ఈ ప్రాంతం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఏమాత్రం అపరిశుభ్రత చేరినా చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఈశాన్యంలో టాయిలెట్ అసలు ఉండకూడదు. తెలియక ఒకవేళ నిర్మించినా వెంటనే తొలగించాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఈశాన్యంలో వంట గది ఉన్నాకూడా మంచిది కాదు. ఇది కూడా ఇంట్లో వ్యాధులు ప్రభలేందుకు కారణమవుతుంది.
వంటగది ఆగ్నేయానికి మార్చడం సాధ్యం కాదని అనుకుంటే గ్యాస్ సిలెండర్ కింద ఆకుపచ్చని టైల్ లేదా రాయిని పెట్టడం వల్ల కాస్త ఉపయోగం ఉండొచ్చు.
ఈశాన్యం మూసి ఉన్నట్టుగా ఎలాంటి కట్టడాన్ని కట్టకూడదు. గదులు నిర్మించకూడదు. ఈశాన్యం వైపున బయట కానీ, లోపల గానే మెట్లు ఉండకూడదు.
ఈశాన్యంలో బెడ్ రూమ్ కూడా ఉండకూడదు. ఈశాన్యంలో షూరాక్ కూడా ఉండకూదు, నైరుతి పడమర దిక్కులలో షూరాక్ ఉండాలి.
ఈశాన్యంలో పూజ గది ఉండాలి ,దేవుడి చిత్రపటాలు ఉండాలి, ప్రధాన ద్వారం ఈశాన్యంలో ఉంటే మంచిది.
ప్రధాన ద్వారానికి శుభ సూచికలు కలిగిన తోరణం అలంకరించాలి .ఈశాన్యం దిక్కు తేలికగా ఉండాలి. ఎలాంటి బరువులు ఉండకూడదు.
ఈశాన్యం మూల పెరిగి ఉన్న స్థలంలో ఇల్లు నిర్మిస్తే సకల సంపదలు కలుగుతాయని వాస్తు చెబుతోంది.
ఈశాన్యంలో తులసి మొక్క చాలామంచిది. ప్రతికూల శక్తులను నశింపజేసి సానుకూల శక్తులను ప్రసరింపజేస్తుంది.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి బాధ్యత తీసుకోదు.