News
News
X

Dhanteras: దేవతల వైద్యుడిని నిత్యం స్మరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి!

Dhanteras: ధన్వంతరీ నారాయణుడు జన్మించిన ధన త్రయోదశి రోజు మాత్రమేకాదు..నిత్యం ఆయన మంత్రం స్మరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు పండితులు

FOLLOW US: 
 
Dhanteras: ‘వైద్యో నారాయణో హరిః’- అంటే వైద్యుడు మహా విష్ణు స్వరూపుడని అర్థం. ఆ మహావిష్ణువే దేవ వైద్యుడు ధన్వంతరిగా అవతారం దాల్చి, ఆయుర్వేదాన్ని మానవాళికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ధనత్రయోదశి రోజే. క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు ధన్వంతరీ నారాయణుడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం  ధన్వంతరిని కూడా పూజిస్తారు. అందుకే మంచి హస్తవాసి ఉన్న వైద్యుడిని అపర ధన్వంతరిగా అభివర్ణిస్తారు. ధన్వంతరీ నారాయణుడు జన్మించిన ధన త్రయోదశి రోజు మాత్రమేకాదు..నిత్యం ఆయన మంత్రం స్మరిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు పండితులు

Also Read: దీపావళి రోజు దక్షిణావర్తి శంఖాన్ని ఎలా పూజించాలి, ఆ తర్వాత దానిని ఏం చేయాలంటే!

ధన్వంతరి మంత్రం (Dhanvantari Mantra) 
ధ్యానం
శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం చారుదోర్భిశ్చతుర్భిః |
సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక పరివిలసన్మౌళిమంభోజనేత్రమ్ |
కాలాంభోదోజ్జ్వలాంగం కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యమ్ |
వందే ధన్వంతరిం తం నిఖిలగదవనప్రౌఢదావాగ్నిలీలమ్ ||

అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత
రోగాన్మే నాశయాఽశేషాన్ ఆశు ధన్వన్తరే హరే |
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియో శ్రియం
స్వభక్తేభ్యః అనుగృహ్ణన్తం వందే ధన్వన్తరిం హరిమ్ ||

News Reels

ధన్వన్తరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే |
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవన్తి తే చిరమ్ ||

ధన్వంతరి గాయత్రీ 
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్ |

ధన్వంతరి తారకమంత్రం 
ఓం ధం ధన్వంతరయే నమః |

Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!

ధన్వంతరీ మంత్రం 
ఓం నమో భగవతే 
మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే
అమృతకలశ హస్తాయ 
సర్వ భయ వినాశాయ 
సర్వ రోగ నివారణాయ 
త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే 
శ్రీ మహావిష్ణు స్వరూప
శ్రీ ధన్వంతరీ స్వరూప
శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర  నారాయణాయ స్వాహా

‘‘సుదర్శన వాసుదేవ ధన్వంతరిగా ప్రసిద్ధుడైన దేవదేవునికి నమస్సులు. చేతిలో అమృత కలశాన్ని ధరించినవాడూ, అన్ని భయాలనూ పోగొట్టి, సర్వ రోగాలనూ నివారించేవాడూ, ముల్లోకాలకూ పతి, ముల్లోకాలకూ శ్రేయస్సు చేకూర్చేవాడూ, మహా విష్ణువుకు మారురూపమూ అయిన ధన్వంతరి కృప అందరినీ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఆ ఆయుర్వేద పురుషుడికి నమస్సులు’’ అని భావం. ఆకస్మిక, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ, వ్యాధుల వ్యాప్తి కారణంగా కలిగే భయాలన్నీ పోవడానికీ ధన్వంతరిని నిత్యం ప్రార్థించాలి. ‘‘వ్యాధి తొలగిపోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్య వంతుణ్ణి కావాలి’’ అని మనసులో సంకల్పించుకుని  ఈ ధన్వంతరీ మహా మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించినా, మననం చేసుకున్నా అపమృత్యు భయం తొలగిపోతుందనీ, ఆరోగ్యం సిద్ధిస్తుందని చెబుతారు

దీపావళి ఈనెల 24 సోమవారం జరుపుకోవాలి. ఈ రోజు సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉన్నప్పటికీ  సూర్యాస్తమయం సమయానికి అమావాస్య వచ్చేస్తుంది. దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సోమవారం రాత్రి ( 24 తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. 

Published at : 22 Oct 2022 01:11 PM (IST) Tags: Dhanteras Diwali 2022 Date Shubh Muhurat diwali Puja and Significance of Diwali Naraka Chathurdasi Balipratipada Yama Dwitiya Dhanteras Yama deepam 2022 Significance of Dhantrayodashi Yama Deepam 2022 Date and Time

సంబంధిత కథనాలు

Love Horoscope Today 10th December 2022: ఈ రాశివారికి ఈ రోజంతా మధురమే అన్నట్టుంటుంది

Love Horoscope Today 10th December 2022: ఈ రాశివారికి ఈ రోజంతా మధురమే అన్నట్టుంటుంది

Horoscope Today 10th December 2022: ఈ రాశివారి కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today 10th  December 2022: ఈ రాశివారి కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది, డిసెంబరు 10 రాశిఫలాలు

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 12న ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 12న ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Christmas Celebrations 2022: ఇంటి అలంకరణ మాత్రమే కాదు క్రిస్మస్ కి ఇలా కూడా చేయొచ్చు!

Christmas Celebrations 2022: ఇంటి అలంకరణ మాత్రమే కాదు క్రిస్మస్ కి ఇలా కూడా చేయొచ్చు!

2023 Cancer Yearly Horoscope: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

2023 Cancer Yearly Horoscope:  శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్