros, ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ ? కొనే ముందు ఇవి తెలుసుకోండి
Adilabad Protest: ఈ నెల 21న ఆదిలాబాద్, బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధం: మాజీ మంత్రి జోగురామన్న
ఈ నెల 21న ఆదిలాబాద్, బోరజ్ జాతీయ రహదారి దిగ్బంధం: మాజీ మంత్రి జోగురామన్న
Embed widget