Ear piercing for men: మగవారికి చెవులు కుట్టించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?
Ear piercing for men: మగవాళ్లు చెవులు కుట్టించుకోవడం ఇప్పుడు ట్రెండ్. అయితే జ్యోతిష్యపరంగా దీని వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందామా?
Ear piercing for men: హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు గాజులు, చెవిపోగులు, చీరలు, కుంకుమ పెట్టుకోవడం సహజం. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా చెవిపోగులు ధరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడిదే ట్రెండ్ అంటున్నారు. చెవులు కుట్టించుకోవడం కేవలం అమ్మాయిలకు మాత్రమే పరిమితం కాదని..అబ్బాయిలు కూడా ఎప్పటినుంచే చెవులకు చెవిపోగులు ధరిస్తున్నారంటున్నారు. ఒకప్పుడు రాజులు సైతం చెవిపోగులు ధరించేవారు. ఈ ట్రెండ్ ను ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా కనిపించేలా డ్రెస్సులు వేసుకోంటున్నారు. అయితే మగవారికి సహజంగా కోపం ఎక్కువగా ఉంటుంది. అలా చెవిలోని నరంలో పోగులు గుచ్చుకుంటే కోపం తగ్గుతుందని పలువురి అభిప్రాయం. అయితే మగవారు చెవులు కుట్టించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? జ్యోతిష్యం ప్రకారం మగవారికి చెవులు కుట్టించడం వల్ల కలిగే 7 అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మగవారికి చెవులు కుట్టించడం వల్ల కలిగే ప్రయోజనాలు :
ఏకాగ్రత పెరుగుతుంది:
కొన్ని సంప్రదాయాల ప్రకారం, చెవులు కుట్టించుకున్న మగవారు చాలా షార్ప్ గా స్పష్టంగా ఉంటారట. ఇది జీవితంలో దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్ని పెంచుతుంది. వాస్తవానికి, అనేక సంస్కృతులు.. చెవి కుట్టించుకునే మగవారిని దార్శనికునిగా పరిగణిస్తాయి. వారు తమ అభిరుచులను పూర్తిగా స్వీకరించడానికి కూడా ప్రసిద్ధి చెందారు. చెవి కుట్టించుకున్న అబ్బాయిలు త్వరగా పరిపక్వం చెందడానికి సహాయపడతాయని చెబుతుంటారు. ఇతర పిల్లలతో పోలిస్తే వారి వయస్సుతో పోలిస్తే, వారు తమ జీవితాన్ని త్వరగా అర్థం చేసుకుని ముందుకు సాగుతారని చెబుతుంటారు.
స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుందట :
పురుషులు చెవులు కుట్టించుకుంటే స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుందట. పురుషులకు చెవి కుట్టడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల్లో ఇది ముఖ్యమైనది.
మానసిక ధైర్యం:
మగవారికి చెవి కుట్టడం అనేది పవిత్రమైన శబ్దాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందట. ఒకరి ఆత్మను అభివృద్ధి చేసి, పాపం నుంచి దూరంగా ఉండటానికి ఒకరి ఆత్మను శుద్ధి చేస్తుందని భావిస్తారు. చెవిలో బంగారం లేదా రాగిని ధరించడం వల్ల శరీరానికి సంబంధించి సహజ విద్యుత్ ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది.
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:
అలర్జీలు, మైగ్రేన్‌లను తగ్గించి ఆక్యుప్రెషర్ థెరపీ కోసం చెవులు కుట్టడం ప్రయోజనకరమని పేర్కొంది. అంతేకాదు కంటి చూపు కూడా మెరుగవుతుంది.
మెరుగైన నిర్ణయాధికారం :
అనేకమంది భారతీయ వైద్యులు చెవిపోగులు ధరించడం, చెవులు కుట్టడం ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు, వారు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.
ప్రతికూలతను తొలగిస్తుంది:
నాడీ వ్యవస్థను శుద్ధి చేయడం ద్వారా, ఇది మనస్సు నుంచి చెడు ఆలోచనలను తొలగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.