చాణక్య నీతి: ఆడంబరం కూడా అవసరమే!



నిర్విషేణాపి సర్పేణ కర్తవ్యా మహతీ ఫణా ।
విషమస్తు న చాప్యస్తు ఘటాటోపో భయంకరః ॥



ఆడంబరం గురించి ప్రస్తావిస్తూ ఆచార్య చాణక్యుడు చెప్పిన శ్లోకం ఇది



విషంలేని పాముకూడా పడగవిప్పాలి అంటూ ఆడంబరం గురించి వివరించాడు



పాములో విషం ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది కానీ తల పైకెత్తితే తప్పకుండా భయపడతారు



విషంలేని పాము కూడా తనని తాను రక్షించుకునేందుకు పడగవిప్పక తప్పదు



సమాజంలో బతకడానికి డాంబికం ప్రదర్శించక తప్పదంటాడు చాణక్యుడు



ఆడంబరం, డాంబికం, కోపం ఉండడం కూడా కొన్ని సందర్భాల్లో మంచిదే అన్నది చాణక్యుడు అభిప్రాయం



Disclaimer: కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest