గరుడపురాణం: ఇలాంటి బ్రాహ్మణుడితో చేయించుకునే పూజలు మంచి ఫలితాన్నివ్వవు
మన భారతీయ సంస్కృతిలో పూజ-పునస్కారం, హోమం-హవనం సర్వసాధారణం
ఇలాంటి పవిత్రకార్యక్రమాలను ఎవరంటే వారితో చేయించకూడదు
కొంతమంది బ్రాహ్మణులు పూజలు, హోమం చేయకూడదని స్పష్టంగా వివరించింది గరుడపురాణం
మంత్రవిద్య లేదా భూతవైద్యం చేసే బ్రాహ్మణులు యాగం, పూజ లేదా శ్రాద్ధ కర్మలు చేయకూడదు. వారిలో ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది
మేకలు మేపే బ్రాహ్మణుడు, బొమ్మలు గీసే బ్రాహ్మణుడు, బ్రాహ్మణ వైద్యుడు, జ్యోతిష్యంలో నిమగ్నమైన వారు కూడా పూజలు, హోమాలు చేయకూడదు
వేదాలు చదవని, వేదాల గురించి తక్కువ జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడిని పూజించకూడదు. వీరిలో కేవలం ధనాపేక్ష మాత్రమే ఉంటుందని గుర్తించాలి
ఇతరుల సంతోషానికి అసూయపడే, చెడు చేసే బ్రాహ్మణుడిని పూజ-పునస్కారాలు, హోమం-హవనాలకు ఎన్నుకోకూడదు. వీరివల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది
ఇతరుల సొమ్ము తీసుకునేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, విమర్శించేవాడు, హింసకు పాల్పడే వాడు పండితులు కాలేడంటోంది గరుడపురాణం
ధూమపానం, మద్యపానం, స్త్రీలోలుడైన బ్రాహ్మణుడితో చేయించుకున్న పూజలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవంటోంది గరుడపురాణం
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు