![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chanakya Niti In Telugu: చాణక్య నీతి: ఈ ముగ్గురికి ఎప్పుడూ సహాయం చేయకూడదు!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనం కొందరికి ఎప్పుడూ సహాయం చేయకూడదని చెప్పాడు. చాణక్యుడి విధానం ప్రకారం మనం ఏ ముగ్గురికి సహాయం చేయకూడదు..? మీరు ఈ ముగ్గురికి సహాయం చేస్తే ఏమవుతుంది?
![Chanakya Niti In Telugu: చాణక్య నీతి: ఈ ముగ్గురికి ఎప్పుడూ సహాయం చేయకూడదు! Chanakya Niti Says That We Should Never Help These 3 Types Of People Chanakya Niti In Telugu: చాణక్య నీతి: ఈ ముగ్గురికి ఎప్పుడూ సహాయం చేయకూడదు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/06/1980273db0cfbb29c77e80a524d315bd1701876989181691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chanakya Niti In Telugu: ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్తగా, దౌత్యవేత్తగా పేరుపొందాడు. ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిని అనుసరించడం ద్వారా ప్రజలు జీవితంలో విజయం సాధిస్తారు. ఎందుకంటే ఈ నియమాలను పాటించడం ద్వారా మీకు తప్పొప్పుల గురించి అవగాహన కలుగుతుంది. మీరు గందరగోళంగా ఉన్న అనేక సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. చాణక్యుడి తత్వశాస్త్రం ప్రకారం, ఇతరులకు సహాయం చేయడం మంచిదే, కానీ చాలాసార్లు మనం కొంతమందికి సహాయం చేయడం వల్ల జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. చాణక్యుడి విధానం ప్రకారం మనం ఎలాంటి వారికి సహాయం చేయకూడదు?
1. మాదకద్రవ్యాల బానిసలు
ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, మాదకద్రవ్యాల బానిసలకు మనం ఎప్పుడూ సహాయం చేయకూడదు. అలాంటి వారు మిమ్మల్ని సహాయం అడిగితే తిరస్కరించడం మంచిది. ఎందుకంటే అలాంటి వారు ఎప్పుడూ మత్తులో ఉంటారు. అవన్నీ మరిచిపోయి డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తారు. ఈ వ్యక్తులు మత్తు కోసం ఎవరికైనా హాని చేయవచ్చు. అంతే కాదు, తాగిన వ్యక్తి మంచి, చెడు అనే తేడాను గుర్తించలేడు, అందుకే అలాంటి వారికి సహాయం చేయకూడదు. వారికి సేవ చేయడం లేదా డబ్బు ఇవ్వడం ఎల్లప్పుడూ మీకు హాని చేస్తుంది.
Also Read : చాణక్య నీతి: ఈ విషయాలు బహిర్గతం చేస్తే జీవితాంతం పశ్చాత్తాపపడతారు
2. చెడు స్వభావం గల వ్యక్తి
చెడు స్వభావం ఉన్న వ్యక్తికి దూరంగా ఉండటమే మంచిదని చాణక్యుడు చెప్పాడు. నీచమైన, చెడు స్వభావం ఉన్న వ్యక్తికి ఎప్పుడూ సహాయం చేయకూడదు. అలాంటి వారికి సహాయం చేస్తే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అటువంటి వ్యక్తులతో పరిచయం ద్వారా ఒక వ్యక్తి సమాజంలో, కుటుంబంలో పదేపదే అవమానానికి గురవుతాడు. అందుకే అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి.
3. అసంతృప్త మనస్తత్వం ఉన్నవారికి
జీవితంలో తృప్తి చెందని, ఎప్పుడూ అసంతృప్తిగా ఉండే వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారికి మనం ఎంత మేలు చేస్తే బాధపడటం తప్పదు. అలాంటి వారి జీవితం ఎంత బాగున్నా వారు ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటారు. ఈ వ్యక్తులు ఇతరుల సంతోషానికి అసూయ చెందుతారు, ఎప్పుడూ ఇతరులను తిట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఎటువంటి కారణం లేకుండా అసూయ, దుఃఖంతో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండటమే మనకు మంచిదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు.
Also Read : గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పిన ప్రకారం, మన జీవితంలో పై లక్షణాలు ఉన్న ముగ్గురికి సహాయం చేయకూడదు. జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నా ఈ ముగ్గురికి మనం సహాయం చేస్తే తర్వాత పశ్చాత్తాపపడటం తప్పదని చాణక్యుడు హెచ్చరించాడు.
Also Read: మీ జీవిత భాగస్వామి మాటలను తేలికగా తీసుకోకండి, డిసెంబర్ 7, 2023 రాశిఫలాలు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)