మనిషి చేసే 10 రకాల పాపాలు ఇవే



అన్ని పాపాలూ తెలిసే చేయరు..తెలియకుండా చేసినవీ ఉంటాయి. నిత్య జీవితంలో ఎప్పుడో అప్పుడు ప్రతి ఒక్కరు 10 రకాల పాపాలు చేస్తారు.



వీటినే దశపాపాలు అంటారు. శారీరక పాపాలు 3, వాచిక పాపాలు 4, మానసికంగా చేసే పాపాలు 3



శారీరకంగా చేసే పాపాలు మూడు. 1.అపాత్రదానం, 2. శాస్త్రం అంగీకరించని హింస, 3. పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం



వాచికంగా (నోటిద్వారా) చేసే పాపాలు నాలుగు... 1. పరుషంగా మాట్లాడడం, 2. అసత్యం పలకడం, 3. చాడీలు చెప్పడం, 4. సమాజం వినలేని భాషను ఉపయోగించడం.



మానసికంగా (మనస్సుద్వారా) చేసే పాపాలు మూడు.. 1.పర ద్రవ్యాన్ని దొంగిలించాలనే దుర్బుద్ధి, 2. ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, 3. వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం



ఈ పాపల నుంచి వచ్చే దుష్ఫలితాలు అనుభవించకుండా ఉండాలంటే కొన్ని ఉపశమనాలు సూచించాయి మన పురాణాలు. అలాంటి అవకాశమే ‘దశ పాపహర దశమీ వ్రతం’. జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే దశమినే దశపాపహర దశమిగా జరుపుకుంటారు



దశపాపహర దశమి రోజు గంగాస్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నింటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. అంతా కాశీ వెళ్లలేరు కాబట్టి నది, బావి, చెరువు, సముద్రం ఎక్కడైనా కానీ భక్తి శ్రద్ధలతో స్నానమాచరించాలి.



Images Credit: Pinterest