అన్వేషించండి

Varahi Navaratri Dates2026: వారాహి నవరాత్రుల పూజా విధానం, విశిష్టత, ప్రయోజనాలు తెలుసుకోండి

Ashadha Gupt Navratri 2026: ఆషాఢమాసం ప్రారంభమైంది.. ఈ నెలలో తొమ్మిదిరోజుల పాటూ జరుపుకునేవే ఆషాఢ గుప్త నవరాత్రుల పూజా విధానం, విశిష్టత ఇక్కడ తెలుసుకోండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆషాఢమాసంలో తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు.
  • వినాయకుడి ప్రార్థనతో వారాహి అమ్మవారిని షోడశోపచారంగా పూజించాలి.
  • బెల్లం పానకం నివేదించి, బ్రహ్మచర్యం పాటిస్తూ దీక్ష చేయాలి.
  • అమ్మవారి పూజ అహంకారం తగ్గించి, సమస్యలను దూరం చేస్తుంది.

Varahi Navaratri Dates 2026 and Simple Pooja Vidhanam : నవరాత్రులు అనగానే ఆశ్వయుజమాసంలో వచ్చే దసరా నవరాత్రులు మాత్రమే అనుకుంటారు. కానీ మరో రెండు తెలుగు నెలల్లో నవరాత్రులు నిర్వహిస్తారని మీకు తెలుసా?... అవే మాఘగుప్త నవరాత్రులు, ఆషాఢంలో వచ్చే నవరాత్రులు...ఈ తెలుగు నెలల్లోనూ నవరాత్రులు జరుపుకుంటారు. జూన్ 26 నుంచి ఆషాఢమాసం ప్రారంభం కావడంతో వారాహి నవరాత్రులు ఆరంభమయ్యాయి. శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటూ అమ్మవారిని పూజించినట్టే ఆషాఢంలో వారాహీ నవరాత్రుల్లోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. ఉపవాసాలు , దీక్షలు చేస్తారు.

వారాహి దేవి నవరాత్రులు ఎప్పుడు?

ఏటా ఆషాఢ మాసం ఆరంభంలో వచ్చే తొమ్మిది రోజులు  వారాహి నవరాత్రులు జరుపుకుంటారు..వీటినే గప్త నవరాత్రులు అంటారు

వారాహి ని ఇంట్లో పెట్టుకుంటే మంచిదా?

వారాహి అమ్మవారి ఫొటో దేవుడిమందిరంలో పెట్టుకోవచ్చు లేదంటే విడిగా పెట్టుకోవచ్చు. మొదటి రోజు ఫొటో ఎక్కడ పెడతారో తొమ్మిది రోజుల పాటూ ఫొటోను అక్కడి నుంచి మార్చకూడదు, కదపకూడదు.

వారాహి నవరాత్రులు ఎలా చేయాలి?

మొదటి రోజు పెట్టిన దీపం తొమ్మిదిరోజుల పాటూ వెలగాలి. అంటే అఖండ దీపం పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి..మావల్ల కాదు అనుకుంటే అఖండ దీపం  వెలిగంచవద్దు.. నిత్యదీపారాధన చేసుకోండి సరిపోతుంది. కలశం పెట్టాలా వద్దా అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి..సాయంత్రం దీపారాధన తర్వాత అమ్మవారికి నివేదించి ఉపవాసం విరమించాలి. 

వారాహి అమ్మవారి పూజా విధానం

ఏ పూజ అయినా వినాయకుడిని ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. ముందుగా గణపతి ప్రార్థన చేసి ధూపం, నైవేద్యం సమర్పించి మళ్లీ సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫొటోకి మొదటి రోజు ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఆ తర్వాత షోడసోపచార పూజచేయాలి. నిత్యం గణపతి ప్రార్థన పూర్తిచేసి అమ్మవారి పూద పూర్తిచేయాలి. వారాహి అష్టోత్తరం,  వారాహి కవచం చదువుకుంటూ పూలు, కుంకుమతో పూజించాలి. లలితా అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన అమ్మవారు కావడంతో వారాహి పూజలో భాగంగా లిలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చు.  

షోడసోపచార పూజ అంటే మొత్తం 16 ఉపచారాలు

1. ఆవాహనం- దైవాన్ని ఆహ్వానించాలి
2. ఆసనం-  ఆసనం చూపించాలి (అక్షతలు సమర్పిస్తారు)
3. పాద్యం- పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పిస్తారు
4. అర్ఘ్యం- చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు
5. ఆచమనీయం- దాహం తీర్చుకునేందుకు నీళ్లివ్వాలి
6. స్నానం- అభిషేకం చేయాలి
7. వస్త్రం- దుస్తులు లేదా అక్షతలు, పూలు సమర్పించాలి
8. యజ్ఞోపవీతం- యజ్ఞోపవీతం లేదా అక్షతలు సమర్పిస్తారు
9. గంధం- గంధంతో అలంకరించాలి
10. పుష్పం- పూలతో అర్చించాలి
11. ధూపం- అగరొత్తులు వెలిగించాలి
12. దీపం- వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి
13. నైవేద్యం- పండ్లు, పానకం, వంటలు నైవేద్యం పెట్టాలి
14. తాంబూలం- ఆకు, వక్క తాంబూలం ఇవ్వాలి
15. నమస్కారం-  సాష్టాంగ నమస్కారం చేయాలి
16. ప్రదక్షిణ- ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి
 
వారాహి అమ్మవారికి మీరు ఎన్ని పదార్థాలు నివేదించినా బెల్లం పానకం తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు చీరను అందించాలి.  ఆ వస్త్రాన్ని మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువులకు ఇవ్వొచ్చు. పూజ పూర్తైన తర్వాత ధూపం వేయడం అత్యంత ముఖ్యమం.

దీక్షా నియమాలివే

వారాహి అమ్మవారి దీక్షను చాలా నియమంగా చేయాలి. నవరాత్రుల 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.  
 
వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం

లలితా దేవి నుంచి ఉద్భవించిన వారాహి అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది. కష్టాల్లో ఉన్నవారు , భూ సంబంధిత తగాదాల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మవారిని పూజిస్తే పరిష్కారం లభిస్తుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. సస్యానికి అధిపతి అయిన వారాహిని పూజిస్తే పంట దిగుబడి బావుంటుంది. వారాహి ధ్యానం దీర్ఘకాలిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

అమ్మవారి కరుణా కటాక్షాలకోసం పూజ చేయాలి కానీ కోర్కెలు నెరవేరాలని కాదని గుర్తించాలి. మీరు భక్తితో పూజచేస్తే మీకు ఏం ఇస్తే మంచి జరుగుతుందో అమ్మవారే అందిస్తారు.

గమనిక: ఆధ్యాత్మిక గ్రంధాల్లో ఉన్న వార్తలు, ఆధ్యాత్మిక వేత్తలు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.

Frequently Asked Questions

వారాహి దేవి నవరాత్రులు ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం ఆరంభంలో వచ్చే తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు.

వారాహి అమ్మవారి ఫొటోని ఇంట్లో పెట్టుకోవచ్చా?

అవును, వారాహి అమ్మవారి ఫొటోను దేవుడిమందిరంలో లేదా విడిగా పెట్టుకోవచ్చు. అయితే, పూజ ప్రారంభించిన తర్వాత తొమ్మిది రోజుల పాటు ఫొటోను మార్చకూడదు.

వారాహి నవరాత్రులలో పూజ ఎలా చేయాలి?

మొదటి రోజు పెట్టిన దీపం తొమ్మిది రోజుల పాటు వెలగాలి, సాధ్యం కాకపోతే నిత్య దీపారాధన చేయవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, సాయంత్రం దీపారాధన తర్వాత అమ్మవారికి నివేదన చేసి ఉపవాసం విరమించాలి.

వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

వారాహి దేవిని పూజిస్తే అహంకారం తగ్గి, కష్టాలు, భూ సంబంధిత తగాదాలకు పరిష్కారం లభిస్తుంది. శత్రునాశనం, పంట దిగుబడి మెరుగుదల, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

08-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
08-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
'ఆమడ దూరం'లో 'ఆమడ' అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎలా పుట్టింది? ఎంత దూరం?
'ఆమడ దూరం'లో 'ఆమడ' అంటే అర్థం ఏంటి? ఈ పదం ఎలా పుట్టింది? ఎంత దూరం?
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget