అన్వేషించండి

Dhanurmas 2023-2024: ధనుర్మాసంలో ఏం చేయాలి - పెళ్లికానివారికి ఎందుకు ప్రత్యేకం!

Dhanurmas 2023 - 2024: డిసెంబరు 17 నుంచి ధనుర్మాసం మొదలైంది. వైష్ణవ ఆలాయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అయితే ఈ నెల రోజులు ఎందుకు ప్రత్యేకమో తెలుసా...

Importance of Dhanurmas 2023 - 2024: దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెలరోజులూ ధనుర్మాసం. ఈ ధనుర్మాస కాలంలో  తెల్లవారుజాము కాలం అత్యంత పవిత్రమైనది. ధను అంచే ఏదో ఒకదానికోసం ప్రార్థించడం.  ఈ నెల రోజులూ జరిగే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై , గోదాకళ్యాణం ఇవన్నీ ద్రవిడ సంప్రదాయాలు. అయితే తిరుమలలో మాత్రం ఈ నెలరోజులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు.

భోగి వరకూ ధనుర్మాసం

ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. వైష్ణవ ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ నెలలో గోదాదేవి ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది.  ఈ నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని  శాస్త్రాలు చెబుతున్నాయి. 

Also Read: వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం టైమింగ్స్ ఇవే!

తిరుప్పావై అంటే

సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం, పావై అంటే వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై  అని చెబుతారు. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి  శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువజామునే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలని కలపి పద్యం...అంటే.. పాశురం రూపంలో రచించింది. అలా  రోజుకొకటి చొప్పున 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పి మాయమవుతాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. 

Also Read: ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఎందుకంటే!

పెళ్లికానివారికి ప్రత్యేకం

అందుకే ధనుర్మాసం పెళ్లీడు పిల్లలకు చాలా ప్రత్యేకం అని చెబుతారు పండితులు. ధనుర్మాసం నెలరోజులూ ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు వేసి, శక్తిమేరకు పూజ చేయడం వల్ల...కోరిన వరుడు లభిస్తాడని చెబుతారు. పెళ్లికాని మగవారు ధనుర్మాసం నెలరోజులూ బ్రహ్మమూహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి వైష్ణవ ఆలయాలను సందర్శించి..తులసి మాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ ఘడియలు వస్తాయని విశ్వసిస్తారు.ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. 

దనుర్మాసంలోనే వైంకుఠ ఏకాదశి

ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి ‘ముక్కోటి ఏకాదశి’ వస్తుంది. ఆరోజు బ్రాహ్మ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వారం ద్వారా శ్రీమహావిష్ణువుని దర్శించుకుంటారు. స్వామి వారికి ఆ రోజు తులసి మాలను సమర్పిస్తారు. ఉదయం, సాయంత్ర సమయాలలో స్త్రీలు తులసికోటను అందంగా అలంకరించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని చెబుతారు.

2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Youtuber Beast: వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Youtuber Beast: వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
Vijay Deverakonda Rashmika: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయల్దేరిన రష్మిక, విజయ్... పెళ్ళికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా?
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయల్దేరిన రష్మిక, విజయ్... పెళ్ళికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా?
Shriya Saran:  శ్రియ శరణ్ ఫ్యామిలీ టైమ్..ఫొటోస్ ఎంత బావున్నాయో చూడండి!
శ్రియ శరణ్ ఫ్యామిలీ టైమ్..ఫొటోస్ ఎంత బావున్నాయో చూడండి!
iPhone 15 : ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రూ.70వేల ఫోన్ రూ.30వేలకే
ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్- రూ.70వేల iPhone 15 రూ.30 వేలకే
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Embed widget