అన్వేషించండి

నోలన్ 'The Odyssey 'లో రామాయణ, మహాభారత పోలికలు: వైరల్ అవుతున్న 3 సారూప్యతలు!

Christopher Nolan The Odyssey సినిమాలో రామాయణం, మహాభారతం పోలికలు కనిపిస్తున్నాయి. ఇంటికి రావడం, విల్లు పరీక్ష, దైవ మార్గదర్శకత్వం - ఈ 3 సారూప్యతలేంటో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోమర్ ఒడిస్సీయన్ గృహప్రవేశం, రాముని వనవాసం ఒకటే.
  • అథీనా, కృష్ణుడు హీరోలకు మార్గదర్శకత్వం చేసి ధైర్యాన్నిచ్చారు.
  • ఒడిస్సీ, రామాయణంలో విల్లు పరీక్ష అర్హతను నిరూపించింది.
  • ధైర్యం, త్యాగం వంటి మానవ భావోద్వేగాలు ప్రపంచమంతటా ఒకటే.

Homer's Odyssey vs Ramayana & Mahabharata: క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చన The Odyssy సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ కథ, నటన, VFX గురించి ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుతున్నప్పటికీ..సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు రామాయణం, మహాభారతం కథలను గుర్తుచేస్తున్నాయని చెబుతున్నారు. చారిత్రకంగా ఒకదాని నుంచి మరొకటి ప్రభావతిమైందని కాదు..హోమర్ రాసిన The Odyssey కి భారతీయ గ్రంథాలకు సంబంధం లేదు. కానీ ప్రపంచంలో కథలు చివరికి ధైర్యం, త్యాగం, కర్తవ్యం, ఇంటికి వెళ్లాల్నే కోరిక వంటి ఉమ్మడి విషయాల వద్దకు వస్తాయి.

HomecomingThe Odyssey లో ఒజిస్సియన్ ట్రోజన్ యుద్ధంలో 10 ఏళ్లు ..తిరిగి చేరుకోవడానికి 10 ఏళ్లు కష్టపడతారు. మధ్యలో తుఫానులు, రాక్షసులు, శోధనలు ఎదురవుతాయి. ఇది రామాయణంలో శ్రీరాముడి వనవాసం లాంటిదే. 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని కుటుంబాన్ని కలుసుకుని ధర్మాన్ని నిలబెడతాడు. సందర్భం వేరైనా హీరో ఇంటికి తిరిగి రావడం అనే పాయింట్ రెండింటిలోనూ ఒకేలా ఉంది. అందుకే ప్రేక్షకులు ఈ కథను రామాయణంలో లింక్ చేసుకుని కనెక్ట్ అవుతున్నారు.
 
Divine Guidance నోలన్ సినిమాలో అథీనా దేవత Zendaya పాత్ర - ఒడిస్సియస్‌కు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. దారి చూపిస్తుంది, ధైర్యాన్నిస్తుంది..కానీ యుద్ధం చేయదు. నిర్ణాలు ఒడిస్సియస్‌ తీసుకోవాలి..అంటే ఇది మహాభారతంలో శ్రీ కృష్ణుడి పాత్రను గుర్తుకుతెస్తుంది. శ్రీ కృష్ణుడు పాండవుల కోసం యుద్ధం చేయలేదు కానీ గీతా బోధన, మార్గదర్శకత్వంతో వారిని గెలిపించాడు. దేవుడు అంటే కాపాడడం కాదు..దారి చూపడం అని అర్థం

విల్లు - హీరోని నిర్ణయించే పరీక్ష రామాయణంలో సీతా స్వయంవరంలో శివుడి విల్లు ఉంటుంది. ఎవరు విల్లు ఎక్కుపెడితే వారే సీతను పెళ్లి చేసుకుంటారు. పెద్ద పెద్ద రాజులు ఫెయిల్ అయ్యారు కానీ రాముడు సునాయాసంగా విల్లు ఎక్కుపెట్టి తాను అర్హుడు అని నిరూపించుకున్నాడు. 
The Odyssey క్లైమాక్స్ లోనూ ఇదే జరుగుతుంది. ఒడిస్సియస్‌ చనిపోయాడని అంతా అనుకుంటారు.. పెనెలోపి ఎవరు ఈ విల్లు ఎక్కుపెట్టి బాణం వేస్తారో వారినే పెళ్లిచేసుకుంటా అని ప్రకటిస్తుంది. అందరూ ఫెయిల్ అవుతారు..కానీ బిచ్చగాడి రూపంలో వచ్చిన ఒడిస్సియస్‌ సులభంగా విల్లు క్కుపెడతాడు. కథలు వేర్వేరు అయినా..ఇక్కడ విల్లు అంటే శక్తి, అర్హత, విధికి గుర్తు. 

రామాయణంలో రాముడు..రావణడు, మారీచుడు వంటి మాయావులతో యుద్ధం చేస్తాడు
మహాభారతంలో పాండవులు అడవుల్లో ఉన్నప్పుడు రాక్షసులను, విచిత్ర జీవులను ఎదుర్కొంటారు
ఒడిస్సియస్ తన ప్రయాణంలో సైక్లోప్స్, సైరన్లు, ప్రమాదకరమైన జీవులతో పోరాడుతాడు

The Odyssey: ఓ మనిషి ఇంటికి చేరే ప్రయాణం...
రామాయణం - ఆదర్శపాలన, కర్తవ్యంపై భక్తి
మహాభారతం - ధర్మం, మానవ స్వబావంలో సంక్లిష్టత

అందుకే The Odyssey సినిమాను రామాయణం, మహాభారతంతో పోల్చి చూస్తున్నారు. ఇవన్నీ ఒకటే అని కాదు.. మానవ భావోద్వేగాలు ప్రపంచమంతా ఒకేలా ఉంటాయని చెప్పడమే వీటి ఆంతర్యం. పురాతన గ్రీకు దేశమైనా, పురాతన భారతమైనా... ఇంటిని వెతుక్కుంటూ చేసే ప్రయాణం, ధర్మం కోసం చేసే పోరాటం ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటాయ్

 

Frequently Asked Questions

'ది ఒడిస్సీ' సినిమాను రామాయణం, మహాభారతంతో ఎందుకు పోలుస్తున్నారు?

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా ఇంటికి తిరిగి రావడం, దైవిక మార్గదర్శకత్వం, విల్లు పరీక్ష వంటి అంశాలు రామాయణం, మహాభారతం కథలను గుర్తుచేస్తున్నాయి. కథలు వేరైనా, మానవ భావోద్వేగాలు, ధర్మం వంటివి ఒకేలా ఉంటాయి.

'ది ఒడిస్సీ'లో ఇంటికి తిరిగి వచ్చే ప్రయాణం రామాయణాన్ని ఎలా పోలి ఉంటుంది?

ఒడిస్సియస్ 20 ఏళ్ల కష్టాల తర్వాత ఇంటికి చేరుకోవడం శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి రావడాన్ని పోలి ఉంటుంది. సందర్భాలు వేరైనా, హీరో ఇంటికి చేరుకోవడం అనే అంశం రెండింటిలోనూ ఒకేలా ఉంటుంది.

'ది ఒడిస్సీ'లో దైవిక మార్గదర్శకత్వం మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రను ఎలా గుర్తుచేస్తుంది?

'ది ఒడిస్సీ'లో అథీనా ఒడిస్సియస్‌కు దారి చూపిస్తుంది, ధైర్యాన్నిస్తుంది కానీ యుద్ధం చేయదు. ఇది మహాభారతంలో శ్రీ కృష్ణుడు పాండవులకు గీతా బోధనతో మార్గదర్శకత్వం వహించినట్లు ఉంటుంది.

'ది ఒడిస్సీ', రామాయణాలలో విల్లు పరీక్ష ప్రాముఖ్యత ఏమిటి?

రామాయణంలో సీతా స్వయంవరంలో రాముడు విల్లు ఎక్కుపెట్టి అర్హతను నిరూపించుకుంటాడు. ఒడిస్సీలోనూ ఒడిస్సియస్ విల్లు పరీక్షలో గెలిచి తన గుర్తింపును చాటుకుంటాడు. ఇది శక్తి, అర్హతలకు ప్రతీక.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shani Vakri 2026: శని వక్రగమనం - కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
శని వక్రగమనం: కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
నాగ పంచమి 2026: పెనం ముట్టుకుంటే రాహు దోషం, ఆర్థిక కష్టాలు!
నాగ పంచమి 2026: పెనం ముట్టుకుంటే రాహు దోషం, ఆర్థిక కష్టాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
పుష్యమి నక్షత్రంలోకి గురు గ్రహం! ఈ 4 రాశులకు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget