Christmas 2022: చెడు పనులు చేస్తే బొగ్గు - మంచి పనులు చేస్తే బహుమతి, ఆ దేశంలో శాంటాక్లాజ్ బదులు మంత్రగత్తె
Christmas 2022: క్రిస్మస్ ని ఓ మతపరమైన పండుగగా కాకుండా ఆనందాన్ని ఇచ్చి పుచ్చుకునే వేడుకగా చూస్తే అందరూ జరుపుకోవచ్చేమో. సందడి సందడిగా సాగే క్రిస్మస్ వేడుకలు...ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో చూద్దాం
Christmas 2022: ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25ను క్రీస్తు జన్మదినంగా క్రిస్మస్ పేరుతో వేడుక జరుపుకుంటారు. క్రీస్తు జననానికి సంబంధించిన ఘట్టాలను ఆవిష్కరిస్తూ బొమ్మల కొలువులు ఏర్పాటు చేయడం, బంధుమిత్రులంతా ఓ చోట చేరడం, ఆహ్లాదమైన సంగీతం, ఘుమఘుమలాడే క్రిస్మస్ కేక్, ఇంటి లోపల బయట అలంకరణలు, బహుమతులిచ్చే క్రిస్మస్ తాత...క్రిస్మస్ వేడుకలో ఇవన్నీ కామన్ అయినా ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి ఫాలో అవుతారు..
అమెరికాలో నవంబర్ మూడో వారంలో వచ్చే కృతజ్ఞతా దినం (థ్యాంక్స్ గివింగ్ డే) తర్వాత మొదలయ్యే క్రిస్మస్ వేడుకలు నూతన సంవత్సరం వరకూ అట్టహాసంగా కొనసాగుతాయి
ఫాన్స్‌లో క్రిస్మస్ వేడుకలు సెయింట్ నికోలస్ దినంగా భావించే డిసెంబర్ 6 నుంచి ప్రారంభమవుతాయి. నగరాలన్నీ శోభాయమానంగా అలంకరిస్తారు. పిల్లలకు స్వీట్లు, బహుమతులు అందిస్తారు. పిల్లలు తమ బూట్లను పాలిష్ చేసి మరీ ఇంట్లో దీపాల దగ్గర ఉంచుతారు. క్రిస్మస్ రోజు కుటుంబాలన్నీ ఓ చోట చేరి విందు, వినోదాల్లో మునిగితేలుతారు
ఇటలీలో శాంటాక్లాజ్ బదులు 'లా బెఫానా' అనే మంచి మంత్రగత్తె పిల్లలకి బహుమతులు పంచిపెడుతుందని నమ్మకం. ఆమె పొడవాటి చీపురు కర్రపై వస్తుందనీ..చెడ్డ పనులు చేసిన పిల్లలకు బొగ్గు ఇస్తుందనీ నమ్మకం. చిన్నారుల్ని సరైన మార్గంలో పెట్టేందుకు ఇదో మంచి సందర్భంగా భావిస్తారు అక్కడి ప్రజలు. ఈ సంబరమంగా ఇటలీలో జనవరి 6వ తేదీన జరుగుతుంది.
Also Read: పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది, గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు!
నెదర్లాండ్స్‌లో శాంటాక్లాజ్‌ని 'సిన్తర్ క్లాజ్' అంటారు. శాంటా ఉత్తరధృవంపై కాకుండా స్పెయిన్‌లో నివసిస్తాడనీ, అక్కడి నుంచి మర పడవలో, బ్లాక్ పీటర్ అనే సహాయకుడిని తీసుకుని వస్తాడనీ భావిస్తారు. తమకు గిఫ్ట్‌లిచ్చే పాత్రల పుట్టుపూర్వోత్తరాల కన్నా ఇచ్చిపుచ్చుకోవడంలోని ఆనందాన్నే ఎక్కువ వెతుక్కుంటారు
జర్మనీలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ సీజన్‌లో ప్రత్యేకంగా గ్లూవైన్ అనే పానీయం అందుబాటులోకి తెస్తారు. దట్టంగా మంచు ఉన్న సమయంలో ఈ పానీయం తాగి సంబరం చేసుకుంటారు. ఈ పానీయం కేవలం క్రిస్మస్ రోజుల్లో మాత్రమే తయారుచేస్తారు.
Also Read: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది
లండన్‌లో క్రిస్మస్‌కి నెలరోజుల ముందే వేడుకలు మొదలవుతాయి. ఈ నెలరోజులూ కళ్లు మిరిమిట్లు గొలిపే కాంతులతో నగరం వెలిగిపోతుంది. ప్రతి కూడలిలోనూ క్రిస్మస్ చెట్లు ఆకర్షణీయమైన అలంకరణలతో వెలుగులీనుతాయి
హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతానికి చెందిన దేవుడైనా చెప్పేదొకటే. మంచి ఆలోచించు, నలుగురికి సాయం చేయు, మనసులోకి చెడు ఆలోచనలు రానివ్వొద్దని. ఎన్ని మత గ్రంధాలు చదివినా వాటి భావం మాత్రం ఇదే.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి