భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ముఖ్యమైన విషయం ఇదే!



గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి చెప్పలేదు. వాటిని ఎలా సంధించాలో వివరించలేదు



యుద్ధ వ్యూహాలు నేర్పించలేదు. శత్రువులను సంహరించే మెలకువలనూ నేర్పలేదు.



ఈ విషయాలన్నింటిలో తనకు తానే సాటి అయిన అర్జునుడిని ఆవహించిన మాయను తొలగించి రణరంగంలోకి దిగేలా బోధించాడు



‘నీకు నిర్దేశించిన కర్మలను నువ్వు చేయడమే సరైనది. దేనినీ చేయకపోవడం కన్నా నీ ధర్మాన్ని అనుసరించి పని చేయడమే ఉత్తమం



ఏ పనీ చేయకుండా ఉంటే శరీర నిర్వహణ కూడా ముందుకు కొనసాగదు



‘అర్జునా! యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. గెలిస్తే రాజ్యలక్ష్మి సిద్ధిస్తుంది.



ఏదైనా ప్రయోజనమే, కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవ్వు’ అని పార్థుడికి బోధించాడు శ్రీకృష్ణుడు.



చెప్పడం వరకే ఆయన పని, చెప్పింది శ్రద్ధగా విన్నాడు. విన్నది అర్థం చేసుకున్నాడు



, అర్థమైన దాన్ని అర్థవంతంగా ఆచరించి తన కర్తవ్యాన్నినిర్వర్తించాడు అర్జునుడు. Image Credit: Pinterest