News
News
వీడియోలు ఆటలు
X

Goddess Lakshmi : లక్ష్మీదేవికి 8 రూపాలు ఎందుకు, వాటి వెనుకున్న విశిష్టత ఏంటి!

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదలకు దేవత. భోగభాగ్యాలను అందించే అధిష్టాన దేవత. ఈ లక్ష్మీదేవి 8 రూపాల్లో అష్ట లక్ష్ములుగా పూజలందుకుంటోంది. ఆ రూపాలు వాటివెనుకున్న విశిష్టత ఏంటో తెలుసుకుందాం..

FOLLOW US: 
Share:

Goddess Lakshmi : లక్ష్మీదేవిని 8 రూపాల్లో పూజిస్తారు...ఆ రూపాలు, వాటివెనుకున్న విశిష్టత ఇదే..

1.ఆదిలక్ష్మి 

ఆదిలక్ష్మిని 'మహాలక్ష్మి' అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఓ చేతిలో పద్మం, మరో చేతిలో పతాకం ధరించి..రెండు చేతుల్లో  అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది. పాలకలడలిపై నారాయణుని దగ్గరుండే తల్లి ఈమె. లోకాలను కాచేది ఈ ఆదిలక్ష్మే. ప్రాణశక్తికి, ఆరోగ్యానికి అధిష్టాన దేవత.

2.ధాన్యలక్ష్మి

హిందు సాంప్రదాయంలో వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు జీవన విధానం కూడా. అందుకే మన సంస్కృతి మొత్తం వ్యవసాయాన్ని అనుసరించే ఉంటంది. పంటలు సమృద్ధిగా పండి ధాన్యపు రాశులు కురిస్తే అందరి జవితాలూ సుభిక్షంగా ఉన్నట్టే. ఇదంతా కాచేతల్లి ధాన్యలక్ష్మి.  ఆహారానికి ప్రతీకగా ఉండే ధాన్యలక్ష్మి ఆకుపచ్చని రంగులో, ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల, రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించేతల్లిగా  ధాన్యలక్ష్మిని  కొలుస్తారు.

Also Read: ఈ 4 వస్తువులను చేతికి అందుకోకూడదు, ఉచితంగా అస్సలు తీసుకోరాదు!

3.ధైర్యలక్ష్మి

సిరి సంపదలు లేకపోయినా ధైర్యం అనేది లేకపోతే ఆ మనిషి అడుగు ముందుకుపడదు. రేపటి గురించి ఆశతో జీవించలేరు, ఈ క్షణం భయంతో అడుగువేయలేరు. అంటే ధైర్యలక్ష్మి తోడుగా లేకపోతే జీవితం ఎక్కడ మొదలైందో అక్కడే ఉంటుంది. అందుకే ధైర్యలక్ష్మి తోడుంటే జీవితంలో అపజయం అనేదే ఉండదంటారు. ఈమెనే 'వీరలక్ష్మి' అని కూడా అంటారు. ఎర్రని వస్త్రాలు ధరించి..8 చేతుల్లో చక్రం, శంఖం, ధనుర్బాణం, త్రిశూలం, పుస్తకం, వరదాభయ ముద్రలలో దర్శనమిస్తుంది. మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది ధైర్యలక్ష్మి.

4.గజలక్ష్మి 

సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు.. ఆ సంపదకు తగిన హుందాతనాన్నీ ప్రతిష్టనూ అందించేతల్లి గజలక్ష్మి. సాక్షాస్తూ ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీర సాగరమథనంలో గజలక్ష్మి వెలికి తెచ్చిందని చెబుతారు. నాలుగు చేతులు కలిగిన ఈ అమ్మవారిని 
ఇరువైపులా రెండు ఏనుగులు అభిషేకిస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించిన గజలక్ష్మి రెండు చేతుల్లో పద్మాలు, మరో రెండు చేతుల్లో వరదాభయ ముద్రలతో దర్శనమిస్తుంది. సకల శుభాలకు అధిష్టాన దేవత ఈమె.

5.సంతానలక్ష్మి 

సకల సంపదలు, భోగభాగ్యాలున్నా సంతానం లేకపోతే అవన్నీ వృధాగానే అనిపిస్తాయి. తమతోనే తరం నిలిచిపోతోందనే బాధ పీడిస్తూఉంటుంది. ఇలాంటి వారి ఒడినింపుతుంది సంతానలక్ష్మి. ఆరు చేతులతో రెండు కలశాలు, ఖడ్గము, డాలు ధరించి, ఓ చేతిలో అభయముద్ర, మరో చేతిలో బిడ్డను పట్టుకుని దర్శనమిస్తుంది. సత్సంతాన ప్రాప్తికి అధిష్టాన దేవత.

6.విజయలక్ష్మి 

విజయం అంటే కేవలం రణక్షేత్రంలోనే కాదు..జీవిత పోరాటంలోనూ చేసేది అదే. ఏ కార్యం చేపట్టినా తమకు విజయాన్ని అందించమంటూ విజయలక్ష్మిని వేడుకుంటారు. భక్తుల అభిష్టానికి అనుగుణంగా విజయలక్ష్మి ఎర్రని వస్త్రాలతో, ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంద. 
శంఖం, చక్రం,ఖడ్గం, డాలు పాశము,  రెండు చేతుల వరదాభయ ముద్రలతో కనిపిస్తుంది. సకల కార్యసిధ్దికి సర్వత్రా విజయసిద్దికి అధిష్టాన దేవత.

7.విద్యాలక్ష్మి

జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి, ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటూ లౌకిక జ్ఞానాన్ని అందించే తల్లి విద్యాలక్ష్మి. ఈమెని సరస్వతీదేవికి ప్రతిరూపంగా కూడా అనుకోవచ్చు. అందుకే తెల్లని వస్త్రాలు ధరించి పద్మపు సింహాసనంలో ఆసీనురాలై ఉంటుంది. విద్య, వివేకాన్ని అందించే దేవత విద్యాలక్ష్మి 

Also Read: మే 25 నుంచి రోహిణి కార్తె, రోళ్లు పగులుతాయని ఎందుకంటారు!

8.ధనలక్ష్మి

సంపద లేకుంటే జీవనం సాగదు. ఆ సంపదని ఒసగి దారిద్య్రాన్ని దూరం చేసే దేవత ధనలక్ష్మీ. ఇందుకు చిహ్నంగా ఆమె చేతిలో  బంగారు నాణేలున్న కలశం దర్శనమిస్తుంది. ఏర్రని వస్త్రాలతో ఆరు చేతులతో దర్శనమిస్తుంది ధనలక్ష్మి. కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి,  వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.

Published at : 26 May 2023 07:07 AM (IST) Tags: Vijaya Lakshmi dhana lakshmi Goddess Lakshmi Facts Symbolism of asta lakshmi Names of Asta Lakshmi Dhanya Lakshmi Gaja Lakshmi Santana Lakshmi Vidya Lakshmi Adi Lakshmi

సంబంధిత కథనాలు

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి  ఎప్పుడొచ్చింది,  ప్రత్యేకత ఏంటి!

టాప్ స్టోరీస్

పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి

పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల- జరిగిన మేలు గుర్తించాలని జగన్ విజ్ఞప్తి

Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి

Congress Konda Murali Sensational Comments: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న మురళి

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

నాని పార్టీ మారేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? జరుగుతున్న ప్రచారంపై ఎంపీ రియాక్షన్ ఏంటీ?

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?