Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Mahindra XEV 9e Launched: మహీంద్రా భారతదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. అదే మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ. దీని ఎక్స్ షోరూం ధర రూ.21.9 లక్షల నుంచి మొదలవనుంది.
Mahindra XEV 9e On Road Price: మహీంద్రా మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ కారు మనదేశంలో లాంచ్ అయింది. అదే మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ. దీని ఎక్స్ షోరూం ధర రూ.21.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ 2025 జనవరిలో డీలర్‌షిప్‌లకు చేరనుంది. డెలివరీలు కూడా అప్పుడే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీని పొడవు 4.7 మీటర్లకు పైగానే ఉండనుంది. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈకి మార్కెట్లో ప్రస్తుతం ఎటువంటి డిమాండ్ లేదు. టాటా హారియర్ ఈవీ వస్తే దీనికి పోటీ మొదలవుతుందని అనుకోవచ్చు.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఇంగ్లో ఎలక్ట్రిక్ వెహికిల్ ఆర్కిటెక్చర్‌పై బేస్ అయి ఉంది. 59 కేడబ్ల్యూహెచ్ లేదా 79 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌లతో ఇది మార్కెట్లోకి వచ్చింది. వీటిలో 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌తో 656 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. 59 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ఎంత రేంజ్‌ను అందించనుందో తెలియరాలేదు.
Also Read: రూ.80 వేలలోపు బెస్ట్ స్కూటీలు ఇవే - హోండా, హీరో, టీవీఎస్, ఎలక్ట్రిక్ కూడా!
ఈ రెండు బ్యాటరీలు ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనున్నాయి. 175 కేడబ్ల్యూ ఛార్జింగ్ స్పీడ్‌ను డెలివర్ చేసే డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో వీటికి ఛార్జింగ్ పెట్టవచ్చు. ఈ ఛార్జర్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ పెట్టవచ్చని కంపెనీ అంటోంది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈలో 210 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను కంపెనీ అందించింది. కేవలం 6.8 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని కంపెనీ అంటోంది. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ లోపలి భాగంలో మూడు స్క్రీన్ల లే అవుట్‌ను అందించారు. ఏకంగా 12.3 అంగుళాల సైజున్న మూడు డిస్‌ప్లేలను కారు లోపల చూడవచ్చు.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ క్యాబిన్ హైలెట్స్ చూసుకుంటే... మహీంద్రా లోగో ఉన్న ట్విన్ స్పోక్ స్టీరింగ్ వీల్ చూడవచ్చు. ఏకంగా 16 స్పీకర్ల ఆడియో సిస్టం, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ పార్కింగ్, ఏడీఏఎస్ సేఫ్టీ సూట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు.
Also Read: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Love comes in countless shades, what's your pick?
— Mahindra Electric Origin SUVs (@mahindraesuvs) November 27, 2024
BE 6e - Desert Myst, Everest White Satin, Tango Red, Firestorm Orange & More.
XEV 9e - Tango Red, Everest White, Desert Myst & More.
Know more: Link in Bio.#UnlimitLove #UnlimitIndia #MahindraElectricOriginSUVs #BE6e #XEV9e… pic.twitter.com/5glNcsgy8u
It's time for the nation's best auto and tech experts to Unlimit Love for India's two new icons -
— Mahindra Electric Origin SUVs (@mahindraesuvs) November 27, 2024
BE 6e and XEV 9e.
Day 2 of #UnlimitIndia flags off in style.#UnlimitIndia #UnlimitLove #MahindraBE6e #MahindraXEV9e #MahindraElectricOriginSUVs #MahindraAuto pic.twitter.com/SdJvgPkPBI