గరుడ పురాణం: ఈ 4 పనులు చేస్తే నరకంలో మీకు నో ఎంట్రీ బోర్డు ఫిక్స్



మనిషి ఆనందంగా జీవించాలంటే ప్రతిరోజూ కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. ఈ పనులు చేసే వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయని గరుడ పురాణంలో ఉంది.



1.దాన‌ధ‌ర్మాలు
గరుడ పురాణం ప్రకారం, కచ్చితంగా మీ ఆహారంలో కొంత భాగాన్ని బీదలకు లేదా అభాగ్యుల‌కు ఇవ్వాలి. పేదలకు, అభాగ్యుల‌కు ఆహారం పంపిణీ చేస్తే మరణానంతరం పుణ్యలోకాలకు చేరుకుంటారు



2. గోసేవ
గరుడ పురాణం ప్రకారం గోసేవ చేయడం వల్ల కూడా పుణ్యం వస్తుంది. రోజూ గోసేవ చేసేవారికి సత్కార్యాలు పెరుగుతాయి. ఆవుకి రోజూ ఆహారం, నీరు ఇవ్వడం అలవాటు చేసుకోండి.



3. కులదైవం ఆరాధన
పూర్వీకులను, కులదైవాన్ని, దేవతలను పూజించాలని గరుడ పురాణం చెబుతోంది. అలాంటి వారిపై పూర్వీకులు, కుల‌ దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు.



4. జంతువులు-పక్షుల సేవ
శాస్త్రాల ప్రకారం ఇంట్లో చేసే మొదటి రొట్టె ఆవుకి, చివరి రొట్టె కుక్కకి పెట్టాలి



పక్షులకు ఆహారం, నీటిని ఏర్పాటు చేయడం, చేపలకు ఆహారం వేయ‌డం, చీమలకు పంచదార, పిండిని తినడానికి ఇవ్వడం కూడా ణ్యకార్యాలే.



గరుడ పురాణం ప్రకారం, జంతువులు, పక్షులకు సేవ చేసే వ్యక్తి జీవితంలో విజయం, ఆనందం, శ్రేయస్సు పొందుతాడు.



గరుడ పురాణం ప్రకారం పైన పేర్కొన్న పనులు రోజూ చేస్తే సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వీటిని రోజూ చేయలేకపోతే వారానికోసారి లేదా కనీసం నెలకోసారైనా చేయడం మంచిది.



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: ఈ నాలుగు తప్ప ప్రపంచంలో ఉన్నవన్నీ పనికిరానివే

View next story