Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
పుష్ప తో తన జర్నీ ముగిసిందంటూ బన్నీ ప్రకటించారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా సాగుతున్నాయి.
బాక్సాఫీస్ పై పుష్ప గాడి రూల్ కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తి గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఇచ్చేశారు. సినిమా విడుదలకు ఇంకా వారం ఉంది. అన్ని పనులూ చకచకా జరుగుతున్నాయి. షూటింగ్ కూడా పూర్తయినట్టు తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ కొన్ని రోజులుగా సాగుతోంది. ‘‘పుష్ప తో అయిదేళ్ల బంధం ముగిసింది. LAST DAY LAST SHOT OF PUSHPA. What a journey’’ అంటూ బన్నీ పేర్కొన్నారు. రష్మిక, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.
LAST DAY LAST SHOT OF PUSHPA . 5 years JOURNEY of PUSHPA completed . What a journey 🖤 pic.twitter.com/eQoRhcLFMQ
— Allu Arjun (@alluarjun) November 26, 2024
అటు షూటింగ్...ఇటు ప్రమోషన్
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా సరే, దర్శకుడు సుకుమార్ షూటింగ్ చేస్తూనే ఉన్నారు. అది ఆయన స్టయిల్. గతంలోనూ పుష్ప మొదటి భాగం సమయంలోనూ ఇంతే హైరానా పడింది యూనిట్. కానీ సినిమా రిజల్ట్ తెలిసిందే. బన్నీ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. అందుకే బన్నీకి సుకుమార్ అంటే అంత నమ్మకం. ఈా సినిమా పై అంతే జాగ్రత్తగా, శ్రద్ధగా ప్రతీదీ దగ్గరుండి చూసుకున్నారు బన్నీ. నిన్నటి వరకూ షూటింగ్ జరుగుతున్నా, ప్రమోషన్లకు మాత్రం డుమ్మా కొట్ట లేదు బన్నీ. ఇప్పటికే పాట్నా లో జరిగిన ట్రయిలర్ లాంచ్ సినిమాకు నార్త్ బెల్ట్ లో ఇంకా క్రేజ్ తెచ్చి పెట్టింది. చెన్నై లో బన్నీ తమిళ్ స్పీచ్ కు అక్కడ తంబీ లు ఫిదా అయిపోయారు. ఇక చెన్నై లోని తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ సినిమా కు ప్రచారం తీసుకొచ్చింది. బన్నీ అక్కడ 20 ఏళ్ల పాటు ఉన్నారు. తనను తాను తమిళ అబ్బాయిగా ఐడెంటి ఫై చేసుకోవడంతో తమిళ తంబీలకు మంచి కిక్ ఇచ్చింది.
Also Read: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే?
అక్కడ పుష్ప 2 కి అదే ప్లస్
మన తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాలకు ఉన్నంత ఓపెనింగ్ తమిళనాడులో మన తెలుగు సినిమాలకు రాదు. కారణం, అక్కడ వారి సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ ‘పుష్ప 2’ కి ఉండే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, తమిళంలో పెద్ద సినిమాలు ఏవీ పోటీ గా లేవు. ‘ఫ్యామిలీ పడమ్’, 2కె లవ్ స్టోరీ’ వంటి చిన్న సినిమాలు తప్పితే చెప్పుకోదగ్గవి తమిళంలో లేవు. అందువల్ల పాజిటివ్ టాక్ వస్తే చాలు, ‘పుష్ప 2’ కి మంచి ఓపెనింగ్స్ బాగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు జనాలను ఆకట్టుకున్నాయి. ‘కిసిక్’ పాట కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. మొదటి భాగంలోని ‘‘ఊ అంటావా మావా’ పాటకు పోలిక తేవడంతో, కిసిక్ పాట జనాలకు అంత కిక్ ఇవ్వలేదు. ‘‘ఊ అంటావా మావా’ పాట కూడా మొదట జనాలకు ఎక్కలేదు. కానీ క్రమంగా హిట్ అయిందంటూ బన్నీ ఫ్యాన్స్ కూడా అప్పటి ట్రెండ్ ను మరొకసారి గుర్తు చేస్తున్నారు.