Female Hanuman Temple: స్త్రీ రూపంలో రామభక్తుడు - ప్రపంచంలో ఇలాంటి ఆలయం ఇదొక్కటే!
Female Hanuman Temple: రామభక్తుడైన ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారి..అలాంటి స్వామి స్త్రీ రూపంలో కనిపించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇంతకీ ఎక్కడుందా ఆలయం? హనుమంతుడు స్త్రీ రూపంలో ఎందుకు కొలువయ్యాడు?
Girjabandh Female Hanuman Temple: మహేశ్వరుడి తేజస్సు..వాయుదేవుడి అంశతో అంజనాదేవి గర్భాన జన్మించాడు కేసరీనందనుడు. త్రేతాయుగంలో శ్రీరామంచంద్రుడిగా జన్మించిన మహావిష్ణువు ప్రయాణంలో హనుమంతుడికి కీలకపాత్ర. సాధారణంగా భక్తి 9 రకాలు అని చెబుతారు..వాటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు (శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం,అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం). ఇందులో ఏదో ఒక విధానంలో దేవుడిపై భక్తిని ప్రదర్శిస్తారు. కానీ ఆంజనేయుడు రాముడిపై చూపించేందుకు భక్తిమార్గాల్లో దేనినీ వదలిపెట్టలేదు.ఈ తొమ్మిది మార్గాల్లోనూ తన భక్తిని ప్రదర్శించాడు. ఆ భక్తే చిరంజీవిగా మార్చింది. అయితే ఆ జన్మ బ్రహ్మచారిగా చిన్నారులకు సూపర్ హీరోగా...భక్తుల భయాలను తరిమేసే భగవంతుడిగా పూజలందుకునే ఆంజనేయుడు...ఓ ఆలయంలో స్త్రీ రూపంలో దర్శనమిస్తున్నాడు...ప్రపంచం వ్యాప్తంగా ఇలాంటి ఆలయం ఇదొక్కటే కావడం విశేషం...
Also Read: ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం రోజే 'రంభా వ్రతం' - ఏంటీ పూజ , విశిష్టత ఏంటి!
హనుమంతుడికి ముక్కుపుడక
హనుమంతుడు స్త్రీ రూపంలో దర్శనమిచ్చే ఆలయం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం రతన్ పూర్ జిల్లా గిర్జబంద్ లో ఉంది. ఇక్కడ హనుమాన్ ని దేవతా రూపంలో పూజిస్తారు భక్తులు. భక్తితో నమస్కరించి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందట. సీతారాములను భుజాలపై మోసే హనుమంతుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే స్త్రీ రూపంలో ఆంజనేయుడు కొలువుతీరడం వెనుక ఓ కథనం ప్రచారంలో ఉంది. ఒకానొక సమయంలో పృథ్వీ దేవరాజ్ అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన హనుమాన్ భక్తుడు. ఆయన కుష్టురోగం బారిన పడతాడు...ఎన్ని వైద్యాలు చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఇక ప్రాణంతీసుకోవాలనే ఆలోచనలకు వచ్చాడు. ఆ రోజు కలలో కనిపించిన ఆంజనేయుడు తనకు మందిరం నిర్మించాలని చెప్పాడట...దీంతో తన ఆలోచన విరమించుకుని ఆంజనేయుడికి ఆలయం నిర్మించాలని..అందుకు విగ్రహాన్ని చెక్కాలని ఆదేశించాడు. ఆ తర్వాత మళ్లీ కలలో కనిపించిన హనుమంతుడు..తన విగ్రహం ఇక్కడికి దగ్గర్లో ఉన్న మహామాయ అనే కొలనులో ఉందని దీనినే ప్రతిష్టించాలని చెప్పాడు. ఆ సరస్సు వద్దకు వెళ్లిచూడగా దానికి ముక్కుపుడక కనిపించింది..అంతేకాదు మొత్తం రూపమే స్తీ లా ఉంది. అయినప్పటికీ ఆంజనేయుడి ఆదేశానుసారం ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి దేవాలయంలో ప్రతిష్టించారు.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
దక్షిణ ముఖంగా స్వామివారు
ఈ ఆలయంలో స్వామివారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తున్నాడు. ఇక్కడ రామ, లక్ష్ణణులను దర్శించుకోవచ్చు ఆంజనేయుడి కాళ్ల కింద ఇద్దరు రాక్షసులు ఉంటారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత ఆ రాజు కుష్టురోగం పూర్తిగా మాయమైపోయింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే రోగాలు పూర్తినా సమసిపోతాయని భక్తులకు ఓ నమ్మకం. స్త్రీ రూపంలో దర్శనమిచ్చే హనుమాన్.. వివాహంలో ఉండే సమస్యలు, సంతానంకోసం తపించేవారి కోర్కెలు అన్నీ నెరవేరుస్తాడని విశ్వాసం. ఇదంతా నిజం అని చెబుతూ ఉపశమనం పొందిన భక్తులంతా స్వయంగా చెబుతారు. ఈ దేవాలయానికి దగ్గర్లోనే కాలభైరవ మందిరం , లక్ష్మీదేవి ఆలయం కూడా ఉన్నాయి..
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!