చాణక్య నీతి: ఇలాంటి పరిస్థితుల్లో పారిపోకుంటే ప్రాణాలు పోతాయ్!
ఆచార్య చాణక్య నీతి మనకు క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడే మార్గాన్ని చూపుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా పరిష్కారం కనుగొనాలో ఈ నీతిశాస్త్రంలో చక్కగా వివరించారు.
4 రకాల బాధలను ఎదుర్కొనే బదులు అక్కడి నుంచి పారిపోవడమే మంచిదని చాణక్యుడు చెప్పాడు. ఆ పరిస్థితులను ఎదుర్కొంటుంటే చిక్కుకోవచ్చు లేదా మరణించవచ్చని హెచ్చరించాడు..
హింస హింస చెలరేగితే, అల్లర్లు జరిగితే వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని చాణక్యుడు చెప్పాడు. విపత్తుల సమయంలో, గుంపులుగా ఉన్నప్పుడు అదుపు తప్పుతుంది. ఇలాంటి సమయంలో ఎప్పుడైనా దాడి జరగవచ్చు, అటువంటి పరిస్థితిలో ప్రాణాల కోసం పరిగెత్తడం తెలివైన పని.
2. ప్రతీకారం ఇతర దేశాల రాజులు మన దేశంపై దాడి చేసినప్పుడు దేశం విడిచిపెట్టడం మంచిది. లేకపోతే మీరు దెబ్బతినే అవకాశం ఉంది. నేటి ఆధునిక సమాజంలో, శత్రువు మనపై దాడి చేస్తే వెంటనే పారిపోవడమే మంచిది. ఎందుకంటే వ్యూహం లేకుండా వెంటనే ఎదుర్కోలేరు.
3. క్షీణించిన ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ క్షీణించిన ప్రదేశాన్ని వదిలివేయడం మంచిది. అటువంటి ప్రదేశంలో ప్రజలు ఆహార పానీయాలు, జీవిత వనరుల కోసం ఆరాటపడతారు. అలాంటి ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండడం వల్ల మీకు, మీ కుటుంబానికి హాని కలుగుతుంది.
4. అపరాధి ఒక నేరస్థుడు మీ దగ్గరికి వస్తే, ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవడమే మంచిదని చాణక్యుడు చెప్పాడు. ఇది మీ ప్రతిష్ఠపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. లేదంటే నేరస్థుడు చేసిన తప్పులకు మీరు మూల్యం చెల్లించాల్సి రావచ్చు.
ఆచార్య చాణక్యుడి ప్రకారం, పైన పేర్కొన్న 4 స్థానాల్లో ఎప్పుడూ ఉండకూడదు. అలాంటి ప్రదేశాల్లో ఉండటం వల్ల మన జీవితాలు నష్టపోవచ్చు, లేదా మనం చేయని తప్పులకు శిక్ష అనుభవించవచ్చు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.