Death Signs In Shiva Purana: ఈ సంకేతాలు కనిపిస్తే మృత్యువు సమీపించిందని అర్థం!
Death Signs In Shiva Purana: శివ పురాణంలో ఒక వ్యక్తి మరణించే సమయం దగ్గరలో ఉన్నప్పుడు అతనికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. శివ పురాణం ప్రకారం మరణ సంకేతాలు ఇవే.
Death Signs In Shiva Purana: శివ మహాపురాణంలో పుట్టుక, మరణం రెండింటికి సంబంధించిన అనేక విషయాలను పరమేశ్వరుడు వివరించాడు. ఒక వ్యక్తి తన పుట్టుక, చావుకి సంబంధించిన రహస్యాలను తెలుసుకోవడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటాడు. శివ పురాణం ఒక వ్యక్తి మరణానికి ముందు అతనికి కనిపించే కొన్ని సంకేతాలను ప్రస్తావిస్తుంది. మీకు అలాంటి సంకేతాలు కనిపిస్తే మరణం ఆసన్నమైందని అర్థం. శివ పురాణం ప్రకారం మరణానికి సంబంధించిన సంకేతాలు ఏంటో తెలుసా..
చర్మం రంగు మారుతుంది
శివ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి చనిపోబోయే కొన్ని నెలల ముందు శరీరం అకస్మాత్తుగా నీలం రంగులోకి మారుతుంది. లేదా శరీరంపై ఎర్రటి గుర్తు కనిపిస్తుంది. ఇలాంటి సంకేతాలు కనిపించిన తర్వాత ఆ వ్యక్తి కేవలం 6 నెలలు మాత్రమే జీవిస్తాడు. అంటే, అలాంటి వ్యక్తి మరణం 6 నెలల్లోపు సంభవించే అవకాశం ఉంది.
Also Read : మరణ సమయంలో స్వరం ఎందుకు పోతుందో తెలుసా?
శరీర భాగాలు పనిచేయడం మానేస్తాయి
ఒక వ్యక్తి శరీరంలోని కొన్ని భాగాలు పనిచేయడం మానేస్తే, అలాంటి వ్యక్తి చనిపోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంటుందని శివపురాణంలో వివరించారు. ఒక వ్యక్తి నోరు, చెవులు, కళ్లు, నాలుక సరిగా పని చేయకపోతే, ఆ వ్యక్తి మరణానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉందని అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తులు 6 నెలలలోపు చనిపోవచ్చు.
నోరు తడి ఆరిపోవడం
ఒక వ్యక్తి ఎడమ చేయి నిరంతరం మెలితిప్పినట్లు లేదా శరీరంలోని మరేదైనా భాగానికి నొప్పి కలుగుతోందని మీరు చాలాసార్లు విని ఉండవచ్చు. అయితే, ఒక వ్యక్తి ఎడమ చేయి మెలితిప్పినట్లు లేదా నోటి లోపల ఉన్న అంగుటిపై భాగం పొడిబారడం ప్రారంభిస్తే, శివ పురాణం ప్రకారం దాదాపు ఒక నెలలో చనిపోతాడు.
నీడ అదృశ్యం
మరణ సమయం సమీపిస్తున్న వ్యక్తి నీటిలో, నూనె, నెయ్యి లేదా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూడలేడు. శివ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి తన నీడను చూడలేనప్పుడు, మరణం ఆసన్నమైందని తెలుసుకోవాలి.
Also Read : అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత శ్మశానం నుంచి వచ్చేస్తూ వెనక్కి తిరిగిచూస్తే!
చంద్రుడు కూడా నల్లగా కనిపిస్తాడు
ఒక వ్యక్తి మరణించే సమయం ఆసన్నమైతే ఆ వ్యక్తికి చంద్రుడిని, నక్షత్రాలను సరిగా చూడలేడని శివపురాణంలో వివరించారు. అలాంటి వ్యక్తులు కేవలం ఒక నెలలోనే మరణిస్తారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.