ఈ వస్తువులను చేతికి అందుకుంటే శని వదలదు



ఉప్పు (salt)
ఉప్పు గురించి హిందూ ధర్మం లో చాలా వివరణే ఉంది. దశదానాల్లో ఉప్పు ఒకటి. పిత్రు దానాలలో, శని దానాలలో ఉప్పుని దానం చేస్తూ ఉంటారు. అందుకే పూజల దగ్గర ఉప్పుని దూరంగా ఉంచుతారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులు పోతాయని కూడా విశ్వసిస్తారు.



ఉప్పందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునేవారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటారు



నువ్వులు ( Sesame seeds)
నల్ల నువ్వులను కూడా శని దోషాలు తొలగించుకునేందుకు దానంగా వినియోగిస్తారు. అందుకే ఎప్పుడూ నల్ల నువ్వులు ఉచితంగా తీసుకోవడం కానీ, ఒకరి చేతినుంచి మరొకరు అందుకోవడం కానీ చేయకూడదు.



ఇనుము (iron)
ఇనుమును లేదా ఇనుము తో తయారు వస్తువులను కూడా దానం గా తీసుకోకూడదంటారు పండితులు. ఒకవేళ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినా.. దానికి ఎంతో కొంత డబ్బు చెల్లించి తీసుకోవాలి. ఎందుకంటే ఇనుము కూడా శనికి చిహ్నంగా చెబుతారు. అంటారు.



నూనె (oil)
నూనెను ఎవ్వరి చేతికీ ఇవ్వకూడదు. ఉచితంగా ఇవ్వకూడదు, ఉచితంగా తీసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ఎంతో కొంతడబ్బు చెల్లించి నూనె తీసుకోవాలి కానీ ఉచితంగా తీసుకుంటే వారింట శని మీ ఇంట్లో అడుగుపెడుతుందని విశ్వసిస్తారు.



ఉప్పు, నూనె, నువ్వులు వంటివి చేతికి సరాసరి తీసుకోవడం వల్ల కొంత అసౌకర్యం ఉంటుందని అలా చెప్పారు కానీ ఎలాంటి దోషం ఉండదంటారు మరికొందరు పండితులు.



ఉప్పుకారాలు అంటిన చేయి కంటికి తగిలితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక నూనె జిడ్డు పదార్థం. జారిపోయే అవకాశం ఉంటుంది. ఈ దృష్టితో ఈ వస్తువులను నేరుగా చేతికి అందుకోరాదంటారు కానీ ఏదో జరిగిపోతుందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతారు.



గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.



Image Credit: Pinterest