నవగ్రహాలను దర్శించుకునివస్తే కాళ్లు కడుక్కోవాలా!



నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలనేది ఏ శాస్త్రం లోనూ లేదు. నవగ్రహాలకు బయట నుంచి తగలకుండా ప్రదక్షణలు చేస్తే ఎటువంటి కాళ్లు కడుగుకోవడం అవసరం లేదు.



అయితే శనిత్రయోదశి, ఇతర గ్రహబాధలు పోవడానికి రకరకాల పద్ధతులలో పూజలు చేస్తారు. ఆయా సందర్భాలలో సాన్నం చేయాల్సి ఉంటుంది.



మీ జాతకంలో ఎలాంటి దోషాలకు పూజలు చేయించుకున్నారో అక్కడున్న పండితులకు తెలుస్తుంది కాబట్టి వారు చెప్పిన నియమాలను పాటించడం మంచిది.



శనిత్రయోదశికి తైలాభిషేకం, ఉప్పు, నల్ల నువ్వులు ఇతర పదార్థాలతో తీవ్రమైన శనిదోషాలకు పరిహారం చేసుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలంటారు.



సాధారణంగా స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించే ఆలయాల సందర్శనకు వెళ్తారు. ఇంటి నుంచి గుడి దూరంగా ఉంటే కాళ్లకు దుమ్మూదూళి అంటుకుంటే అప్పుడు గుడికి వెళ్లేముందు కాళ్లు కడుక్కోవాలి.



చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక చేతితో నవగ్రహాలను తాకి ప్రదక్షణ చేస్తుంటారు.పొరపాటున కూడా ఈ విధంగా నవగ్రహాలను తాకి ప్రదక్షిణాలు చేయకూడదు



నవగ్రహాల ప్రదక్షిణ చేయడానికి నవగ్రహాల మండపంలోకి వెళ్లేముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి చంద్రుడి నుంచి కుడివైపుగా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి.



తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత బుధుడి నుంచి రాహు, కేతువులను సందర్శిస్తూ మరో 2 ప్రదక్షిణాలు చేయాలి. ఈ విధంగా నవగ్రహాల చుట్టూ మొత్తం 11 ప్రదక్షిణాలు చేయాలి.



నవగ్రహాల్లో ఉన్న తొమ్మిది గ్రహాల పేర్లు స్మరిస్తూ మండపంలోంచి బయటకు వచ్చేటప్పుడు నవగ్రహాలకు వీపు చూపకుండా వెనక్కి నడుస్తూ బయటకు రావాలి. మూలవిరాట్ దర్శనం పూర్తిచేసుకున్న తరువాతనే నవగ్రహాల దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలి.



ఇంటికి వెళ్లగానే లోపలికి ప్రవేశించకుండా చాలామంది బయటనే కాళ్లుచేతులు కడుగుతుంటారు. ఇలా కాళ్లు చేతులు కడిగి లోపలికి వెళ్లడం వల్ల మనం చేసిన పూజ వ్యర్థమవుతుంది



గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.



Images Credit: Pinterest