Friday Special: శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!
Friday Special: మంత్రాలతో లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. అందుకే ఆ సిరుల తల్లి పూజలో లక్ష్మీ మంత్రాలను పఠించడం చాలా ప్రయోజనకరం. శుక్రవారం ఏ లక్ష్మీ మంత్రాలను పఠించాలి?
Friday Special: శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అని మనందరికీ తెలుసు. ఈ రోజు లక్ష్మీ దేవిని పూజించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. మత గ్రంధాల ప్రకారం, శుక్రవారాలు ఉపవాసం ఉండి, లక్ష్మీ దేవిని పూజించాలని చెబుతారు. ఇది మీరు చేపట్టిన పనులన్నీ సమయానికి పూర్తయ్యేలా చేయడంతో పాటు సంపద పెరిగేలా చేస్తుందని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం ద్వారా, లక్ష్మీ దేవి భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుందని నమ్ముతారు. మరోవైపు, మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే లేదా శుక్రుడు దోషపూరితంగా ఉంటే, మీరు ఈ రోజున లక్ష్మీ పూజ చేయాలి. జీవితంలో మీ సమస్యలన్నీ తొలగిపోవాలంటే శుక్రవారం రోజు ఏ లక్ష్మీ మంత్రాన్ని పఠించాలి..?
Also Read : లక్ష్మీదేవికి 8 రూపాలు ఎందుకు, వాటి వెనుకున్న విశిష్టత ఏంటి!
శుక్రవారం పఠించాల్సిన ప్రభావవంతమైన లక్ష్మీ మంత్రాలు, లక్ష్మిని మంత్రాలతో పూజిస్తే తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. ఇదిగో లక్ష్మీ మంత్రాలు
1. లక్ష్మీ బీజ మంత్రం
"ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయా
ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః||''
ఇది లక్ష్మీ దేవి బీజ మంత్రం. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే, తామర గింజల జపమాలతో, ఈ మంత్రాన్ని జపించండి.
2. శ్రీ లక్ష్మీ మహామంత్రం
"ఓం శ్రీం క్లీం మహాలక్ష్మీం మహాలక్ష్మి ఏహ్యేహి
సర్వ సౌభాగ్యం దేహి మే స్వాహా ||''
ఈ మంత్రాన్ని లక్ష్మీదేవి మహామంత్రం అంటారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఐశ్వర్యం, యశస్సు, అదృష్టం కలుగుతాయి. శుక్రవారం నాడు ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఈ మంత్రాన్ని జపిస్తూ నువ్వులనూనె దీపం వెలిగించడం శుభప్రదమని పెద్దలు చెబుతారు.
3. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కోసం
"ఓం హ్రీం శ్రీ క్రీం క్లీం
శ్రీ లక్ష్మీ మమ గృహే ధన పూరాయే, ధన పూరాయే
చింతయా దూర దూర స్వాహా ||''
మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే, ఈ మంత్రాన్ని పఠించండి. ఇది మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది.
4. ఆనందం, శ్రేయస్సు కోసం
యా రక్తాంబుజవాసినీ విలాసినీ ఛన్దశు తేజస్వినీ|
యా రక్త రుధిరాంబర హరిశాఖీ యా శ్రీ మనోళాదినీ||
యా రత్నాకరమంథానాత్ప్రగతితా విష్ణోస్వయ గేహినీ|
సామాంపాతు మనోరమా భగవతీ లక్ష్మీశ్చ పద్మావతీ||
మీరు శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించిన తర్వాత పైన పేర్కొన్న లక్ష్మీ మంత్రాలను చదవాలి. ఈ మంత్రాలు మీకు ఐశ్వర్యం - ధన, ధాన్యాలతో పాటు జీవితంలో సుఖ సంతోషాలను లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని అందిస్తాయి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.