Rambha Tritiya 2024 Date : ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం రోజే 'రంభా వ్రతం' - ఏంటీ పూజ , విశిష్టత ఏంటి!
Rambha Tritiya Vrat 2024: జూన్ 09 ఆదివారం ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ రోజుకి చాలా విశిష్టత ఉంది. వాటిలో ఒకటి రంభా వ్రతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రంభావ్రతం విశిష్టత ఇదే
Rambha Tritiya 2024:'రంభా వ్రతం' ఈ పేరు వినగానే ఇంద్రలోకంలో అప్సరస గుర్తుకువచ్చిందా? అయితే ఆ రంభ గురించి కాదు..సంస్కృతంలో అరటి చెట్టును రంభా వృక్షం అంటారు.. ఆ చెట్టుకి చేసేదే రంభావ్రతం. ఈ పూజ పరమేశ్వరుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి పూజించిందని పురాణాల్లో ఉంది.జ్యేష్ట శుద్ధ తదియ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే జ్యేష్టమాసం ప్రారంభమైన మూడో రోజు...
రంభా వ్రతం ఎందుకు చేస్తారు
జ్యేష్ట శుద్ధ తదియ రోజున రంభా వ్రతం , రాజ్య వ్రతం, త్రివిక్రమ తృతీయా వ్రతం అనే మూడు వ్రతాలను ఆచరిస్తారు. అయితే రంభా వ్రతం మాత్రమే ఇప్పుడు ఆచరణలో ఉంది. ఇది కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కన్నా ఉత్తరాదిన ఘనంగా జరుపుకుంటారు. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం అయ్యేందుకు, సంసార జీవితంలో కలతలు తొలగించేందుకు, అవివాహితులకు మంచి భర్త లభించాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని మొదట పార్వతీదేవి ఆచరించింది. పరమేశ్వరుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి ఎన్నో ప్రయత్నాలు చేసింది.. అవన్నీ విఫలం అవడంలో బాధలో కూరుకుపోయిన పార్వతీదేవికి భృగుమహర్షి సూచించిన వ్రతం ఇది.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!
వ్రత విధానం
ఆ వ్రతం ఎలా ఆచరించాలి? ఎప్పుడు ఆచరిచాలి? అని పార్వతీ దేవి అడిగిన ప్రశ్నకు సమధానంగా.. భృగుమహర్షి ఇలా చేప్పారు. ఈ వ్రతాన్ని ప "రంభా వ్రతం" అంటారు. అంటే అరటిచెట్టుకి చేసే వ్రతం. జ్యేష్ట శుద్ధ తదియ రోజు వేకువజామునే నిద్రలేచి స్నానమాచరించి ఇంట్లో భగవంతుడికి నమస్కరించాలి. అనంతరం అరటిచెట్టు మొదలు దగ్గర అలికి ముగ్గులు పెట్టాలి అరటిచెట్టుకి అధిష్టాన దేవత అయిన సావిత్రిదేవికి పూజ చేయాలని సూచించారు భృగుమహర్షి.
అరటిచెట్టుకి సావిత్రి అధిదేవత ఎలా అయింది!
సావిత్రి, గాయత్రిలలో బ్రహ్మపట్ల సావిత్రీదేవి నిర్లక్ష్యంగా ఉండేదట. ఆగ్రహించిన బ్రహ్మదేవుడు బీజం లేని వృక్షంలా భూలోకంలో పడిఉండమని శపించాడట. అలా సావిత్రీదేవి అరటిచెట్టుగా ఉద్భవించి...తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించింది. తిరిగి ఆమెను సత్యలోకానికి ఆహ్వానించిన బ్రహ్మదేవుడు సావిత్రి అంశని మాత్రం అరటిచెట్టులో ఉంచాడు. అందుకే అరటి చెట్టుకి కోరిన కోర్కెలుతీర్చే శక్తి లభించిందని చెబుతారు. లోపాముద్ర కూడా ఈ వ్రతాన్ని ఆచరించి అగస్త్యమహర్షిని భర్తగా పొందిందని పార్వతికి వివరించారు భృగుమహర్షి.
Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
రంభా వ్రతం చేసిన పార్వతీ దేవి
భృగు మహర్షి సూచనలు పాటిస్తూ జ్యేష్ట మాసంలో పౌర్ణమి ముందు వచ్చే తదియ రోజు అరటిచెట్టు మొదలు వద్ద శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టి సావిత్రీ దేవిని పూజించింది పార్వతీదేవి. జ్యేష్ట శుద్ధ తదియ రోజు నుంచి నెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేసింది పార్వతీదేవి. ఆ తర్వాత శివుడిని భర్తగా పొందిందని పురాణాలు చెబుతున్నాయి. వైవాహిక జీవితంలో సమస్యలున్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే జీవితం చక్కబడుతుంది. పెళ్లికానివారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమభర్త లభిస్తాడని విశ్వాసం...