Mistakes on Friday: శుక్రవారం ఇలాంటి తప్పులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది
Rules To Follow On Friday: సంపద, శ్రేయస్సు కోసం శుక్రవారం లక్ష్మీపూజ చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి. శుక్రవారం కొన్ని పనులు చేస్తే మాత్రం దరిద్రం తప్పదు. ఈ రోజు చేయకూడని తప్పులు ఏంటో తెలుసా?
![Mistakes on Friday: శుక్రవారం ఇలాంటి తప్పులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది do not do these mistakes on friday otherwise you may face money problem and poverty Mistakes on Friday: శుక్రవారం ఇలాంటి తప్పులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/30/17a7b68affad22190ef37336d5337eb61688086665021691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rules To Follow On Friday: మత గ్రంధాల ప్రకారం, సంపదను అనుగ్రహించే దేవత అయిన లక్ష్మీ దేవికి అంకితం చేయబడిన రోజు శుక్రవారం. ఐశ్వర్యం, కీర్తి కోసం ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించాలి. ఇది ఆమెను సంతోషపరుస్తుంది. చాలా ఇళ్లలో, ప్రజలు ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని, సంతోషి మాతను పూజిస్తారు. ఫలితంగా లక్ష్మీ దేవి పూర్తి అనుగ్రహాన్ని పొందుతారు. హిందూ సంస్కృతిలో ఈ రోజు కొన్ని ప్రత్యేక పనులు చేయడం నిషేధించారు. ఆ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందువల్ల ఈ రోజు మీరు చేసే పూజల పూర్తి ప్రయోజనం మీకు దక్కకుండా చేస్తుంది. కాబట్టి, శుక్రవారం చేయకూడని పనులు ఏమిటో తెలుసుకోండి.
Also Read : లక్ష్మీదేవి ఇలాంటి ఇళ్లలో ఎప్పటికీ ఉండదు!
ఇంట్లో అపరిశుభ్రత
ముఖ్యంగా శుక్రవారాల్లో మీ ఇంటిని అపరిశుభ్రంగా ఉంచవద్దు. ఇంట్లో మురికి, చెత్త ఉంటే శుక్రవారం నాడు శుభ్రం చేయాలి. ఎవరి ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది.
ఈ ఆహారం తీసుకోవద్దు
శుక్రవారం నాడు పుల్లని ఆహారం తినకూడదు. లక్ష్మీదేవికి ఎప్పుడూ పులుపు ఇష్టం ఉండదు. ఈ రోజు మీరు మిఠాయిలను ఉపయోగించడం మంచిది. శుక్రవారం లక్ష్మీదేవికి తీపి పదార్థాలు కూడా సమర్పించి, మీరు కూడా తీసుకోవాలి. అలా చేయడం ద్వారా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. శుక్రవారం నాడు మాంసాహారం, మద్యం సేవించడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ శుక్రవారం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
అప్పు ఇవ్వడం, తీసుకోవడం
శుక్రవారాన్ని లక్ష్మీ దేవి రోజుగా పరిగణిస్తారు. కాబట్టి, ఈ రోజు మీరు ఎవరి దగ్గరా అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు. ఈ రోజు డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది.
చక్కెర ఇవ్వవద్దు
ఈ రోజున ఎవరికైనా చక్కెర అప్పుగా ఇవ్వవద్దు. పొరుగువారు చక్కెర అడగడానికి వచ్చినప్పుడు ఇవ్వకండి. ఈ రోజు చక్కెర ఇస్తే మీ జన్మ కుండలిలో శుక్రుడిని బలహీనపరుస్తుంది, ఇంట్లో పేదరికం, డబ్బు సమస్యలకు కారణమవుతుంది.
స్త్రీలను అవమానించవద్దు
శుక్రవారం రోజు ఏ స్త్రీని అవమానించకూడదు. ఎందుకంటే మనం ఇలాంటి తప్పులు చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది. మీరు ఈ తప్పు చేస్తే, మీరు పేదరికం రూపంలో పర్యవసానాలను అనుభవించవచ్చు. కాబట్టి శుక్రవారం రోజున మీరు మీ ఇంటి మహిళను లేదా మరే ఇతర స్త్రీని అవమానించకూడదు.
ఎవరినీ నొప్పించవద్దు
శుక్రవారం ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి. అంతేకాదు.. ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడకండి. గొడవలు, చెడ్డ మాటలు మాట్లాడితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈ రోజు మొత్తం ఎవరినీ నొప్పించే, బాధ కలిగించే పదాలు మీ నోటి వెంట రాకుండా చూసుకోవాలి.
Also Read : శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)