అన్వేషించండి

Hanuman Jayanti 2024: హనుమాన్ సినిమాలో పాట రూపంలో వచ్చే 'రామదూత స్తోత్రం' ఇదే - చాలా పవర్ ఫుల్!

తేజస్వి , బలశాలి , బుద్ధిమంతుడు , పరాక్రమవంతుడు అయిన ఆంజనేయుడి గురించి హనుమాన్ మూవీలో ఓ పాట ఉంది. అది పాట కాదు.. పాటరూపంలో మలిచిన రామదూత స్తోత్రం.

Hanuman Jayanti 2024:  అంజనా దేవి - కేసరి సంతానం ఆంజనేయుడు..వాయుపుత్రుడు ఆంజనేయుడు..రుద్రాంశ సంభూతుడు ఆంజనేయుడు.. ఇంతకీ హనుమాన్ జన్మరహస్యం ఏంటి? పురాణాల్లో ఏముంది...

శివపురాణంలో ఏముందంటే..
రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో పరమేశ్వరుడు తన వీర్యాన్ని స్కలనం చేశాడు. దాన్ని సప్తర్షులు అంజనాదేవి చెవిద్వారా ప్రవేశపెట్టారు. అలా రుద్రుడి అంశగా మహాబల పరాక్రమాలుగల వానరదేహంతో ఆమెకు జనించాడని చెబుతారు..అందుకే  శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ: అని శివమహాపురాణంలో ఉంది..తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల...ఆంజనేయుడిని శివావతారుడిగా కీర్తిస్తారు.

Also Read: పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!

పరాశర సంహితలో
శంకరుడి పదకొండో అవతారమే హనుమంతుడు అని పరాశర సంహిత చెప్పింది..త్రిపురాసుర సంహారంలో శ్రీ మహావిష్ణువు శివుడికి సహకరించడం వల్ల అందుకు కృతజ్ఞతగా త్రేతాయుగంలో రాముడికి సహాయం చేసేందుకు హనుమంతుడిగా వచ్చాడని చెబుతారు. రాక్షస సంహారం కోసం శ్రీ మహా విష్ణువు సూచనల మేరకు త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. శివుడి వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నికి.. అగ్ని వాయుదేవుడికి ఇస్తాడు. దానిని ఓ పండుగా మలిచి...పుత్రుడి కోసం తపిస్తోన్న అంజనాదేవికి ఇస్తాడు వాయుదేవుడు. అలా గర్భందాల్చిన అంజనాదేవి వైశాఖ బహుళ దశమి రోజు ఆంజనేయుడికి జన్మనిచ్చింది.  

భక్తులంతా ఆంజనేయుడిని మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా స్తుతిస్తారు. ఇవన్నీ కలిపినదే రామదూత స్తోత్రం...

Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!

రామదూత స్తోత్రం (Sri Ramadootha Stotram)

రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం
రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రమ్ |
రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యం
రం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి ||  

ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశమ్ |
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి ||  

ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధియోగం నతజనసదయం ఆర్యపూజ్యార్చితాంగమ్ |
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆదిఅంత్యప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి || 

సం సం సం సాక్షిభూతం వికసితవదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయమ్ |
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్యతత్త్వస్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి ||  

హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశినయనం రమ్యగంభీరభీమమ్ |
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాళం
హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామి ||  

ఇతి శ్రీ రామదూత స్తోత్రమ్ ||

Also Read: ఏప్రిల్ 23 నుంచి జూన్ 01 వరకూ ఈ పారాయణం చేయండి - ఫలితం మీరు ఊహించలేరు!

Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
Anganwadi notification: మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్‌
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్‌
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Embed widget