యమము అహింస చేయకపోవడం, నిజం చెప్పడం, దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యం, దేని మీదా అతి మమకారం లేకపోవడం..ఈ 5 గుణాలను అలవరచుకుంటే మెదడు స్వచ్ఛంగా ఉంటుంది.
నియమము యమముతో మనసు నిర్మలంగా ఉంటుంది. ఇక శరీరాన్ని శుద్ధి చేయడానికి తప్పని సరిగా ఆచరించాల్సిన ఆచారాలూ లేదా అలవాట్లు నియమ కిందికొస్తాయి.
ఆసనము పతంజలి యోగ సూత్రాల్లో అతి ముఖ్యమైనవి ఆసనాలు. ఈ ఆధునిక యుగంలో వీటి అవసరం చాలా ఉంది. ఆరోగ్యంగా, దృఢంగా ఉంటే అందం దానంతట అదే వస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యాలకు ఆసనాలు చాలా అవసరం.
ప్రాణాయామం శ్వాస దీర్ఘంగా తీసుకుని వదులుతూ మనసును లగ్నం చేయడమే ప్రాణాయామం. దీనివల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. శ్వాసకోశ అనారోగ్యాలు దరి చేరవు. మనసులో అలజడులు ఉండవు. కేంద్రీకరణ శక్తి పెరుగుతుంది.
ప్రత్యాహార ప్రత్యాహారం అంటే వస్తువుల నుంచి ఇంద్రియాలను దూరం చేయడం లేదా నియంత్రించడం. ఇంద్రియాలు బాహ్య ప్రపంచానికి కిటికీలు. వస్తువుల నుంచి పొందే అనుభూతులతో మనసుకు ఆహారాన్ని ఇస్తాయి. ఇంద్రియ ప్రేరణలను మనసు వాటిని స్వీకరిస్తుంది.
ధారణ ఇంద్రియ నిగ్రహం సాధ్యమయ్యాక మెదడుకు ఏకాగ్రత, కేంద్రీకరణశక్తి, ధారణ పెరుగుతాయి. ఏకాగ్రత అనేది మెదడు శక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. ఉన్నతాశయాల దిశగా సాగడంలో ధారణ సాయపడుతుంది.
ధ్యానం ధ్యానం అంటే ఆలోచనల మీద అదుపు. అనేక అంశాల మీదికి దృష్టి మళ్లకుండా ఒక దానిమీద కేంద్రీకరించడం నేర్చుకోగలిగితే అతుకులు లేని ఆలోచనల ప్రవాహం సాధ్యమవుతుంది.
సమాధి ఇక్కడ వస్తువూ ఆలోచనా ఒకటే. ఏకాగ్రత తర్వాతిదైన ఈ స్థితిలో శరీర మెలకువ స్థితి అంతర్థానమై మెదడు వస్తువుగా మారుతుంది. అది క్రమంగా ఉజ్జ్వల వెలుగుగా పరిణమిస్తుంది.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. (Images Credit: Pinterest)